మెయిన్ ఫీచర్

డాలర్ డ్రీమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాకు ఇప్పుడు ఓవర్సీస్ కీలకం.
ఇప్పటివరకు నైజాం వసూళ్లు టార్గెట్ చేసుకుని సినిమాలు చేసే దర్శక నిర్మాతలు -రెండేళ్లుగా ఓవర్సీస్ మార్కెట్‌కు గురిపెడుతున్నారు. ఒకటీ అరా ప్రయత్నాలు ఫలించి తెలుగు సినిమాకు ఓవర్సీస్ పిచ్చి పట్టింది. గతంలోనూ ఓవర్సీస్ మార్కెట్‌వున్నా -రేంజ్‌ని పెంచింది మాత్రం కచ్చితంగా బాహుబలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు కళ్లప్పగించి చూసేలా చేసింది -దర్శకుడు రాజవౌళి. చాలాకాలంగానే ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. పొరుగు దేశం స్క్రీన్ కనెక్షన్ ఉందని చెప్పుకోవడానికే తప్ప -కలెక్షన్లపరంగా చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకోలేకపోయాం. అంతేకాదు కేవలం స్టార్ హీరోలుగా తెలుగు సినిమా చెప్పుకునే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జునలాంటి వారికే ఓవర్సీస్ మార్కెట్ ఉండేది. ఇప్పుడు కాలం మారింది. తెలుగు సినిమా దేశాన్నిదాటే పని సులువైంది. పైగా ఓవర్సీస్‌లో వందల వేల థియేటర్లలో విడుదలయేంతగా బలపడింది. అందుకే -స్టార్‌హీరోలకేనన్న బోర్డుపీకేసి.. ఓవర్సీస్ హీరోల లిస్టులోకి చిన్నాచితకా యువ హీరోలూ చేపోయారు. పైగా -చిన్నా పెద్ద స్టేటస్ పరిశ్రమకే పరిమితమైపోయంది. మినిమం బడ్జెట్ సినిమాలు సైతం ఓవర్సీస్‌కు దూసుకుపోయి సూపర్ వసూళ్లు రాబడుతున్నాయి. లేటెస్ట్‌గా ‘నాన్నకు ప్రేమతో’ ప్రాజెక్టు -ఎన్టీఆర్‌ను ఓవర్సీస్‌లో ఓవర్‌నైట్ క్రేజ్ హీరో చేసేసింది. ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు రాబట్టి -హీరో రికార్డుల్లో ఎన్టీఆర్‌ను థర్డ్ ప్లేస్‌కు తీసుకెళ్లింది.

ఒకప్పటి సినిమా వేరు. అప్పుట్లో జరుపుకున్న వేడుకలు వేరు. శతదినోత్సవాలు, ఏడాది పండుగల్లాంటివి ఉండేవి. తరువాత -100, 150, 175, 200 రోజుల సక్సెస్‌లు జరిపేవారు. కొనే్నళ్లకు సిల్వర్‌జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు, ప్లాటినం డిస్క్ ఫంక్షన్లు వచ్చాయి. కాలానుగుణంగా ఇప్పటి పరిస్థితి మారింది. వంద రోజుల సినిమానా? 365 రోజుల సినిమానా? అన్న లెక్కల్లేవు. వెయ్యి థియేటర్ల సినిమానా? రెండువేల థియేటర్ల సినిమానా? అన్నదే -సినిమా స్టేటస్‌ను లెక్కించే లెక్క. అలాగే మొదటి రోజు వసూళ్లెన్ని? మొదటి మూడు రోజుల వసూలెంత? వారంలో కలెక్ట్ చేసిన ఫిగరెంత? అన్న లెక్కలూ చూస్తున్నారు. దర్శక నిర్మాతలే కాదు, హీరోలూ అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు.
సినిమా హిట్టా? ఫట్టా అన్నది తొలిరోజుతోనే తేలిపోతున్న రోజుల్లో -ఈ ఫార్మాట్‌ను అనుసరించక తప్పదు. అందుకే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా -ఎక్కువ థియేటర్లలో విడుదలై నిర్మాత సగం సేవ్ అయిపోతున్నాడు. ఫ్లాప్ టాక్‌తోనూ నిర్మాతకు కోట్లు గడించిన సినిమాలు కోకొల్లలు. సో.. ఇప్పటి థియరీ ప్రకారం సినిమా విషయంలో రిజల్ట్ కంటే కలక్షన్లు ఇంపార్టెంట్. కొత్త ఏడాది రెండోవారంలో పండగ సినిమాలుగా వచ్చిన డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయన, నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా -్థయేటర్లు పంచుకునే బతికి బట్టకట్టేశాయి. నిలబడిన సినిమా కలెక్షన్లు కుమ్ముకుంటే -్ఫరవాలేదనుకున్న సినిమాలు నష్టాలకు దూరంగా నిలబడ్డాయి. నిజానికి పండగ పోటీలో టాప్ అనిపించుకున్న సినిమా సోగ్గాడే చిన్నినాయన. తరువాతి స్థానంలో చిన్న సినిమాగా వచ్చిన ఎక్స్‌ప్రెస్‌రాజా మంచి లాభాలు రాబట్టుకుంది.
