డైలీ సీరియల్

ప్రహ్లాదుడు -6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీని నుంచి బయటపడితే ఏనాటికైనా పరంధాముని పాదపద్మాలను ఆశ్రయిస్తే అపుడు తిరిగి జన్మనెత్తని స్థితి లభిస్తుంది. ఇప్పటికైనా మించిపోయినది లేదు నీవు సాధుసజ్జనులు హింసించడం మానుకో. ఆ హరిపాదాలను ఆశ్రయించు అపుడు మాత్రమే నీ జన్మకు ముక్తి మోక్షమూ కలుగుతాయి. హరిభక్తి లభించడానికి ఈ జన్మలోని వయస్సు ముఖ్యంకాదు. ఇంత చిన్నవాడిని నేను నీకు చెబుతున్నానని అనుకోవద్దు. ఇదంతా నా పూర్వజన్మ పుణ్యమే కానీ వేరుకాదు. నీవుకూడా నాతో పాటు ఆహరిపాదాలను పట్టుకో అని గట్టిగా చెప్పే ఐదేండ్ల పిల్లవాడిని తన కొడుకు అని కూడా చూడకుండా తన అంకపీఠంపై కూర్చున్నవానిని ఒక్క ఉదుటన తోసివేశాడు.
ఓరి మూర్ఖ బాలకా! వింటున్న కొలదీ చెబుతునే వున్నావు. నీ పినదండ్రిని చంపిన నా శత్రువును కీర్తించడం నీకు ఎక్కడ నుంచి వచ్చి ది? నీకు నా వంశంలోతప్పబుట్టావు. నాకు అపకీర్తి తెచ్చే నావంశాంకురం నాకు అక్కర్లేదు. ఓ భటులారా! ఇంకా చూస్తున్నారేమి? ఇతడు నా పుత్రుండని మీరు ఆలోచించకుడు. ఇతడు మన విరోధి భక్తుడు. నానా హింసలు పెట్టండి. కొండలనెక్కించి అక్కడ నుంచి కిందకు తోయుడు. బడబాగ్నిలో తోసివేయండి. శూలాలతో పొడవండి. ఏనుగులతో తొక్కించండి. ఇతడిని నా ముందునుంచి తీసుకొని వెళ్లండి. వెంటనే ఇతనిని నానాహింసలు పెట్టండి. ఎప్పటివరకు ఈ శత్రుకీర్తనను విరమించడో అప్పటివరకూ ఇతడిని క్రూరంగా హింసించండి. ఏమాత్రం ఏమరకండి.అని హిరణ్యకశపుడు హుంకరించాడు. హిరణ్యకశిపుని నుంచి ఆజ్ఞ వచ్చేసరికి అప్పటికే ప్రహ్లాదుడంటే అసూయ ఉన్నవారు ఇప్పుడు కుదిరింది రోగం ఇక చూడు మీ తండ్రే అయినా ఆ హరిని కీర్తించినవారిని చంపకుండా వదలిపెట్టడు అపుడు అపుడు.. అంటూ ప్రహ్లాదుడిని చూశారు. మరికొందరు అయ్యో పాపం చిన్న వాడు పసివాడు ఈ క్రూరమైన మనస్సున హిరణ్యకశిపుని గురించి తెలియదు పాపం తనకు తెలిసినవేవో హాయిగా జంకు గొంకులేకుండా తండ్రే కదా అని చెబుతూ పోయాడు. అయ్యో ఎంత కష్టం వచ్చింది. ఇపుడు ఈ మూర్ఖులు ఆ పసిపాపడిని నిజంగా హింసిస్తారేమో ‘ ఓ నారాయణా! నీగురించి మాకు అంతగా తెలియదుకానీ నువ్వే పరమోత్తమమైన దేవాదిదేవుడివని ఈ పసికూన నమ్ముతున్నాడు. వాడిని నీవు కాపాడాలి. కనీసం వాడికోసమైనా నువ్వు రా.. వాడిని రక్షించు పరమేశ్వరా!’అని మనసులో నానావిధాలుగా ప్రార్థన చేస్తున్నారు. అంతలో క్రూరంగా ప్రహ్లాదుడిని భుజం పట్టుకుని లాక్కెడానికి రాక్షసులు ముందుకు వచ్చి ప్రహ్లాదుని భుజం పట్టుకున్నారు.
‘ఓరీ! మూర్ఖా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను మాత్రమే ముల్లోకాలను ఏలగల దానవేశ్వరుడిని. హరి అనేవాడు లేనేలేడు ఒకవేళ ఉన్నా వాడు నాకు భయపడి ఏ మూలనో నక్కి ఉన్నాడు. అటువంటి వాడిని నీవు పరమేశ్వరుడని కీర్తించడం మానుకో! బతికిపోతావ్!’ అని హిరణ్య కశిపుడు అన్నాడు.
ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి ‘తండ్రీ నీవైనా నేనైనా ఒకనాటికి నశించిపోయేవారిమే. నీకు ఆ హరి నక్కి ఉన్నట్లు కనిపిస్తే అది నీ మృత్యువే. కనుక ఈ మూర్ఖత్వాన్ని వదలిపెట్టుము. ఆ హరిని స్మరించి చేతులు జోడించుము’అన్నాడు.
‘హుం’ అని పెద్దగా హుంకారం చేసి వెంటనే వీడిని ఏనుగుల చే తొక్కించండి. వీనిలో పేరుకుని పోయి ఉన్న మదం అంతా బయటకు కక్కించండి అన్నాడు హిరణ్యకశపుడు.
ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్లిన దానవులు నానావిధాలుగా బాధలు పెట్టడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద శూలాలతో పొడిచారు. కొరడాలతో కొట్టారు. విసురుగా ఎత్తి కింద పడేశారు. విషసర్పాల చేత కరిపించారు. ఏనుగులతో తొక్కించారు. కఠినమైన కొండలపైకి ఎక్కించారు. అక్కడ నుంచి కిందకు తోయించారు. అయినా ప్రహ్లాదుటడు పన్నగ శయనా, మాధవా, మధుసూదనా, లోకేశ్వరా, దీనశరణ్యా, పరమ పావనా అని పలు నామాలతో ఆ నారాయణుని వేడుకోవడం తప్ప తండ్రిని కానీ ఇతరులనుకానీ ఒక్కమాట కూడా మాట్లడడం లేదు.

- ఇంకా ఉంది

డా. రాయసం లక్ష్మి