డైలీ సీరియల్

ఒయాసిస్- 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె మరింత సామీప్యానికి వచ్చింది. కటి వస్తమ్రూ గాలికి ఎగిరిపోయింది. అయినా అందరూ బ్రహ్మ పాదాలపై నుంచి దృష్టి మళ్లించలేదు. రాజుగారు మాత్రం ఆమె నగ్న శరీరానే్న చూస్తున్నాడు. ఆ అపురూప సౌందర్యరాశి నిమోన్నతాలనూ, పృధు వక్షోజాలనూ, జఘనాలనూ చూస్తూ పరవశించిపోయాడు. ఊ కొట్టండి..’’
‘‘ఊ... ఊ...’’
‘‘బ్రహ్మకు కోపం వచ్చింది. దేవలోకానికి వచ్చినా నీ మానవ స్వభవాన్ని విడనాడలేకపోయావు గనుక, మళ్లీ భూలోకానికే వెళ్లమని శపించాడు. రాజు మాత్రం నా జన్మ ధన్యమైందని సంతోషించాడు. తన కారణంగా ఆ రాజు తఫః సంపదనంతా పోగొట్టుకుని, శాపానికి గురైనందుకు జాలిపడి ఆ రాజుతోపాటు ఆమె కూడా భూలోకానికి వచ్చింది.. కొట్టండి మరి’’ అన్నది ఛాయ.
రణధీర్ ముందుకు వంగి ఆమె ముంజేతిమీద సుతారంగా కొట్టాడు..
‘‘మంచి కథ చెప్పావు.. ఇలాంటి కథలు చెబుతానంటే రోజూ వచ్చి కూర్చుంటాను..’’ అని నవ్వాడు రణధీర్.
‘‘ఇది నేను కల్పించి చెప్పిన కథ కాదు.. శ్రీ మదాంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుర్దాశ్వాసంలో ఉంది. ఆ రాజు పేరు మహాభిషుడు. ఆ దేవకన్య ఎవరో కాదు.. గంగ..’’
‘‘చాలా థాంక్స్.. మంచి కథ చెప్పావు. సరే.. కాలేజీలో ప్రమోషన్ కొట్టేశావు. అహోబలరావుగారింట్లో కూడా గెస్ట్ హోదా నుంచి హోస్ట్ పోస్టుకు ప్రమోషన్ కొట్టేదెప్పుడు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఏమోనండీ.. నాకైతే పెద్దగా ఇంటరెస్ట్ లేదు.. ఆయన బలవంతం చేస్తే ఆలోచిస్తాను..’’ అన్నది ఛాయ.
‘‘పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటే కొద్దిగా ఉన్నట్లే కదా.. నువ్విలా రోజూ యవ్వనపు పొంగులతో, దరహాసమాలినిగా, ఉద్విగ్న విలాసినిగా నయనానందకరంగా కన్పిస్తుంటే.. ఆయన బలవంతం చెయ్యకుండా ఎలా ఉంటాడు?.. మగవాడు అగ్ని, స్ర్తి ఆజ్యం.. అగ్నికి ఆజ్యం తోడైతే, రెండూ ఒకటే అయ్యి మహోజ్వలంగా వెలుగుతుంది.. బెస్ట్ ఆఫ్ లక్..’’ అన్నాడు రణధీర్.
‘‘చూద్దాం.. కాలమెలాంటి మార్పులు తెస్తుందో తెలియదు..’’ అన్నది ఛాయ.
రణధీర్ భోంచేశాడు.. ఆమె దగ్గరుండి వడ్డిస్తుంటే..
వెళ్తానని లేచాడు.. ఖరీదైన ప్యాంటు, షర్టు ఉన్న రెండు అట్టపెట్టెలందించింది..
‘‘చిరుకానుక.. మన పరిచయం చిన్నదే అయినా నావాడివని, సన్నిహితుడివని, హితుడవని, స్నేహితుడవని అనిపిస్తోంది. కొంతమంది మీద ఇష్టాయిష్టాలు ఎందుకు ఏర్పడతాయో తెలియదు. ఈ మైత్రీ బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నాను’’ అన్నదామె.
ఆ మాటలు అతడ్ని మూగవాడిని చేశాయి.
