డైలీ సీరియల్

శాస్త్రార్థాలను..(. ప్రహ్లాదుడు - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లు మాకు అనుమతివ్వండి. తిరిగి ఈసారి మీరు మెచ్చుకునేట్టుగా చేస్తాము’ అని చెప్పారు.
ఆగ్రహాన్ని అణుచుకుని క్రోధాన్ని దిగమింగి హిరణ్యకశపుడు ఈసారి నాకొమరుడు ఇట్లాంటి ప్రకోపాన్ని చూపితే మీకు కూడా శిక్ష విధిస్తాను అని చెప్పాడు. వారు వణికిపోతూ మహారాజా ఇటువంటి తప్పు మరొక మారు జరగకుండా చూస్తాము అని చెప్పి ప్రహ్లాద కుమారుడిని తమతోపాటు తీసుకొని వెళ్లారు. ఎక్కడ తప్పిదము జరిగిందో చూడాలనుకొని ప్రహ్లాదుడినే పరీక్షించసాగారు.
గురుకులంలో ఉండే ఇతర విద్యార్థులందరినీ కూడకట్టి వారికి విష్ణు కథలను చెప్పి వారి భజనకు ఉపక్రమింపచేసి తాను కూడా వారితో కలసి హరి భజన చేస్తూ కాలం గడిపే ప్రహ్లాదుడిని చూసి వారు ఆశ్చర్యాలకు గురై మహారాజు కోపానికి మనలను ఈ బాలకుడు గురి చేస్తాడు. కనుక మరింత పటిష్టవంతంగా శాస్త్రాలను నేర్పి వీనిని ఆ హరి మాయ నుంచి తప్పించాలి అనుకొన్నారు. తర్కశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం లాంటి అన్నీ శాస్త్రాలను బోధించారు. బాగా భయపెట్టారు. హిరణ్యకశపుని కోపాన్ని పదింతలు చేసి చెప్పారు. ఆయన పరాక్రమాన్ని వందింతలు చేసి చెప్పారు. అంతా విన్నా ప్రహ్లాదుడు చిరునవ్వుతో శ్రీమన్నారాయణుడు కాక మరెవ్వరూ శాశ్వతం కాదు. మనమంతా ఆయన కనుసన్నుల్లో మెలిగేవారిమే. మనమెప్పుడు నారాయణుని భజన చేస్తేనే మన జన్మకు సార్థక్యం కలుగుతుంది అని చెప్పేవాడు. తిరిగి చండామార్కులు ఎన్నో విధాలుగా రాక్షసేశ్వరుని గొప్పను నూరిపోసారు. రాక్షసుల లక్షణాలను, గుణాలను నేర్పించారు. చివరకు ఒకనాడు మహా భయపెట్టి రాక్షసనాథుడైన హిరణ్యకశపుని దగ్గరకు తీసుకొని వచ్చారు. లీలావతి కూడా చూసి తన కుమారుడు ప్రయోజకుడైనాడని సంతోషించి తండ్రి మెప్పును కూడా సాధించమని దీవించి తండ్రి దగ్గరకు ప్రహ్లాదుడిని పంపించింది.
***
ఇంకావుంది...

డా. రాయసం లక్ష్మి