డైలీ సీరియల్

యమహాపురి 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ అందరికీ పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైపోయారు కాబట్టి- నేటినుంచీ నరకపురి నాకపురి కావాలని చెప్పాడు. పాపులను ఉద్ధరించడానికి తను మరో నరకపురిని వెదుక్కుంటూ వెళ్లాడు. ఐతే ఆయన నన్ను వెయ్యి కళ్ళతో కనిపెడుతుంటాడు. నేను పొరపాటు చేస్తే స్వయంగా వచ్చి మందలిస్తాడు. మనమంతా యమకి జయజధ్వానాలు పలుకుదాం’’ అన్నాడు రాజా.
ఊరంతా యమకి జయజయధ్వానాలు పలికారు.
రాజా నాకపురిలో అడుగెట్టాడు. యమ ప్రాంగణం చేరుకున్నాడు.
మాత ముందు నిలబడి, ‘‘ఇది నాకపురి, ఇక్కడ పెద్దలకు పాదాభివందనం చెయ్యడం మర్యాద’’ అంటూ ఆమె కాళ్ళకి దణ్ణం పెట్టాడు.
మాత ముఖంలో భర్త గురించి దిగులు లేదు. ఆమె ఆప్యాయంగా అతణ్ణి లేవనెత్తింది.
అతడి కళ్లలో ఉత్సాహం లేదు. దిగులుంది.
‘‘నరకపురిని నాకపురిని చేశావు. ఎందుకు నాయనా దిగులు?’’ అంది మాత అనునయంగా.
‘‘పేరు నాకపురి కావచ్చు కానీ ఇంకా ఇది అవినీతిపరులకు నిధి నిక్షేప ప్రాంగణం. యమ స్థానంలో వచ్చిన నేను వాళ్లకి తలఒగ్గలేను. ఒగ్గక మనలేను..’’ అతడి కళ్లలో దిగులు గొంతులోకి దిగింది.
మాత నవ్వింది. ‘‘వెర్రివాడా! ఇప్పుడు మార్పు ఒక్క నరకపురిలోనే వచ్చిందనుకున్నావా? యావద్దేశంలో వచ్చింది. నేతలు మారారు. నల్లధనాన్ని నరకపురుల ప్రాంగణాలనుంచి జనగణాలకు తరలించి సంక్షేమానికి వినియోగించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి’’ అంది.
ఆ మాటలో భావిపట్ల అంతులేని ఆశాభావముంది.
****
ఆ రాత్రి రాజాకి కలలో జగదానందస్వామి కనిపించాడు.
‘‘స్వామీ! ఎంతమందికి అందించేవయ్యా నీ దీవెనలు?’’ అనడిగాడు రాజా స్వామిని.
‘‘నాయనా! నా దీవెన ఒక ప్రేరణ. దీవించడం వరకే నా వంతు. సాధించడం మీ వంతు’’ అని మాయమయ్యాడు స్వామి.
అప్పుడు రాజాకి మాత మాటలు గుర్తుకొచ్చాయి. ‘‘ఇప్పుడు మార్పు ఒక్క నరకపురిలోనే వచ్చిందనుకున్నావా? యావద్దేశంలో వచ్చింది. నేతలు మారారు. నల్లధనాన్ని నరకపురుల ప్రాంగణాలనుంచి జనగణాలకు తరలించి సంక్షేమానికి వినియోగించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి’’.
‘‘స్వామీ! సాధించడం తమ వంతని భారతీయులంతా తెలుసుకున్నట్లే వుంది’’ అనుకున్నాడు రాజా.
ఆ తరువాత అతడికి ఒళ్ళెరుగని నిద్ర పట్టింది.
- ‘‘నువ్విక్కడకొచ్చి మా వారిని కలుసుకోవడం గురించి ఏమేమో కథలు చెప్పావు. కానీ ఈ ఊళ్ళో నీకు లభించిన గౌరవం నిజానికి నీక్కాదు, ఆ కంకణానికి’’ అంది మాత.
రాజా ఆశ్చర్యంగా తన చేతికున్న కంకణాన్ని చూసుకున్నాడు.
ఎదురుగా మాత. ఆమె భర్త చావుకి తను కారణమయ్యాడు.
ఊరంతా తనని యమకి ప్రతినిధి అని గౌరవిస్తున్నారు. ఆ యమ చావుకి తను కారణమయ్యాడు. ఈ నిజం బయటపడితే...
శ్రీకర్ రాజా మనసు చదివినట్లు, ఆ విషయం మాట్లాడవద్దన్నట్లుగా హెచ్చరికగా చెయ్యి గట్టిగా నొక్కాడు. కాసేపటికి ఇద్దరూ ఊరొదిలి వెళ్లారు.
****
మర్నాడుదయం నరకపురి చెక్‌పోస్టులో గ్రామస్థులు యమ రాకకోసం ఎదురుచూస్తున్నారు
కాసేపటికి ఊరి పొలిమేరల్లో ఓ కారాగింది. అందులోంచి రాజా దిగాడు. ‘‘యమకి మీ అందరి సందేశం చేరింది. ఆయన తనపట్ల మీకున్న ప్రేమాభిమానాలకి ఎంతో సంతోషించాడు. తను తిరిగివస్తే మీరు పాత జీవితంవైపు మొగ్గు చూపిస్తారని ఆయన భయపడ్డాడు. ఈ ఊళ్ళో కొత్త పద్ధతి కొనసాగాలని చెప్పాడు.
బిచ్చగాడి వద్ద బంగారు కంకణమేమిటని ఎవరూ అనుమానించకుండా ఆ కంకణం నకిలీదని చెప్పాలనీ, ఆ కంకణం లభించినవారిని నరకపుర వాసులు యమతో సమానంగా గౌరవించాలనీ నేనన్నాను. అన్నింటికీ ఒప్పుకున్నారు కానీ- ఇంతవరకూ ఆయన ఎవరికీ ఆ కంకణం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది వచ్చినట్లుంది’’ అని

అయపోయంది

వసుంధర