డైలీ సీరియల్

పచ్చబొట్టు--16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి మహాపుణ్యక్షేత్రం. పవిత్రంగా వెలుగొందుతున్న ఆ క్షేత్రాన్ని అపవిత్రం చెయ్యటానికి దిగిన జంట రతి, మన్మధ్.
మన్మధ్ ఒళ్లో తలపెట్టుకొని పడుకున్న రతి పగలబడి నవ్వుతోంది. తన మెడలోని మంగళసూత్రాన్ని పైకి తీసుకొని చూస్తూ.
‘‘ఎందుకోయ్? అంత నవ్వు?’’
‘‘నవ్వు రాదా ఏమిటి? నకిలీ లైసెన్స్‌లా ఈ మంగళసూత్రం. నీ భార్యను వదిలి నువ్వు, నా మొగుడ్ని వదిలేసి నేను.. ఇలా వచ్చిన మనం ఇక్కడ చక్కటి జంటలా చూపరులను మోసం చేయటం’’.
‘‘ఎంతమందిని మోసం చేసినా బాధలేదు. ఆ పచ్చబొట్టుకి దొరకకుండా ఉంటే చాలు’’.
‘‘ఇక్కడకు కూడా వస్తుందేమో’’
‘‘రాదని, ఆ ముఠా బారిన పడకూడదనేగా అంత డబ్బు తగలేసుకొని ఇంత దూరం వచ్చాం. ఇక్కడ మనల్ని ఎవరూ పట్టుకోలేరు. ఖర్చు అయితే అయింది. ఇక్కడ బిక్కచచ్చిపోయే చలికి. నీ వెచ్చని శరీరం రగ్గులా పనిచేస్తుంటే ఎన్ని రోజులయినా ఉండవచ్చు’’-
‘‘పచ్చబొట్టు ఇక్కడకు రాదనా మీ అభిప్రాయం?’’
‘‘ఎందుకు రతీ! మూడ్ పాడుచేసుకోవటం. వచ్చినా ఎలా తెలుస్తుంది మనం భార్యాభర్తలం కాదని. ఇక్కడకొచ్చే వేలాదిమంది భక్తులలో మనమూ ఒక్కరం. ఇక ఆ గొడవ వదిలెయ్! నా ప్రేమ మందిరంలోకి చొరబడిపో’’
‘‘పట్టపగలు. కాటేజీలో కిటికీలన్నీ తీసే ఉన్నాయి. అబ్బాయి మోటు సరసం ప్రారంభమైంది’’.
‘‘ఉండండి. తలుపు వేసి వస్తాను’’ అని ఆమె లేవబోతుంటే చీర కొంగు పట్టుకొని లాగాడు. పాము కుబుసం లాంటి చీర మెత్తగా అతని చేతుల్లో చిక్కుకుంది.
‘‘వెళ్ళు! వేసిరా!’’
‘‘ఇలా చీర లేకుండానా?’’
‘‘వెళ్ళవోయ్! నువ్వు ఎవ్వరికీ కనిపించవులే. అలా వెళుతున్న నీ అందాలు నన్ను పిచ్చెక్కిస్తాయి’’.
ఇక తప్పదన్నట్లుగా ఆమె కదిలింది. జాకెట్‌కి లంగాకి మధ్య వున్న జానెడు నడుము మెరుస్తూ అతన్ని ఊపిరి తీసుకోనివ్వటంలేదు.
లయబద్ధంగా కదులుతున్న ఆమె పిరుదులు పరవళ్ళు త్రొక్కే నదిలా అతని బిపిని పెంచేస్తున్నాయి. ఆమె కిటికీ దగ్గరకు వెళ్ళేంతవరకూ కూడా ఆగలేకపోయాడు. తమకంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను తన బిగి కౌగిలిలో బంధించాడు.
కిటికీ బోల్ట్ అందుకొని వెయ్యాలని ఎత్తిన ఆమె చేతిని క్రిందకు దిగనివ్వలేదు. ఆమెను కదలకుండా ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు.
ఎలాగో అతని పట్టునుంచీ సడలి కిటికీ దగ్గరకు చేరగలిగింది కానీ తలుపులు వెయ్యనివ్వడే. ఇతనికి ఏది వచ్చినా పట్టలేం.
కిటికీ పక్కనున్న నందివర్దనం చెట్టుకున్న పూలు కోస్తున్న రెండు కళ్ళల్లో ఆ దృశ్యం క్లిక్ అయింది. శృంగారంలో కొట్టుమిట్టాడుతున్న ఆ జంట అది గమనించే స్థితిలో లేనేలేదు.
వారు మరో లోకంలో విహరిస్తున్నారు. అప్పటిదాకా వారిని భయపెట్టిన పచ్చబొట్టు ఎదురుగా ఉన్నా పట్టించుకోలేని రసమయ ప్రపంచంలో మునిగితేలుతున్నారు. వాళ్ళు మెలకువ తెచ్చుకొనేటప్పటికి వాళ్ళ జీవన నౌకలు కూడా మునిగి తెడ్డులు కూడా మిగలవు. అది వారికి మరునాడు కానీ తెలియరాలేదు.
***
‘‘మన్మధ్ వదులు బాబూ! మరీ అంత పిచ్చా? రాత్రంతా ఒకటే జాగరణ. ఎప్పుడో తెల్లవారు జామున నిద్రపోనిచ్చావు. కళ్ళు కూడా విప్పనివ్వలేదు.’’
‘‘ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? కళ్ళు మూసుకొని కూడా కలిసిపోవచ్చుగా’’.
‘‘్ఛ! ఎప్పుడూ అదే ధ్యాస’’
బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆమె ఒక్కసారి కెవ్వుమంది.
‘‘ఏయ్! ఎందుకలా అరిచావ్?’’
‘‘మన్మధ్.. నీ .. నీ.. బుగ్గపైన ప..ప..పచ్చబొట్టు’’
‘‘అంతే! ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. ఊడిపోయిన లుంగీని కూడా పట్టించుకోకుండా అద్దం దగ్గరకు పరుగెత్తాడు.
అందంగా ముద్రించిన పచ్చబొట్టు అతని కళ్ళకు వికృతంగా కనిపించింది. పిచ్చివాడిలా జుట్టుపీక్కున్నాడు.
రతి, మన్మధ్ ఏం చెయ్యాలో పాలుపోనివాడిలా, కాలుగాలిన పిల్లిలా ఆ గది అంతా వేలసార్లు తిరిగారు. ఎంత తిరిగినా కాళ్ళు నొప్పి తప్ప ఏం చెయ్యలో తోచటంలేదు.
‘‘చంద్రగిరి గుట్టమీద నుంచీ దూకి చచ్చిపోదామా?’’ అదో బ్రిలియంట్ ఐడియాలా చెప్పాడు మన్మధ్.
‘‘నువ్వు దూకితే దూకు. నాకేం ఖర్మ. నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం నాకుంది. నేను మా ఊరు వెళ్లిపోతాను’’.
‘‘రతీ! నువ్వేనా ఇలా మాట్లాడేది?’’
‘‘అవును మన్మద్. నువ్వు ఆఫీసరువయినంత మాత్రాన ఉద్యోగం చేసే ఆడవాళ్ళను చిన్నచూపు చూడటం, వాళ్ళను అనుభవించాలనుకోవడం ఎంతో నీచం. నీతో ఆనందంగా గడుపుతున్నావనుకుంటున్న ఆడవాళ్ళంతా నిన్ను మనసులో అసహ్యించుకుంటున్నారన్నది నువ్వు తెలుసుకోవాలి’’.
మన్మధ్ తెల్లబోయి చూస్తున్నాడు. మళ్లీ ఆమె చెప్పటం ప్రారంభించింది. ఈ అవకాశం మళ్లీ వస్తుందో రాదో అన్నట్లు చెప్పుకుపోతోంది.
‘‘నిన్ను కాదన్న ఆడదాన్ని అపనిందల పాలు చెయ్యటం లేదా ఏదో వంకతో డిస్మిస్ చెయ్యటం. అధికారం చేతిలో వుంది కదా అని రెచ్చిపోవటం. నీతిని నమ్మిన అమ్మాయిలు నీ చేతుల్లోంచి తప్పించుకున్నా, ఎందరో అమాయకులు బలి అయిపోయారు. అలాంటివారిలో నేనొకదాన్ని.’’.
కాసేపు ఆగి అకస్మాత్తుగా యాక్సిడెంట్‌లో రెండు చేతులూ కోల్పోయిన భర్త, తింటానికి అన్నం లేని పిల్లలుని తిండి పెట్టలేక మాడ్చడం ఇష్టం లేక, ఏ నీతీ నన్ను ఉద్ధరించదని నిర్థారించుకొని నీతో ఈ నాటక సంసారం చేశాను. నేను రోజూ పూజించే వెంకటేశ్వరస్వామి ఈ విధంగా నాకు విముక్తినిచ్చాడు. పచ్చబొట్టు రూపంలో మా స్ర్తి జాతిని ఉద్ధరిస్తున్నాడు. ఈ కలికాలంలో కలికావతారం ఈ పచ్చబొట్టేనేమో!
ఏది ఏమైనా ఆడవారికి అడిగే అధికారం, నోరు విప్పే అవకాశం వచ్చింది. మీ మగ మహారాజులు మీసాన్ని కత్తిరించుకొని, గుండు కొట్టించుకోవాల్సిన కాలం వచ్చింది. ఎయిడ్స్ కంటే ఎక్కువ భయపెడుతున్న ఈ పచ్చబొట్టుకి నా హాట్సాఫ్!
గుడ్‌బై సాడిస్ట్! గుడ్‌బై!
గబాగబా తన బట్టలన్నీ సూట్‌కేస్‌లో సర్దుకొని బయటపడింది పంజరం వీడిన పక్షిలా. ఆమె నడుస్తోంది భూమిపైనే అయినా మనసు ఆకాశాన మేఘాల నడుమ నెమలిలా నాట్యం చేస్తోంది.
ఇన్నాళ్ళూ ఆడవాళ్ళను వెలివేసిన ఈ సమాజం ఇపుడు మగవాళ్ళను వెలివేస్తుంది. హఁ! హఁ! హఁ! ఆమె అంతరంగ ఆనందం అంతా ఇంతా కాదు మరి!
***
హెచ్చరిక -4
హాయ్! ఫ్రెండ్స్!
ఫైన్ మార్నింగ్.. ఈ జంట నా నుంచి తప్పించుకోవటానికి కలకత్తా నుంచీ తిరుపతి వచ్చింది. నా దగ్గిర డబ్బులు లేక కాలినడకన తిరుపతి ఏడుకొండలు ఎక్కాను. తిరుమలలో ఆ జంటలో మగపక్షికి విజయవంతంగా పచ్చబొట్టు పొడిచాను.

-సశేషం

--యలమర్తి అనూరాధ సెల్: 9247260206