మెయిన్ ఫీచర్

యాజ్ఞసేని 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమ్మరి ఇంట్లో ప్రవేశించిన పాండవులు, ద్రౌపది శయనించి ఉండటాన్ని చూస్తాడు దృష్టద్యుమ్నుడు. అలా పరుండిన పాండవులు సేనాధికారుల గురించీ, దివ్యాస్త్రాల గురించి, రథాలు, ఏనుగులు, ఖడ్గాలు మొదలగువాటి గురించి మాట్లాడుకొనటం వింటాడు. వారలా మాట్లాడుకొనటం పాంచాలి కూడా విన్నది. పాండవులు మాట్లాడుకొన్న విషయాలను వినిన దృష్టద్యుమ్నుడు అక్కడనుండి బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు విచారంతో ఉన్నాడు. దృష్టద్యుమ్నుని చూచి ‘‘ద్రౌపది ఎక్కడికి వెళ్లింది? ఎవరు తీసికొని వెళ్ళారు? నా పుత్రికను గెలిచినవాడెవడు? పాండు పుత్రులు బ్రతికే ఉన్నారా? నేడు మత్స్యయంత్రాన్ని ఛేదించినవాడు పాండవ మధ్యముడైన అర్జునుడేనా? అని ఆత్రుతతో అడిగాడు.
తండ్రి ఆత్రుతని చూచి దృష్టద్యుమ్నుడు ‘‘వింటిని ఎక్కుబెట్టి లక్ష్యాన్ని పడగొట్టిన ఆ యువకుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఎవ్వరిని కలయక వేగంగా నిష్క్రమించాడు’’ అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.
‘‘అయితే ద్రౌపది ఏమయింది?’’ అడిగాడు ద్రుపదుడు.
‘‘ద్రౌపది మిక్కిలి ప్రసన్నతతో అతడిని అనుసరించింది. అప్పుడు దానిని సహించలేని రాజులందరూ అతడిని, అతడితోయున్న మరొకడిని ముట్టడించారు. ఆ యిద్దరూ కలిసి ఆ రాజ సమూహాన్ని ఎదుర్కొని వారు వెనుకకు తిరిగి పారిపోయేటట్లుగా చేశారు. అందరూ చూస్తుండగానే వారు ద్రౌపదితో కలిసి నగరానికి వెలుపలనున్న ఒక కుమ్మరివాని ఇంటిలోనికి ప్రవేశించారు’’ అని చెప్పాడు దృష్టద్యుమ్నుడు.
‘‘ఆ ఇంటియందు మరెవరున్నారు?’’ అడిగాడు ద్రుపదుడు.
‘‘ఆ ఇంటిలో అగ్నిశిఖతో సమానంగా వెలుగుచున్న ఒక స్ర్తి అసీనురాలై యున్నది. ఆమె ఆ వీరుల మాతృమూర్తి కావచ్చును. ఆమె ప్రక్కనే మరి ముగ్గురు వీర పురుషులు కూర్చొని ఉన్నారు. ఇంటిలో ప్రవేశించగానే ఆ ఇద్దరు వీరులు తల్లి పాదాలకు నమస్కరించి ద్రౌపదిని కూడా నమస్కరించమన్నారు. ఆమెను తల్లికి అప్పగించి ఆ ఐదుగురు కలిసి భిక్షాటనకు వెళ్లిపోయారు’’ అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.
‘‘ఆ తరువాత ఎప్పుడు తిరిగి వచ్చారు?’’ అడిగాడు ద్రుపదుడు.
‘‘వారు భిక్షాటన ముగించుకొని తిరిగి వచ్చారు. తల్లికి నమస్కరించారు’’. ఆమె ద్రౌపదిని చూసి-
‘‘రాకుమారి! తెచ్చిన భిక్షాన్నాన్ని దేవతలకు బలిగా కొంత భాగాన్ని, బ్రాహ్మణులకు కొంత భాగాన్ని యిమ్ము. మిగిలిన దాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఆ మహాకాయుడికి వడ్డించి తక్కిన భాగాన్ని మా అయిదుగురికి వడ్డించి, చివరిగా నీవు భుజింపుము’’ అని అన్నది. ఆమె ఆజ్ఞ ప్రకారం ద్రౌపది నడుచుకొన్నది’’ అని వివరించాడు దృష్టద్యుమ్నుడు.
‘‘వారి గురించి నీ అభిప్రాయం ఏమిటి?’’ అడిగాడు ద్రుపదుడు.
‘‘్భజనానంతరం ఆ అయిదుగురు ఒక ప్రక్కగా శయనించారు. వారి పాదాలచెంత ద్రౌపది శయనించింది. అలా పడుకొని ఆ వీరులు యుద్ధ నైపుణ్యాల గురించి, మధ్య మధ్య విచిత్రాలైన కథలు చెప్పుకొన్నారు. వారి మాటలను బట్టి వారు క్షత్రియులు అనక తప్పదు. వారు బ్రాహ్మణులుగానీ, శూద్రులు గానీ కారు’’ అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.
‘‘క్షత్రియులైతే వారెవరై ఉంటారు?’’’ అడిగాడు ద్రుపదుడు.
‘‘వారి మాటలను బట్టి ఆ అయిదుగురు తప్పక పాండవులై ఉంటారు. ఆమె వారి తల్లి కుంతీదేవి అయి వుంటుంది. లాక్షగృహం నుండి తప్పించుకొని బ్రాహ్మణ వేషధారులై కాంపిల్యంలో దాగియున్నారన్నది నిశ్చయమని చెప్పవచ్చును’’ అని అన్నాడు దృష్టద్యుమ్నుడు.
అంత ద్రుపదుడు తన పురోహితుని పిలిపించి అతడిని వెంటనే కుమ్మరి యింటికి పోయి అక్కడ వున్నవారు పాండుపుత్రులైన పాండవులేనా తెలిసికొని రమ్మన్నాడు.
ద్రుపద పురోహితుడు బ్రాహ్మణ సమూహంతో పాండవులున్నచోటికి వచ్చి ధర్మరాజును చూస్తాడు. భీమసేనుడు ఆ ద్రుపద పురోహితునికి అర్ఘ్యాదిపూజలు సమర్పించాడు. అంత ఆ ద్రుపద పురోహితుడు ధర్మరాజుతో-
‘‘గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న మహానుభావా! ద్రుపద మహారాజు మీ కులగోత్రాలను, మిమ్ముల గురించి తెలిసికొనాలని ఆసక్తుడై వున్నాడు. ఆ రాజుకు సంతోషం కలిగే విధంగా నాకు తెలయజేయండి. ఆశ్చర్యకరమైన మత్స్యయంత్రాన్ని తన పరాక్రమంతో పడగొట్టిన ఆ మహావీరుడిని చూడ మా రాజు ఆరాటపడుచున్నాడు’’ అని అన్నాడు.
‘‘మీ రాజు ఆలోచించి ఎంతో సులువైన నియమాన్ని చేసి, మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వీరుడే తన కూతురుకు భర్త అవుతాడన్నాడు. అతడు చెప్పినట్లుగానే మత్స్యయంత్రాన్ని పడగొట్టి, ఇదిగో ఇతడు ఈ కన్ను రాజులందరి సమక్షంలో గ్రహించాడు. ఇపుడు మీ రాజు తెలిసికొనటం ఎందుకు? తెలిసికొని ఏమి చేస్తాడు?

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము