డైలీ సీరియల్

నాది అనుకునేదంతా అజ్ఞానమే (ప్రహ్లాదుడు -12)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడు నాలుగు కాలాల పాటు బతికి బట్టకట్టగలడా? ఆ విష్ణువెక్కడ ఉన్నాడో అతడు వస్తాడో రాడో కానీ నేడు ఎదురుగా ఈ దానవేశ్వరుడు కబంధ హాస్తాలు చాస్తున్నాడే ఈ మూర్ఖుని చేతిలో ఈ బాలకుడు అంతం చెందుతాడా అని కొంతమంది వ్యధ చెందుతున్నారు. కానీ ఏమీ చేయలేక దానవరాజు భయపడి ఆత్రుతతో వేదనతో చూస్తున్నారు.
ఏమిరా మాటాడవు. నాముందుకు వచ్చే సరికి మాటలు పడిపోయాయా. నీవెవరి అండ చూసుకుని పెట్రేగి పోతున్నావు. నిన్ను నీకు అండగా ఉన్నవాడిని ఒక్క క్షణంలో పెరికిపారేస్తాను. నిన్ను ఇపుడే చంపిపారేస్తాను. మాట్లాడు అని మళ్లీ హుంకారం చేశాడు హిరణ్యకశిపుడు.
‘తండ్రీ! ఎందుకీ వ్యాకులం? నీకు హరి అంటే ఎవరో తెలియదా? ఇంతకు ముందు కూడా నేను నీకు వివరించానుకదా. మనమందరమూ ఒకనాటికి కాలగర్భంలో కరిగిపోయేవారిమే. కానీ ఆ ఈశ్వరుడు మాత్రం ఎన్నటికైనా నిలిచి ఉంటాడు. ఆ పరంధాముడే నాకు బలమూ బలహీనమూ . ఏ దిక్కు లేనివారికైనా జనార్దనుడే దిక్కు. జగత్పతియే నాకే కాదు నీకును దిక్కు. వానిని చూడడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. నీవు చేసేదంతా నీ గొప్పతనం అనుకొంటే నీది మూర్ఖత్వమే కాని మరేమీ కాదు. ఓ దానవేశ్వరా! నీవు లోకాలన్నింటినీ గెలిచానని అనుకొంటున్నావు. కానీ నీలో ఉన్న కామక్రోధ లోభత్వాలనే అరిషడ్వర్గాలను గెలవలేదు. అందుకే మూర్ఖుడివై పేలుతున్నావు. ఇప్పటికైనా మించి పోయింది. ఆ హరి ఎన్ని చెడుపనులు చేసినా చనిపోయేముందు హరి నామాన్ని ఒక్కసారి స్మరించినా వారిని క్షమించివేస్తాడు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని ఆ హరిపాదాలను ఆశ్రయించు. నిన్ను తప్పక క్షమించివేస్తాడు ఆ హరిని మించిన వారు ఎవరూలేరు. ఇక్కడ కనిపించేదంతా మిథ్యనే. ఈ మిథ్యనే నాది నాది అని విర్రవీగుతున్నావు. నీది నాది ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే. జగత్తు జగన్నాథుడు వేరు వేరు కాదు. జగన్నాథుడే నిజం. సత్యమూ. అన్నా డు ప్రహ్లాదుడు.
కోపం పట్టలేని హిరణ్యకశిపుడు ‘చూస్తుంటే నాకే నీతులు బోధించేవాడివయ్యావు. నీ మాటలు కట్టిపెట్టు. ఇక లాభం లేదు. నీకు ఎవరు మూర్ఖులో ఎవరు శాశ్వతమో చూపించివేస్తాను ఓరీ! దుర్మతీ! చాలా పెదురుతున్నావు. నాతోనే ఎదురుతిరిగి వాదులాటకు వస్తున్నావు. నా సంగతి నీకు తెలియదు. ఈ జగానికి అధిపతినే నేనే. మరొక జగన్నాథుడంటూ ఎవరూ లేరు. ఈ జీవకోటికి సంపూర్ణశక్తిమంతుడైన రాజు ను నేను తప్ప వేరొకడు లేడు కాక లేడు
క. ఎక్కడఁ గలఁ?డే క్రియనే
చక్కటి వర్తించు ? నెట్టి జాడను వచ్చున్?
జక్కడుతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్
నీవు వాని సేవకునిగా ఒకటే హరి గిరి తురి అంటున్నావు. ఎక్కడా హరి? నా ముందుకు రమ్మను. నాకే నీతులు చెప్పే మొనగాడివి అయ్యావా నీవు. నా సోదరుడిని చంపినపుడు ఆ హరి కోసం నేను వెదకని చోటు లేదు. నేను వరాలు పొందినపుడు కూడా ఆ మురారి కోసమే ముల్లోకాలు గాలించాను. ఎంతోమందిని అడిగాను. ఏరూపంతో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అని ఒక్కడూ వాని ఆనుపానులూ చెప్పలేదు. ఇపుడు వేలెడంత లేనివాడు నా ముందుకు వచ్చి నాకే చెబుతున్నాడు. ఎక్కడున్నాడో చెప్పు అంటూ ముందుకు అడుగు వేసాడు. చూపించు నిన్ను వాడిని ఒక్కమాటే చంపిపారేస్తాను అని ఖడ్గాన్ని స్పృశిస్తూ ముందుకు కదిలాడు.బహు శాంతమూర్తియైన ప్రహ్లాదుడు మరింత చిరునవ్వుతో ముందుకు వచ్చి తండ్రీ విష్ణువు వెదికాను అంటున్నావు కానీ అసలు విష్ణువు లేని చోటు ఎక్కడ ఉంది? విష్ణువే సర్వమూ వ్యాపించి ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు ఇందుగలడు అందులేడని సందేహం ఎందుకు తండ్రీ. ఆర్తితో అభాగ్యులైన వారు పిలిస్తే పలుకుతాడు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి