డైలీ సీరియల్

ఒయాసిస్- 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నువ్వేమన్నా పట్టుకుని దాని సొమ్ము దానికి ముట్టజెపుతావేమోనని..’’ అన్నాడు శంభుప్రసాద్.
‘‘అర్థమైందిలేగానీ, బతికే ఉందికదా..’’
‘‘నిక్షేపంగా ఉంది. గట్టిపిండం..’’ అన్నాడు శంభుప్రసాద్.
‘‘అడ్రసు చెప్పు..’’’
‘‘కమలానగర్..’’
‘‘ఇంతకుముందు కూడా ఈ కాలనీ మన ఖాతాలోకి ఎక్కింది గదా..’’
‘‘అవును, నీ హీరోయిన్‌ది ఈ కాలనీయే..’’
‘‘షిప్ట్ చేస్తున్నట్లు చెప్పింది...’’
‘‘నిన్ను షిప్ట్ చేయిస్తుంది.. జాగర్త..’’’
‘‘సరే.. ఒక గంటలో వస్తాను..’’ అన్నాడు రణధీర్.
రణధీర్ కమలానగర్‌లోని ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి శంభుప్రసాద్, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడున్నారు. లోపలికి వెళ్ళాడు.
ఎనభై ఏళ్ల ముసలమ్మ కుర్చీలో కూర్చుని వుంది. పక్కన నలభై ఏళ్ళ వ్యక్తి నిలబడి శంభుప్రసాద్‌తో మాట్లాడుతున్నాడు.
‘‘ఏం జరిగింది, చెప్పండి..’’ అన్నాడు రణధీర్.
‘‘నా పేరు అశోక్.. ఈమె మా పెదనాన్న భార్య.. పెదనాన్న చనిపోయి చాలాకాలమైంది. పిల్లవాడు అమెరికాలో ఉన్నాడు. నాలుగయిదేళ్లకొకసారి వచ్చివెళ్తుంటాడు. పైన ఒక చిన్న పోర్షన్ వుంది. అందులో ఒక ఎంప్లారుూ, అతని రిలేటివ్ అద్దెకు ఉండేవారు. ఈమెకు తోడుగా వుండేవాడు. రెండు రోజుల కిందటే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కతే ఉంటోంది. రాత్రి పదకొండు గంటల సమయంలో తలుపుకొడితే, మా పెద్దమ్మ లేచి వెళ్లి తలుపు తీసింది. వచ్చినవాడు, ఈమె అరవకుండా నోరు నొక్కి, లోపలికి నెట్టుకుంటూ తీసుకొచ్చి కుర్చీలో కూచోబెట్టి తాడుతో కట్టేశాడండి.. అరిస్తే చంపేస్తానని కత్తితో బెదిరించాడండి.. బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పమని అడిగి తీసుకుని, బీరువా తెరిచి డబ్బు, బంగారం నగలు ఎత్తుకెళ్ళాడు సార్..’’ అన్నాడు అశోక్.
‘‘నువ్వు ఎక్కడుంటావ్?’’ అని అడిగాడు రణధీర్.
‘‘నేను కాచీగూడాలో ఉంటానండి..’’ అన్నాడు అశోక్.
‘‘నీకు దొంగతనం గురించి ఎప్పుడు తెలిసింది?’’
‘‘రాత్రి పనె్నండింటికి ఫోన్ చేసిందండీ.. రాత్తిరే వచ్చానండి.. కానీ బాగా లేటయింది..’’ అన్నాడు అశోక్.
రణధీర్ కుర్చీ లాక్కుని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. ఆమె ఇంకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు. భయం భయంగా చూస్తోంది.
‘‘నీ పేరేమిటమ్మా..’’ అని అడిగాడు రణధీర్.
‘‘జానికమ్మ..’’ అన్నది బోసినోటితో, బిత్తర చూపులతో.
‘‘మీ అబ్బాయి ఎక్కడున్నాడు?’’
