డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అ సలు టాక్సీ వాళ్ళు కూడా ఆ వైపుకి రావాలంటేనే భయపడతారు. ఇక్కడ మనం ఒంటరిగా వెళ్ళలేము. అసలు అనుమతించరు కూడా. ఒకవేళ నా యూనిట్ కాకుండా మరో యూనిట్ టెరిటరీకి వెళ్ళాలన్నా కబురు పంపకుండా వెళ్ళను. ఎందుకంటే ననే్న మిలిటెంట్ అని అనుకుని చంపే ప్రమాదం ఉంది. ఎందుకంటే మిలిటెంట్లు అప్పుడప్పుడు ఆర్మీ దుస్తులు ధరించి వస్తూ వుంటారు. అందువలన ఆర్మీ కాన్‌వాయ్ కనుక బయలుదేరితే అందరికీ తెలిసే వుంటుంది. ఒకవేళ నలభై ఆర్మీ కాన్‌వాయ్‌లు బయలుదేరినా నలభై ఒకటో కాన్వాయ్ మిలిటెంట్లది కావచ్చు. అందువలన అడుగడుగునా జాగ్రత్తగా ఉంటాము’’.
‘‘బాప్‌రే! ఇది కాశ్మీరా! కారాగారమా! సిద్ధార్థకి అన్నపట్ల సహానుభూతి కలిగింది. ఇంటివాళ్ళు ఎంత వద్దన్నా దేశ సేవ అంటూ మిలటరీలో చేరాడు. ఏం దొరికిందని?
లెక్కగా అంతో ఇంతో జీతం. అడుగడుగునా ప్రమాదమే. కత్తులు - కటారులు- రక్తపాతం.. క్షణక్షణం చావు భయం.’’
సిద్ధార్థ మనస్సు బరువెక్కింది. అన్నయ్య ఉచ్చులో ఇరుకున్నాడు.
రాత్రి..
సిద్ధార్థ రాత్రి పడుకునే ముందు అన్నయ్య పక్కన ఎ.కె.47ని చూశాడు. పక్కన ప్రియురాలిని పడుకోబెట్టుకున్నట్టుగా అన్నయ్య రైఫిల్‌ని పక్కన పెట్టుకున్నాడు. వౌనంగా ఉండిపోయాడు.
తమ కుటుంబంలో తాత ముత్తాతల తరాల నుండి ఎవరు కనీసం ఎ.కె.47ని చూడనైనా చూడలేదు. కాని ఈ మహాశయుడు దాన్ని పక్కలో పెట్టుకుని పడుకుంటున్నాడు. మనస్సు గిలగిలా కొట్టుకుంది. క్యాంప్ బయట చిమ్మ చీకటిగా ఉంది. గదిలోపల చిన్న లైటు వెలుగుతోంది. మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
‘బయట చిమ్మచీకటిగా ఉంది. లోపల ఎ.కె.47!’ నవ్వాడు సందీప్.
‘గులాబీలు, చినారులు, రకరకాల రంగు రంగుల పూలు, ఆకాశంలో అందమైన మేఘాల కింద గలగలా పారే ఝాలం నది.. ఇక్కడ అడుగుడగునా ఒకవైపు ప్రకృతి సౌందర్యం కన్నుల పండుగా వుంటే మరోవైపు హింస, రక్తపాతం, అనుమానాలు, ద్వేషాలు, తుపాకీల మందు ఎప్పుడు పేలుతుందో ఎవరికెరుక? పోయిన వారం జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను విను. ఏ మాత్రం లేసమాత్రమైనా తప్పు జరిగి ఉంటే మేం అందరం ముక్కలై పోయేవాళ్ళం. ఆ రోజు మేం అందరం క్యాంప్‌లో కూర్చున్నాము. అందరం మంచి మూడ్‌లో ఉన్నాము. ఇంతలో ఇంటర్‌స్పెట్‌పైన మెసేజ్ వచ్చింది. ‘పావురాలు కూర్చుని ఉన్నాయి’- అంటే ఏదో జరగబోతోంది. మరో మెసేజ్ వచ్చింది. ఒక పావురం ఎగురుతోంది- ఎగరనీయనా! మరో మెసేజ్- ఆగు..