***
విడుదల థియేటర్లు, వసూలు లెక్కల ప్రాతిపదికన తెలుగు సినిమా నడుస్తున్న తరుణంలో -ఓవర్‌సీస్ వసూళ్లూ కీలకంగా మారుతోంది. క్లాస్‌మాస్ తేడాలేకుండా సినిమా బాగుంటే చాలు.. ఓవర్సీస్ ఆడియన్స్ అక్కున చేర్చుకుని డాలర్లు కుమ్మరిస్తున్నారు. ఈ జనవరి సీజన్‌లో ఓవర్సీస్ నుంచి తెలుగు సినిమాలకు దాదాపుగా 30 కోట్ల వసూలు లభించింది. ఈ సీజన్‌లో -నాన్నకు ప్రేమతో చిత్రం ఓవర్సీస్‌లో నెంబర్‌వన్ అనిపించుకోవడమే కాదు, మూడోవారంలోనూ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు 14 కోట్లు బిజినెస్ చేసినట్టు అంచనా. తర్వాతి స్థానంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ నిలబడింది. ఈ చిత్రానికి 5.5 కోట్లురాగా, ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ 3 కోట్లు వసూలుచేసింది. ఇక ‘డిక్టేటర్’ మాత్రం కేవలం రెండు కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తానికి ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు తెలుగు సినిమాకు కీలకమైంది. మరి ఈ ఓవర్సీస్‌లో ఏ సినిమా ఎంత రాబట్టుకుందో చూద్దాం.
**
తెలుగు సినిమాస్థాయిని పెంచిన బాహుబలి -ఓవర్సీస్ కలెక్షన్లలో ఇప్పటికీ టాప్ ప్లేస్‌లోనే ఉంది. బాహుబలి -ది బిగినింగ్ అంటూ ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఓవర్సీస్‌లో 64.61 లక్షల డాలర్లు వసూలు చేసింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 41.45 కోట్లన్న మాట. కేవలం ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ స్థాయి వసూలు సాధించడం నిజంగా తెలుగు సినిమా రికార్డే. కేవలం
బాహుబలి తెలుగు వెర్షనే 562,227 డాలర్లు (రూ.3.5 కోట్లు) వసూలు చేసింది. ఇక తమిళ వర్షన్‌కు 481,469 డాలర్లు (రూ.3.2 కోట్లు) దక్కించుకుంది. మొత్తానికి బాహుబలి అన్ని భాషల్లో కలిపి నలభై కోట్లకు పైగా ఓవర్సీస్ వసూళ్లు చూపించిందంటే -మన సినిమా స్టామినాను అంచనా వేసుకోవచ్చు. బాహుబలి సినిమా తరువాత అంతటిస్థాయిలో వసూలు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా నిలుపుకున్న సినిమా శ్రీమంతుడు. మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగుతోపాటు ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు దక్కించుకుంది. సోషల్ మెసేజ్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సొంతూళ్లను దత్తత తీసుకోమంటూ మహేష్ చెప్పిన డైలాగ్ స్ఫూర్తితో చాలామంది సెలెబ్రిటీలు, ఎన్నారైలు ఆ దిశగా అడుగులేయడం విశేషం. ఇక మంచి క్రేజ్‌వున్న మహేష్‌బాబు నటించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో 19 కోట్లు వసూలు చేసి టాప్ టులో నిలిచింది. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా దాదాపు 114 కోట్ల వసూళ్లు దక్కించుకుని తెలుగు సినిమాను వంద కోట్ల మార్కెట్‌ను దాటించింది. ఇప్పటివరకు బాహుబలి మినహాయించి టాప్ లిస్టులో పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ వసూళ్లుండేవి. ‘అత్తారింటికి దారేది’ సినిమా ఓవర్సీస్‌లో దాదాపు 10.33 కోట్లకు పైగా వసూలుచేసి అటు ఓవర్సీస్‌లోనూ, ఇటు తెలుగులో కలిపి 74 కోట్ల వసూలు దక్కించుకుంది. ఈ రికార్డ్‌ను మహేష్ దాటి తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల హీరోగా నిలబడ్డాడు. పవన్‌కళ్యాణ్ వసూలుచేసిన 11 కోట్లు, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కేవలం రెండు వారాల్లోనే వసూలుచేసి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో మొత్తం ఓవర్సీస్ కలక్షన్లు 1,631,799 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 11.07 కోట్లు. ఎన్టీఆర్ మూడోస్థానంలో నిలిచాడు. దీంతో పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా నాలుగో స్థానానికి వెళ్ళిపోయింది. ఇక ఐదో స్థానంలో ఎవరూ ఊహించనట్టుగా నాని నటించిన ‘్భలే భలే మగాడివోయ్’ సినిమా భారీ వసూళ్లు రాబట్టి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మినిమన్ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి ఐదో స్థానంలో నిలిచింది. ‘్భలేభలే మగాడివోయ్’ సినిమా ఓవర్సీస్ కలక్షన్లు 1,427,092 డాలర్లు. అంటే 9.24 కోట్లన్న మాట. నాని, లావణ్యత్రిపాఠి జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక తరువాతి స్థానంలో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా ‘మనం’ నిలవడం విశేషం. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచి భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో 1,412,302 డాలర్లు అంటే, రూ. 9 కోట్లు రాబట్టిందన్న మాట. ఇక తెలుగు సినిమాలు వరుసగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఈ టాప్ 5 సినిమాల తరువాత ఆరోస్థానంలో నిలిచింది మహేష్‌బాబు నటించిన ‘ఆగడు’ చిత్రం. దూకుడు వంటి సంచలన విజయం తరువాత మహేష్, శ్రీనువైట్లల కాంబినేషన్‌లో రూపొందిన ఈ ఆగడు భారీ అంచనాల మధ్య విడుదలై మంచి వసూళ్లు రాబట్టుకుంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీగా బోల్తాకొట్టిన ఈ సినిమా, ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా దాదాపు 1,387,355 డాలర్లు అంటే రూ. 9 కోట్లు రాబట్టిందన్న మాట. ఈ సినిమా తరువాత మహేష్‌బాబు, వెంకటేష్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. చాలాకాలం తరువాత తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు తెరలేపిన సినిమా. తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓవర్సీస్‌లో 1,262,100 డాలర్లు అంటే రూ.8.56 కోట్ల వసూళ్లు రాబట్టుకుంది. ఇక అత్తారింటికి దారేది సినిమాతో కలక్షన్ల సునామీ క్రియేట్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా తెలుగులో మాత్రం యావరేజ్‌గా నిలిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కలక్షన్లు మాత్రం జోరుగా వసూలుచేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఓవర్సీస్‌లో 1,254,699 డాలర్లు అంటే రూ. 8.50 కోట్లు వసూలుచేసి అల్లు అర్జున్‌కూ మంచి మార్కెట్ ఉందని నిరూపించింది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’సినిమా కూడా ఓవర్సీస్‌లో దుమ్ము దులిపింది. తెలుగులో పెద్దగా విజయాన్ని నమోదుచేసుకోక పోవడంతో అక్కడ కలక్షన్లు తగ్గాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1,232,757 డాలర్లు అంటే రూ. 8.3 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా చెప్పుకుంటూపోతే తెలుగు సినిమా డాలర్ డ్రీమ్స్ నెరవేరతున్నట్టే చెప్పుకోవాలి. ఏ సినిమాకైనా వసూళ్లెలా ఉన్నాయన్నదే ముఖ్యం. అయితే సినిమా హిట్ ప్లాప్‌కూడా వసూళ్ల విషయంలో కీలకంగా మారుతుంది. తెలుగు సినిమాస్థాయి ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లో కీలకంగా మారింది. అప్పట్లో తెలుగు సినిమా ఓవర్సీస్‌లో విడుదల చేయాలంటే చాలారకాల సమస్యలు ఉండేవి. ఒకవేళ ఆ సినిమా అక్కడ విడుదల చేసిన దానికి సరైన పబ్లిసిటీ, దూరంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అంత అంత రేట్లు పెట్టి సినిమాను చూడడానికి వస్తారా? అనే సవాలక్ష కారణాలు ఉండేవి. అక్కడ సినిమా విడుదల చేయాలనుకున్న డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు మామూలువి కాదు. తెలుగు సినిమాలు అక్కడ విడుదల చేయాలంటే కేవలం తక్కువ థియేటర్లే అందుబాటులో ఉండేవి. తెలుగు సినిమాలు చూసేందుకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపేవారు కాదు. కేవలం అభిమానులే సినిమాలకు వెళ్ళేవారు. దాంతోపాటు అక్కడ సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సమస్యల్లో ఓవర్సీస్‌లో విడుదలైన తెలుగు సినిమా ఇప్పుడు అక్కడ జెండా ఎగరేసింది. మొత్తానికి తెలుగు సినిమాలో కొత్తదనం అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనడం కూడా మరో కారణం. ఏదిఏమైనా టాలీవుడ్ సినిమా డాలర్ డ్రీమ్ తీరిందని చెప్పాలి.

-ద్వివేది