జాతీయ వార్తలు

దేశద్రోహులకు వత్తాసు పలుకుతారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జెఎన్‌యు వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ద్వారా రాహుల్ గాంధీ తన మదిలో దేశ ప్రయోజనాలకు చోటులేదని నిరూపించుకున్నారని అమిత్ షా విమర్శించారు. వేర్పాటువాద శక్తులతో చేతులు కలిపిన రాహుల్ గాంధీ మరోసారి దేశ విభజన జరగాలని కోరుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు. ఈ వివాదంపై అమిత్ షా తొలిసారి మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పలు ప్రశ్నలను సంధించారు. వామపక్ష ప్రగతిశీల భావజాలం పేరుతో రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలకడం ఆమోదయోగ్యం కాదని, కనుక జెఎన్‌యు వ్యవహారంలో ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ‘ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కేంద్రంగా మార్చి దేశ రాజధానిలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చుంటే దేశానికి మంచి జరుగుతుందా? ఇటువంటి దేశ వ్యతిరేకులకు మద్దతుగా నిరసన తెలియజేయడం ద్వారా మీరు దేశద్రోహులను ప్రోత్సహించడం లేదా? అంటూ అమిత్ షా తన బ్లాగులో రాహుల్ గాంధీని నిలదీశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు మద్దతుగా జెఎన్‌యులో కొన్ని శక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’, ‘ఇండియా గో బ్యాక్’, ‘్భరత్ నాశనం కావాలి’ అంటూ నినాదాలు చేసిన విషయాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటువంటి శక్తులతో కాంగ్రెస్ నాయకుడు చేతులు కలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో రాహుల్ ఈ శక్తులకు వత్తాసు పలకడాన్ని చూస్తుంటే మరోసారి దేశ విభజన జరగాలని ఆయన కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని బిజెపి నేత విమర్శించారు. కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవన్న విషయం జెఎన్‌యులో రాహుల్, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు చేసిన ప్రకటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయని అమిత్ షా నిప్పులు చెరిగారు.