రాష్ట్రీయం

దిక్కుతోచని డిఎడ్ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో డిఎడ్ విద్యార్థులు భవితవ్యం అయోమయంగా మారింది. డిఎడ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించి నెలలు గడుస్తున్నా నేటి వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయితేనే రెండో సంవత్సరం తరగతులకు అనుమతిస్తారు. దీంతో 2014లో చేరిన విద్యార్థులు ఇప్పటికీ మొదటి సంవత్సరం తరగతులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా గత నెలలో మొదటి సంవత్సరానికి తాజాగా మళ్లీ ప్రవేశాలు జరిపారు. దీంతో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కూడా మొదటి సంవత్సరం తరగతులకు పరిమితం కావడం బాధాకరంగా మారిందని వాపోతున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు గత నవంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. తొలుత డిసెంబర్‌లో నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం తరువాత ఈ ఏడాది జనవరి 19 నుంచి నిర్వహిస్తామని వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నెలలో కూడా పరీక్షలు నిర్వహించకుండా ఫిబ్రవరిలో జరుపుతామని అధికారులు అంటున్నారు. అసలు తాము సకాలంలో ద్వితీయ సంవత్సరం పూర్తి చేయగలమా.. లేదా అని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు జరగకపోవడంతో రెండో సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం మొదటి సంవత్సరానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఏడాదిలో 220 పని దినాలు ఉండాలి. అయితే తాము ఇంకా మొదటి సంవత్సరంలోనే ఉన్నందున ఈ పని దినాల సంఖ్య రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేందుకు అడ్డంకిగా మారుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మొదటి సంవత్సరం పరీక్షలే కానందున ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా మరి కొంత కాలం పొడిగించాల్సిన దుస్థితి ఏర్పడింది.