Others

గుణమే మిన్నన్న అన్న బ్రహ్మన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కలియుగంలో కలిగే వింతలన్నింటినీ ఇంతకు పూర్వమే పోతులూరీ వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు. వీరు జరుగబోయే కథలను ఆనాడే వివరించారు. కందిమల్లయ్యపల్లెలో నివాసం ఉన్నవీరు సాధారణ గృహస్థుగానే ఉండేవారు. వీరి భార్య గోవిందమ్మ. ఒకసారి ఆ ఊరివారు చందాలు వసూలు చేస్తూ పోతులూరి వీరయ్యగారినికూడా చందాకోసం నిర్బంధించారు. ఆయన నా దగ్గర పైకం లేదన్నారు. ఈ సంగతి రచ్చబండ దగ్గర ఊరి పెద్దకు చెప్పడానికి రమ్మన్నారు. ఆ రచ్చబండ దగ్గర కూర్చుని ఆ ఊరి పెద్ద చుట్ట వెలిగించుకోవడానికి నిప్పుకోసం వెతుక్కుంటుంటే అక్కడే ఉన్న వీరయ్యగారు రచ్చబండమీద ప్రతిష్టించి ఉన్న పోలేరమ్మ అమ్మవారిని ఉద్దేశించి‘ఓ పోలేరీ నిప్పు తీసుకొనిరా’అని అన్నారట. అంతే ఆ విగ్రహం లోంచి అమ్మవారు చిన్న బాలికగా నిప్పును ఒక మూకుడులో పెట్టుకొని వచ్చి ఇచ్చిందట.
దాంతో వీరయ్యగారి మహిమను తెలుసుకొన్న ఊరివారు వీరే కాలజ్ఞానతత్వాలను చెప్పే వీర బ్రహ్మంగారిగా గుర్తించారు. వీరబ్రహ్మంగారికి ఉన్న శిష్యుల్లో సిద్ధయ్య, కక్కయ్య అనేవారు ప్రసిద్ధులు. ఒకసారి వీరబ్రహ్మంగారు సిద్ధయ్యకు షట్చక్రాలను వివరిస్తున్నారు. ఆ వివరణను చాటునుండి కక్కయ్య విన్నాడు. గురువుగారిపై అపార నమ్మకమ్ను కక్కయ్య వెంటనే ఇంటికి వెళ్లి తన భార్యను శరీరాన్ని కోసి ఎక్కడ ఆ చక్రాలు ఉన్నాయో అని వెతికారు. కాని అవి కక్కయ్యకు కనబడలేదు. వెంటనే గురువుగారి దగ్గరకు వచ్చి ‘స్వామీ మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారు. నేను నా భార్య శరీరాన్ని కోసి చూచి వచ్చాను’అని చెప్పాడు. అపుడు వీరబ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి కక్కయ్యతోపాటు వారింటికి వెళ్లి తిరిగి కక్కయ్య భార్య ను బతికించి ఆ తరువాత కక్కయ్యకు జ్ఞానోపదేశం చేశారు. అప్పటి నుంచి కక్కయ్య వీర బ్రహ్మంగారికి ప్రియశిష్యునిగా మారాడు.
బ్రహ్మంగారి బోధనలు విన్నవారు మానవత్వంతో మసలుకొంటారు. కులంకన్నా గుణమే మిన్న అని వీరబ్రహ్మంగారు బోధించారు. ఆనాడున్న అస్పశృతానివారణలోను, కులమతాల జాడ్యం వదిలించడంలోను వీర బ్రహ్మంగారు ఎంతో కృషి చేసి ప్రజలందరూ ఈశ్వరుని సంతానమని చెప్పుతూ వారిని చైతన్యవంతులను చేశారు. బనగానపల్లెకు మూడు కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే ఆనాడు వీరబ్రహ్మంగారు అచ్చమ్మగారి ఆవులను మేపేవారు. ఈ ప్రాంతం లో ఎక్కడా పచ్చగడ్డి అన్నా మొలవని రాళ్లు రప్పలున్న ప్రదేశం.కాని ఆ రోజుల్లో ఇక్కడ ఒక గిరి గీసి ఆ గిరిలో ఆవులను నిలిపి తాను కాలజ్ఞానాన్ని వ్రాస్తూ కూర్చునేవారట వీరబ్రహ్మంగారు. ఆ గిరి గీసినంత మేర పచ్చటి పచ్చిక మొలిచేదట. ఆ గడ్డిని తిన్న ఆవులు అధికంగా పాలు ఇచ్చేవట. అది కూడా వీరబ్రహ్మంగారి మహిమనే అని వీరబ్రహ్మంగారి భక్తులు చెబుతారు. ఇట్లాంటి మహిమలెన్నో బ్రహ్మంగారు చూపారని చరిత్ర చెబుతోంది.

- డా. ఎ. రాజమల్లమ్మ