***
ఉదయం ఎనిమిది గంటలు అయింది. రణధీర్ ఇంట్లో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. సత్యభామ భుజంమీద టవల్ వేసుకుని బాత్‌రూంలోకి వెళ్లబోతూ భర్తతో అన్నది. ‘‘నేను స్నానానికి వెళుతున్నాను..’’
‘‘మే హై హెల్ప్ యూ..’’ అన్నాడు రణధీర్ పేపర్‌లోనుంచి దృష్టి మరల్చకుండానే..
‘‘ఆ.. చేసిన సహాయం చాలు గానీ.. కుక్కర్ విజిల్స్ రాగానే స్టౌ కట్టేయండి..’’ అన్నది సత్యభామ.
‘‘నేను కూడా విజిల్ వేస్తాను.. అప్పుడు బయటకొచ్చేయ్.. లేకపోతే నేను లోపలికి రావాల్సి ఉంటుంది..’’ అన్నాడు రణధీర్ భార్యవంక చూస్తూ..
‘‘మీరు ఎప్పుడు విజిల్ వేస్తారో నాకు తెలుసు.. మీ అల్లరి మితిమీరుతోంది.. మరీ గొడవ చేస్తే డొమెస్టిక్ వయొలెన్స్ కింద మీ మీద కేసు పెడతాను..’’
‘‘పెట్టు.. అదీ నేనే డీల్ చెయాల్సి వుంటుంది..’’ అన్నాడు రణధీర్ టీవీ ఆన్ చేస్తూ.
వార్తలు చూస్తూ పావుగంట గడిపాడు. సత్యభామ బేబీ పింక్ కలర్ శారీ, బ్లౌజ్ ధరించింది.
స్వీటూ, హాట్ తెచ్చి ఆయన ముందు పెట్టింది.
‘‘ఉప్పు కారం సరిపోయాయో లేవో చెప్పండి..’’ అన్నది సత్యభామ.
రణధీర్ స్వీట్ అందుకుని తింటూ అన్నాడు.
‘‘ఇందులో అసలు ఉప్పు, కారం వెయ్యటం మర్చిపోయావు సత్యా..’’
‘‘ఇలా ఇవ్వండి.. స్వీట్‌లో ఉప్పు కారం కలుపుతాను..’’ అన్నది సత్యభామ.
‘‘ఏమిటీ విశేషం, ఇవాళ పొద్దుటే తియ్య, తియ్యగా హాయి హాయిగా..’’
‘‘ఇవాళ ఇన్స్‌పెక్టర్‌గారి పుట్టినరోజు...’’
‘‘అవునవును.. ఆ విషయమే మర్చిపోయాను..’’ అన్నాడు రణధీర్.
‘‘ఇవాళ ఆఫీసుకు వెళ్ళటం మానేస్తే ఏమవుతుంది?’’ అని అడిగింది సత్యభామ.
‘‘ఏం కాదు.. రేపట్నుంచి వాళ్లే మానెయ్యమంటారు..’’ అన్నాడు రణధీర్.
ఇంతలో ఫోన్ మోగింది. రణధీర్ ఫోన్ తీసుకుని నెంబర్ చూశాడు.
‘‘శంభూ.. చెప్పు.. ఊరక చెయ్యరు మహాత్ములు ఫోన్.. ఏమిటీ విశేషాలు?
‘‘ఏమంటాయి.. మనకి తెల్లారితే చాలు, ఎక్కడ మర్డర్ జరిగిందీ, ఎక్కడ రేప్ జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగిందీ, ఎక్కడ మోసం, దగా, ఛీటింగ్ జరిగిందీ- ఇవే కదా విశేషాలు..’’ అన్నాడు శంభూప్రసాద్.
‘‘ఒక మర్డర్ జరిగిందీ అంటే- దానికి ముందు ఇవన్నీ జరిగే ఉంటాయి అనుకోవాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘ఒక ముసలిదాని నోరు నొక్కి దాని దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఎత్తుకుపోయాడట ఎవడో.. ఆ ముసల్ది చావుబతుకుల్లో ఉంది.. అది నిన్ను చూడాలని.. తహతహలాడుతోందిట..’’
‘‘డబ్బు.. బంగారం అంతా ఎవడో ఎత్తుకెళ్లాక, ఇంక నా కోసం తహతహలాడటం ఎందుకు?’’

-ఇంకా ఉంది

శ్రీధర