‘‘అమెరికాలో..’’
‘‘ఏం చేస్తున్నాడు..?’’
‘‘ఇంజనీరు ఉద్యోగం..’’
‘‘అమెరికాలో ఎక్కడ?’’
‘‘అమెరికాలోనే..’’
‘‘రాత్రి ఏం జరిగింది?’’
‘‘నేడు పడుకుంటున్నా.. టీవీ కట్టేసి.. తలుపు కొడితేనే.. వెళ్లి తలుపు తీశా. దొంగాడు నా నోరు నొక్కేశాడు.. ఊపిరాళ్ళా.. ఉక్కిరి బిక్కిరి అయ్యా.. నన్ను నెట్టుకుంటూ తీసుకొచ్చి ఈ కుర్చీలో కూలేసి కట్టేశాడండీ..’’
‘‘దేనితో కట్టేశాడు?’’
‘‘తాడుతో..’’ అన్నది భయంగానే.
‘‘తాడు ఎక్కడిది?’’
‘‘ఏమో మరి? తెచ్చుకున్నాడల్లే వుంది. కత్తి తీసి పీక మీద పెట్టి పొడిచేస్తానన్నాడు...’’ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి.
‘‘ఊరుకో.. పట్టుకుంటాంలే.. కట్టేసి ఏంచేశాడు?’’
‘‘బీరువా తాళాలు ఇయ్యమన్నాడు.. తలగడా గలీబులో ఉన్నాయి.. చెప్పా.. తాళం తీసి, డబ్బులు, నగలూ పట్టుకుపోయాడండీ..’’
‘‘కట్లు ఎవరు విప్పదీశారు?’’
‘‘వాడే పాపం, ఇప్పదీసి, అరిస్తే చంపేస్తానని కత్తి చూపించి బంగారం నగలన్నీ పట్టుకుపోయాడు..’’ మళ్లీ ఏడ్చింది.
‘‘డబ్బు ఎంతుంది?’’
‘‘ఎనిమిది వేలు..’’
‘‘నగలు ఎన్ని తులాలు ఉంటాయి?...’’
‘‘పనె్నండు తులాలు.. గాజులు, చంద్రహారం, నాంతాడూ...’’
‘‘పైన పోర్షన్ అద్దెకు ఇచ్చావా?..’’
‘‘ఆ.. రెండు రోజులైంది ఖాళీ చేసి వెళ్లిపొయ్యారు..’’
‘‘అద్దె ఎంతిచ్చేవాళ్ళు?..’’
‘‘మూడు వేలు.. కలుపుగోలుగా ఉండేవాళ్ళు.. మా ఆయన చనిపోయాక, నాకు ఫించనిస్తున్నారు.. ఆ అబ్బాయికి బ్యాంక్ పుస్తకం, ఫారం మీద సంతకం చేసిస్తే డబ్బులు తెచ్చిచ్చేవాడు.. నమ్మకమే..’’
‘‘ఎంతమంది ఉండేవాళ్ళు..?’’
‘‘సతీసు, దీప..’’
‘‘్భర్యా భర్తలా?..’’
‘‘చుట్టాలండీ.. ఇద్దరికీ పెళ్లి కాలా..’’
‘‘ఆ అమ్మాయి ఎలా ఉంటుంది?’’
‘‘బానే వుంటుంది. కాస్త రంగు తక్కువైనా.. మొహం తేటగా వుంటుంది..’’
రణధీర్ దీప్తిని మొట్టమొదటిసారి నర్సింగ్ హోం గేటు దగ్గర సెల్‌ఫోను నుంచి ఫోటో తీశాడు. ఆ ఫొటోని జానకమ్మకి చూపించాడు.
‘‘ఈ అమ్మాయిలాగా ఉంటుందా?’’ అని అడిగాడు.
సెల్‌ఫోన్ కళ్లదగ్గర పెట్టుకుని.. ‘‘ఆ, దీనిలాగే ఉంది..’’ అన్నది.
‘‘వాళ్ళిద్దరు ఎప్పుడన్నా పోట్లాడుకోవటం, గొడవ పడటం చేసేవాళ్ళా?’’
‘‘ఆ.. రోజూ కీచులాడుకుంటారు గానీ కల్సిపోతారు..’’ అన్నది జానకమ్మ.
‘‘అమ్మా, వాళ్ళ ఫోన్ నెంబర్లునీకిచ్చారా? ఎప్పుడన్నా వాళ్ళకి ఫోన్ చేసేదానివా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఆ.. వాళ్ల సెల్లు ఫోన్లు ఉన్నాయి.. పొద్దున గూడా చేసా.. ఈ సంగతి చెబుదామని.. కానీ ఎత్తలా..’’ అన్నది జానకమ్మ.

- ఇంకా ఉంది

శ్రీధర