హైదరాబాద్

డబుల్ బెడ్‌రూం దరఖాస్తుకు గడువు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన ప్రకటన గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా పరిధిలో లక్ష ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనకు ప్రజలనుండి బాగానే స్పందన కనిపిస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను కనీసం పరిశీలించి రికార్డు చేసే సమయం కూడా లేని పరిస్థితి నెలకొందంటే ఇళ్లకోసం ఎంతమంది ఎదరు చూస్తున్నారో తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒకేరోజు ఏడువేలమంది మహిళలు ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారంటే తెరాస ప్రభుత్వంపై డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ఎంత ఒత్తిడి ఉందో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ముందు నగర ప్రజలకు మంచినీటి బిల్లులు, విద్యుత్ బిల్లుల మాఫీతోపాటు డబుల్ బెడ్‌రూంఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రకటన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో ఆశలు రేకెత్తించింది. ఇదే అదనుగా కొంతమంది దళారులు కూడా భారీ సంఖ్యలో జాబితా రూపొందిస్తూ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయింపచేస్తామని నిరుపేదలకు ఆశ చూపుతూ ప్రత్యేకంగా ఒక దరఖాస్తు పత్రాన్ని తయారుచేసి పంపిణీ చేస్తున్నారంటే దీనివెనుక చాలామంది మోసపూరిత కుట్రలు చేసే ప్రమాదం వుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం దరఖాస్తు చేసుకునే చివరి గడువు సోమవారంతో ముగుస్తుందన్న ప్రచారంపై ఒక్కరోజే ఏడువేల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు జిల్లానుండి 17వేల దరఖాస్తులు ఇళ్లకోసం వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 2005-06లో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లిస్తామని అప్పటి ఫ్రభుత్వం చేసిన ప్రకటనతో సుమారు లక్ష నాలుగువేల మంది 1000, 2000 రూపాయలు చెల్లించి రాజీవ్ గృహకల్ప, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకాల ద్వారా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు 60వేల ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టగా అందులో పూర్తయిన 42వేల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. ఇంకా 22వేల ఇళ్లు పాక్షిక నిర్మాణాలు చేపట్టాల్సి వుండగా దానిని పూర్తి చేయలేని ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. పది సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకే అందరికీ ఇవ్వని పరిస్థితుల్లో మళ్లీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడంతో పేదల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. అప్పట్లోనే ఎంతోమంది దళారులు 30నుంచి 40 వేల వరకు ముంబయి, దుబాయ్, చెన్నయ్ తదితర పట్టణాల్లో నివసించే వివిధ జిల్లాకు చెందిన తెలుగువారి నుండి బినామీ పేర్లతో దరఖాస్తులు చేయించి మోసం చేసిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగుచూసాయి. పలుచోట్ల కేసులు నమోదుచేసి విచారణ జరుపుతుండగా మరికొందరిపై కేసులు పెట్టే ప్రమాదం ఉండడంతో ఎవరికీ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం చేసిన ప్రకటనతో వేలకొద్దీ దళారులు పుట్టుకొచ్చి తాము ఇళ్లిస్తామంటూ జాబితాలు రూపొందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి సంబంధించి దరఖాస్తులను తహశీల్దార్ ఆధ్వర్యంలో స్వీకరించి పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్వ్రు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఆయా వార్డు స్థాయిల్లో గ్రామ సభలను నిర్వహించేందుకు ముందస్తు తేదీలను ప్రకటించి ఆయా తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఇళ్లకోసం దరఖాస్తులు చేసుకునేవారు జిల్లా కార్యాలయానికి కానీ ఇతర కార్యాలయాలకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదని, గ్రామస్థాయిలో తేదీలు నిర్వహించిన తరువాతే ఆయా ప్రాంతాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులను కూడా సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు పంపించి వారి వారి అర్హతను పరిశీలించాల్సివుందని తెలిపారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ దరఖాస్తుదారులకు సూచించారు.