మేం అందరం మేల్కొన్నాము. ఆక్రమణ మా మీదే జరగబోతోంది. గబగబా మా కంపెనీ ఆ లొకేషన్ ఎక్కడో ఆచూకీ తీశారు. మిలిటెంట్లు మూడు కిలోమీటర్లదూరంలో ఉన్నారని తెలిసింది. కొంచెం ఎతె్తైన ప్రదేశంలో ఒక ఉగ్రవాది ఉన్నాడు. పట్టుబడ్డాడు కాని వాడు తెలివిగా గ్రెనైడ్‌ని పక్కన ఉన్న డస్ట్‌బిన్‌లో పడేశాడు. అందువలన వాడిని పట్టుకున్నా వాడు ఉగ్రవాది అని ప్రూవ్ చేయలేకపోయాం. ఉగ్రవాదులను సమర్థిస్తున్నాడని శిక్షపడ్డది. అందుకేరా నాయనా ఇక్కడ ఇరవై నాల్గు గంటలు మేల్కొని ఉంటేనే జీవితం. లేకపోతే అడుగడుగునా మృత్యువు ఎదురుచూస్తూ ఉంటుంది’’.సిద్ధార్థకి ఇవన్నీ ఎందుకు చెప్పానా అని ఒక్క క్షణం సందీప్‌కి అనిపించింది. తనని తను సంభాళించుకున్నాడు. సిద్ధార్థకి చెప్పకపోతే బయట తిరగడానికి వెళితే ఇంకా అపాయం. సత్యం ఎప్పుడు అందమైనదే. తన మనస్సుకు నచ్చచెప్పుకున్నాడు. సిద్ధార్థతో మాట్లాడటం మొదలుపెట్టాడు- చింతించాల్సిన అవసరం అంతగా లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థితిగతులు మెరుగయ్యాయి. కాకపోతే మేము జాగ్రత్తగా, మెలకువగా, నియమబద్ధంగా ఉండాలని మాత్రం సూచనలిస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఏవౌతుందోఎవరికి తెలియదు.
క్వార్టర్ బయట ఈ చీకటిగా ఉండటం కూడా జాగ్రత్తకోసమే. మా బేస్ కాంప్ భూషణ్‌ని నీవు ఇంకా చూడలేదు. రేపు చూపిస్తాను. ఒక కోటలాగా ఉంటుంది. ఎటుచూసినా కట్టుదిట్టమైన రక్షణ. చుట్టూతా ముళ్ళ ఇనుపకంచె. ఇరవై నాలుగు గంటలు చూపులు ఉగ్రవాదులమీదే. ఎ.కె.47 పట్టుకుని ఉన్న సిపాయిలు ఉన్నా కూడా బేస్ క్యాంప్‌పైన ఫియాదీన్‌లు ఆక్రమణ చేశారు. చిమ్మ చీకటిలో పాకుకుంటూ వచ్చారు, వెధవ చచ్చినాళ్ళు. చావుకి సిద్ధం అయిన ఫియాదీన్‌లను చంపడం కష్టం. అప్పటినుండి క్వార్టర్ బయట చీకటిగా ఉంచేయడం అలవాటయింది.
గదిలోపల మిణుకు మిణుకు దీపం ఉంచుతారు. ఎందుకంటే లోపల జరిగే కార్యకలాపాలను వాళ్ళు తెలుసుకోలేరు’’- సందీప్ ఇక ఆ విషయాలను విస్తారంగా చెప్పకూడదనుకున్నాడు. అందుకే మాట మార్చాడు- ‘‘సిద్ధార్థా! ఇక ఈ రైఫిళ్ళు- ఉగ్రవాదులు.. రక్తపాతాలు.. ఈ విషయాలను వదిలేద్దాం. ఇక నీ విశేషాలు చెప్పు.. నీ కంపెనీ ఎట్లా నడుస్తోంది. బతుకు బండిని ఎట్లా ఈడుస్తున్నావు?’’
‘‘చెబుతాను కాని నాకో విషయం తెలుసుకోవాలని ఉంది. నీవు టెక్నికల్ లైన్‌లో ఉండేవాడివి. మరీ ఆర్మీ వాళ్ళు నీ చేతిలో ఎ.కె.47 ఎందుకు పెట్టారు. నిజానికి ఇది మోసం కాదా?’’
‘‘ఉహూ.. ఇది మోసం కాదు. ఇది మా ఎగ్రిమెంట్ ప్రకారమే జరిగింది. ఇక్కడ ప్రతీ ఆఫీసరు ఇన్‌ఫెన్ట్రీ ఆఫీసర్ (గన్ ఎత్తేవాడు)గా పనిచేయాలి. ఎందుకు? తెలుసుకోవాలనుకుంటే రాష్ట్రీయ రైఫిల్స్ హిస్టరీ తెలుసుకోవాలి. ఇండియన్ ఆర్మీ ఇక్కడ కాశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌లో నన్ను డిప్యూట్ చేశారు.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత