రంగారెడ్డి

ఆస్తి ఇవ్వలేదని తండ్రిపై కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 13: ఆస్తి ఇవ్వడం లేడన్న కోపంతో ఓ వ్యక్తి కన్నతండ్రిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం డివిజన్ సుభాష్‌చంద్రబోస్ నగర్‌లో నివాసముండే షాబుద్దీన్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు నాజుద్దీన్ పని లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. కాగా చిన్న కొడుకు వివాహం షాబుద్దీన్ చేశాడు. దీంతో నాజుద్దీన్ తనకు ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేయగా తండ్రి షాబుద్దీన్ ఏం చేస్తున్నావని ఆస్తి ఇవ్వాలని ప్రశ్నించాడు. ఆస్తి ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో కత్తితో నాజుద్దీన్ తండ్రి షాబుద్దీన్‌పై దాడి చేశారు.