భక్తి కథలు

అభినవ ఘంటసాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.అక్కిరాజు సుందర రామకృష్ణ జగమెరిన కళాకారుడు. ఈయన కవి, నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత- ఇన్ని మంచి గుణాలు ఒకే మనిషిలో ఉండటం చాలా అరుదు. హైదరాబాద్‌లో ప్రైవేటు కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి తీసుకున్నారు. పద్యకవి, అధిక్షేప కావ్య రచయిత వీరు!
* మీరు ఏ పుస్తకాలు రాశారు?
నేను ఎన్నో పుస్తకాలు రాశాను. వాటిలో శారదా, రంగరంగా, అమ్మతోడు, మాధవా కేశవా, బాపూ రమణా మొదలైనవి ప్రసిద్ధ గ్రంథాలు. దాదాపు 30 రాశాను.
* మీరు ఆడియో సిడీలు కూడా రిలీజు చేశారు కదా!
చాలా సీడీలు వచ్చాయి నావి. వాటిలో శ్రీకృష్ణార్జున, షిర్డీసాయి సుప్రభాతం, సత్యసాయి స్తుతి, బాసర సరస్వతి, కాళహస్తీశ్వరా మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి.
* మీరు ఎన్నో పాత్రలు వేశారుకదా, రంగస్థలంలో?
అవును. చింతామణి నాటకంలో బిల్వమంగళుడిగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. శ్రీకృష్ణతులాభారంలో, శ్రీకృష్ణరాయబారంలో కృష్ణుడి పాత్రకి బాగా ఖ్యాతి వచ్చింది. ప్రఖ్యాత సినీనటి, కళాభినేత్రి శ్రీమతి జమునగారితో నేను శ్రీకృష్ణతులాభారం యావద్దేశం పర్యటించాను. అర్జునుడి పాత్ర కూడా చాలాసార్లు వేశాను. ‘్భవన విజయం’ అనే సాహిత్య రూపకం ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను నేడు కళ్ళముందుకు తెస్తుంది. నేను తెనాలి రామకృష్ణుడిగా భారతదేశంలో, ఎన్నో విదేశాలలో కూడా వేశాను. గయోపాఖ్యానంలో సందర్భోచితంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు వేస్తాను. రామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడు, ఆంజనేయుడుగా వేస్తాను. సత్యహరిశ్చంద్ర చాలా ప్రఖ్యాతి తెచ్చింది. సాహిత్య రూపకాలు చాలా వేశాను. భారతావతరణం, కనకాభిషేకం- శ్రీనాథుడి దర్బారు అందులో శ్రీనాథుడిగా వేశాను. నేనుసినిమాల్లో కూడా శివ, ముఠామేస్ర్తీలో గవర్నరు, ఠాగూరులో ప్రిన్సిపాలు, ఎగిరే పావురంలో సంగీత విద్వాంసుడు- ఇలా దాదాపు వంద సినిమాలలో వేషంకట్టాను.
* మీరు టీవీ సీరియల్స్‌లో కూడా చేశారు!
అవును. పోతన, శ్రీనాథుడు, నన్నయభట్టు, అల్లసాని పెద్దన పాత్రలు వేశాను. మర్యాదరామన్న సీరియల్‌లో ఎన్నో పాత్రలు వేశాను. జెమిని వారి పెళ్లిపందిరిలో వంద ఎపిసోడ్స్‌లో వేశాను.
* విదేశాలలో కొన్ని ముఖ్య అనుభవాలు, ఎలాంటివి?
నేను యుఎస్‌ఎ ఆరుసార్లు వెళ్ళాను. దుబాయి, సింగపూరులో కూడా ప్రదర్శించాను. ముఖ్యంగా యుఎస్‌ఏలో అట్లాంటిక్ మహా సముద్రంనుండి, ఫసిఫిక్ సముద్రందాకా మియామి, బిఫలో, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ భువనవిజయం ప్రదర్శించారు. ముఖ్యంగా తెనాలి రామకృష్ణుడి పాత్ర వేసినా, సందర్భోచితంగా శ్రీకృష్ణదేవరాయలుగా కూడా వేశాను. యుఎస్‌ఏలో శ్రీకృష్ణదేవరాయలుగా పూర్వాశ్రమంలో శ్రీ ప్రసాదరాయ కులపతి వేశారు. ఆయన నేడు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేంద్రస్వామి. తిమ్మరుసుగా ముదిగొండ శివప్రసాద్, నేను తెనాలి రామకృష్ణగా వేశాను. అవి మనస్సుకు హత్తుకుపోయిన ప్రదర్శనలు.
* కళాకారుడిగా మీరు ఇబ్బందులు ఎలా అధిగమించారు?
జవాబు:ఏ కళలో అయినా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా టీవీ, సినిమా, రంగస్థలం పోటీ రంగం. కేవలం నా ప్రతిభ, కృషి, అభ్యాసంతో పైకి వచ్చాను. రబ్బరుబంతిలా ఎగిరి పైకి వచ్చాను. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ రంగస్థలంలో ప్రదర్శిస్తున్నాను. నిన్న హైదరాబాదు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) భువనవిజయంలో వేశాను. కేవలం కళపై నాకున్న ప్రేమ, మమకారం నాకు ప్రేరణ ఇచ్చింది.
* కళాకారులకు మీరు ఇచ్చే సందేశం
జవాబు:అడ్డదారులు, షార్టుకట్స్ తీసుకోకూడదు. ఇది అన్ని రంగాలకి వర్తిస్తుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, రంగస్థలం, టివి, సినిమా- ఎందులోనైనా కష్టపడి పైకి రావాలి. కేవలం ప్రతిభ, అభ్యాసం, సృజనమీద ఆధారపడాలి.

పద్యగద్యనాటకాలు,సినిమాల్లో నటునిగా, రచయతగా మెప్పుపొందుతున్న
డా.అక్కిరాజు సుందర రామకృష్ణ