డైలీ సీరియల్

విలువల లోగిలి-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది చెప్పటం మా బాధ్యతని చెబుతున్నాను. మీరు అలా వాళ్ళ అడ్రస్సులు తీసుకుని వెళతానంటే మనసులో వృధాశ్రమ అని అనుకున్న మాట నిజమే. వారిలో మార్పు వస్తుందని నేనే మాత్రం ఊహించలేదు. పదిమందిలో ఇద్దరు మారినా మన ప్రయత్నం ఫలించినట్లే. చాలా సంతోషమమ్మా’’.
‘‘మంచి మాట చెప్పారు శాస్ర్తీగారూ! మాకు చెప్పొచ్చావా అని నా మీద కత్తులు నూరిన వారున్నారు. చంపేస్తాం అని బెదిరించినవారూ ఉన్నారు. భయపడి పారిపోతే ఏ పనీ సాధ్యం కాదు. అంతా మారుతారని మనం ఎప్పుడూ అనుకోం. కొద్దిమందిలోనన్నా కాస్త అవగాహన తెప్పించగలిగితే చాలనుకుంటాను నేను. మార్పు వచ్చినా రాకున్నా చేయకుండా ఉండలేని అశక్తురాలిని. కాబట్టి ఫలితం కోసం ఆశించకుండా నా కర్తవ్యం నేను చేసుకుంటూ వెళ్తున్నా’’.
‘‘సరేనమ్మా! ఉంటాను’’ అంటూ పెట్టేశాడాయన.
ఆ వార్త ఆమెకు చాలా సంతోషాన్ని కలిగించింది.
ఈ స్కూలు పనుల్లో పడి ఇంకొందరి దగ్గరకు వెళ్లాల్సినవి పెండింగ్‌లో పెట్టింది. తీరిక చూసుకుని వారి దగ్గరకు కూడా వెళ్లి తన ప్రయత్నం తను చెయ్యాలి అనుకొని అపుడే కేలెండరులో నోట్ చేసుకుంది.
విషయం శివ ద్వారా కొద్దిగా, విశ్వ ద్వారాకొద్దిగా విని మొత్తానికి మంచి జరిగిందని కుటుంబం అంతా సంతోషించారు. మానవత్వం ఆ ఇంట నిత్య దీపంలా వెలుగుతూ ఉండాలని అందరి అభిలాష.
***
‘లోగిలి’ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేక స్కూలుగా పేరుతెచ్చుకుంటోంది. ఏ పోటీల్లో వారు పాల్గొన్నా బహుమతి వారిదే. ఆ స్కూలు పిల్లలు వచ్చారంటే ఇక బహుమతి మనకు వచ్చినట్లే అనుకునేలా తయారయ్యారు.
వారంతా ప్రాథమిక విద్యను పూర్తిచేశారు.
అంతవరకూ తెలుగు మీడియంలోనే చదవటం వలన తెలుగుమీద, భాషమీద, పద్యాలమీద మంచి పట్టు సాధించారు. అనుభవజ్ఞులైన టీచర్లు, కంప్యూటర్లు, ఆధునిక పరికరాలతో అవగాహన కల్పించటం దీనికి తోడయ్యాయి.
మాతృభాషలో బోధన జరగాలి. విద్యార్థులు అందులో మధురత తెలుసుకోవాలన్న విశ్వ కల నెరవేరింది.
ఇక ఆరు నుంచీ పదవ తరగతిదాకా తెలుగు మీడియంలోనే పిల్లల్ని కొనసాగించాలా అన్న ప్రశ్న వచ్చినపుడు వివ్వకు ఒక ఆలోచన వచ్చింది. ఉద్యోగాలుకి బయట ప్రదేశాలకు వెళ్లినపుడు ముఖ్యంగా వాడాల్సింది ఇంగ్లీషు, హిందీ కాబట్టి అక్కడినుంచీ వారిని ఇంగ్లీషు మీడియంలోకి మార్చి తెలుగులో వారికి విషయం పూర్తిగా అవగాహన చేసేట్లుగా చర్య తీసుకుందామనుకుంది. తన దగ్గిర పెరిగిన విద్యార్థులు ఏదీ తమకు రాదని, అది ఒక లోటుగా బాధపడకూడదన్నదే ఆమె ఉద్దేశ్యం.
తనకయితే తెలుగు మీడియంలోనే వారిని చదివించాలని ఉన్నా పరిస్థితులను కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన బాధ్యత తనమీద ఉండటంతో అలా నిర్ణయించుకుంది.
పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు విలువలతోకూడిన విద్యాబోధన కావాలనుకున్నామని, ఏ నిర్ణయమయినా మాకు సమంజసమేనని, ఈ నిర్ణయం ఇంకా సబబుగా ఉందని తెలియజేయటంతో తను అనుకున్నట్లుగానే ఆరవ తరగతి నుంచీ ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టింది.
పిల్లలు కూడా తమ అంగీకారాన్ని తెలియజేశారు. గురువుల నిర్ణయమే తమ నిర్ణయంగా, ఆచార్యదేవోభవకి అర్థం తెలుసుకుని పెరిగిన పిల్లలుగా మరో రకంగా మాట్లాడే అవకాశమే లేదు.
న్యాయం, నీతి, ధర్మం వాళ్ళ హృదయాలలో ఎల్లప్పుడూ నివాసముంటాయి. అవినీతి, అధర్మం, అన్యాయం వారి మనసులలో నీడలా కూడా తాకలేని విధంగా వారు దినదినాభివృద్ధి చెందారు. పదుగురిలో వారు ప్రత్యేకంగా గుర్తింపబడుతున్నారు.
***
‘‘విశ్వసాహితీ సేవా సమితి’’ నుంచీ వచ్చాం. మీరు చేసిన, చేస్తున్న సంఘ సేవకు గుర్తింపుగా సంఘమిత్ర అవార్డును మా సమితి తరఫున అందజేయాలనుకుంటున్నాం అన్నాడు సంస్థ అధ్యక్షుడు అభయారావ్.
‘‘సారీ! మీరేమనుకోకండి. ఇలాంటివి నేనంగీకరించను’’ అంది మర్యాదగా విశ్వ.
‘‘మేడమ్.. మాది అన్ని సంస్థలలాంటి సంస్థ కాదు. డబ్బులు తీసుకుని అవార్డులు ఇవ్వం మేము. మేము అవార్డు ఇస్తున్నామంటే వాళ్ళ గత చరిత్ర అంతా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటాం. మంచి సంస్థ ద్వారా అవార్డు తీసుకోవడం మీకూ మంచిది. అలాగే మీ వంటి మంచి వ్యక్తులను గుర్తించామని మా సంస్థ కూడా చెప్పుకోగలుగుతుంది. కాదనకండి మేడమ్’’.
మీతోపాటూ రచయిత్రి కమలారామన్‌గారికి కూడా అవార్డు ఇస్తున్నాం.
‘‘ప్లీజ్ మేడమ్, అంగీకరించండి’’.
పదే పదే అతను అభ్యర్థిస్తుంటే కాదనలేకపోయింది. అదీకాక కమలారామన్‌గారితో మాట్లాడాలని ఎప్పటినుంచో కోరిక. ఆవిడను కలవడానికి అయినా అంగీకరిద్దాం అని తన సమ్మతిని తెలియజేసింది.
‘‘చాలా సంతోషం మేడమ్. బ్రతిమాలుతున్నానే కానీ మిమ్మల్ని ఒప్పిస్తాననుకోలేదు. సరే. మా వీలు చూసుకుని మీకు తేదీ చెప్పి కన్‌ఫర్మ్ చేసుకుంటాం. వస్తాం’’ అని వెళ్లిపోయాడు.
ఆ రోజే విశ్వకి అవార్డు ప్రధానోత్సవం
అరగంట ముందే నిర్వాహకులు రమ్మని అభ్యర్థించటంతో అంతా కళాభారతి ఆడిటోరియంకి చేరుకున్నారు.
అతిథులందరినీ ఒక హాలులో సమావేశపర్చారు.
విశ్వను గెస్ట్ రూమ్‌లోకి తీసకువెళ్లారు.
అప్పటికే కమలారామన్ అక్కడు వచ్చి ఉండటంతో విశ్వ తనను తను పరిచయం చేసుకుంది ‘‘మీరు నా అభిమాన రచయిత్రి’’ అంటూ.
‘‘అలాగా! సంతోషం’’ అన్నారావిడ.
మీ ‘సర్దుకుపోండి’ పుస్తకంలో నేనేం చేశానో తెలుసాండీ అంటూ శాంతి ఇంటి దగ్గర జరిగిన విషయం అంతా వివరించింది.
తను వ్రాసిన పుస్తకం అందరిలో మార్పు తెచ్చిందన్న విషయం తెలుసుకుని ఆవిడ కూడా చాలా ఆనందపడ్డారు.
ఉన్నట్టుండి విశ్వ ‘‘యువత కోసం మీరు ఇలాగే ఒక పుస్తకం ఎందుకు రాయకూడదు?’’ అని అడిగింది.
‘‘ఎందుకు రాయకూడదూ?

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