తెలంగాణ

తల్లి, తమ్ముళ్లపై ఉన్మాది దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ ఉన్మాది తల్లి, తమ్ముళ్లు, మరదలిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కోనాపూర్‌లో బుధవారం జరిగింది. కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కుంచెం బాలయ్య తనకు డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు అందుకు అంగీకరించనందున ఇద్దరు తమ్ముళ్లపైన, అడ్డువచ్చిన తల్లి, మరదలిపైనా దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన నలుగురినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.