డైలీ సీరియల్

విలువల లోగిలి-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాయచ్చు’’అన్నారావిడ.
‘‘అయితే రాయండి. యువత పయనం గురించి ముఖ్యంగా తెలపండి అందులో. కాలేజీకి వెళ్ళేదే ప్రేమకోసం అనుకునే ఈ యువతరంకి కనువిప్పుగా ఉండాలి నవల. వాళ్ళు సక్రమ మార్గంలో నడిస్తేనే మన దేశం అభివృద్ధి చెందేది?’’
‘‘మీరే రాయవచ్చుగా. చక్కగా మాట్లాడుతున్నారు’’
‘‘లేదు.. లేదు.. సరస్వతీ కటాక్షం అందరికీ దొరికేవస్తువు కాదు. అది కొందరికే వరం. అందులో ముఖ్యులు మీరు’’.
‘‘అంత ఏం లేదు’’
‘‘మీ గొప్పతనం మేం చెప్పాలి. మంచి రచనలు మనుషులలో మార్పును తీసుకువస్తాయి. అలాంటి రచనలు మీ నుంచీ వచ్చాయి. అందుకే మీరంటే నాకు అభిమానం’’’.
‘‘సరే అది ప్రక్కన పెట్టి ఆ నవలలో ఇంకా నేనేం సృజించాలనుకుంటున్నారో చెప్పండి విశ్వా’’.
విదేశీ సంస్కృతి వైపు పరుగులు తీస్తూ మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను మరిచిపోతున్న యువతను మేల్కొల్పండి. పబ్‌లు, డేటింగ్‌లు, సహజీవనాలు మనకు వద్దని చెప్పండి. ప్రేమించుకుంటే పెద్దలతో చెప్పి వారి అనుమతితో వివాహం చేసుకోమనండి. కాలేజీలో చదువుకోమనండి. ప్రేమకు దూరంగా ఉండమనండి. ఉద్యోగస్థులై తమ కాళ్ళమీద తామునిలబడ్డాక ప్రేమించి పెళ్లి చేసుకోమనండి. నలుగురితో ప్రేమ, మరొకరితో పెళ్లి పద్ధతికి స్వస్తి పలికించండి’’ అంది ఆవేశంగా.
‘‘విశ్వా! మీరు నాకు నచ్చారు. నాలుగు మాటలలో యువతరం గురించి చక్కగా చెప్పేసారు. మీరు చెప్పినట్లుగా నవల రాయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి వదిలెయ్యను. రాస్తానని మీకు మాటిస్తున్నాను’’.
‘‘చాలా థాంక్సండీ’’ అంది విశ్వ.
తాము ఇద్దరే అతిథులుగా అక్కడ ఉండటంతో ఆవిడతో మాట్లాడాటానికి వీలయింది. లేకపోతే ఫోను నెంబరు తీసుకుని మాట్లాడుదామనుకుంది. బాగానే కలిసి వచ్చింది. తను చెప్పాలనుకున్నది ఆవిడకు చెప్పేసింది.
‘‘మీ గురించి.. ఆవిడ మాట్లాడేలోపే మిగిలిన వాళ్ళంతా వచ్చేసారని, సభ ప్రారంభిద్దామని చెప్పటంతో వారి వెనుకే ఇద్దరూ అనుసరించి వెళ్లారు.
ఇద్దరు చిన్నారులు దీపాలు వెలిగించిన ప్లేట్లలో నృత్యం చేస్తూ సభికులకు స్వాగతం చెప్పారు.
ఆ తర్వాత సభ ప్రారంభమైంది.
ముందుగా ఆ సంస్థవారు గతంలో నిర్వహించిన పనులు గురించి సంక్షిప్తంగా వివరించారు.
ముఖ్య అతిథి మాట్లాడాక సన్మాన కార్యక్రమం ప్రారంభించారు.
ముందుగా కమలరామన్ గారికి సన్మానం చేశారు. సన్మానపత్రం చదివి వినిపించిన ఆవిడకు అందజేశారు.
తర్వాత విశ్వకు సన్మానం చేశారు. సంఘమిత్ర అవార్డును కూడా బహూకరించారు.
ఇక సన్మానపత్రంలో వారు చదివిన విషయాలు విశ్వకి, వారి కుటుంబాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. అంతటి సమాచారాన్ని వారెలా సేకరించారో అర్థం కాలేదు. కొన్ని విషయాలయితే తనే మరిచిపోయింది విశ్వ. విశేషమేమిటంటే, తన చిన్నతనం నుంచీ ఇప్పటిదాకా చేసిన అన్ని సేవా కార్యక్రమాలు అందులో పొందుపరచటం సంస్థ గొప్పతనంగా అభివర్ణించాల్సిందే.
పట్టుచీర, పసుపు కుంకుమలను బొట్టుపెట్టి అందించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో జరిగిన ఆ సన్మానం విశ్వ మదిలో తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయింది.
విశ్వ, కమలారామన్ గారు మాట్లాడక, వందన సమర్పణ చేసి సభను ముగించారు.
విశ్వ, కమలారామన్ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ ఒకరి సెల్ నెంబర్ మరొకరికి ఇచ్చుకున్నారు.
తరువాత కూడా తమ స్నేహం కొనసాగాలని ఇద్దరూ పరస్పరం అనుకుని వీడ్కోలు తీసుకున్నారు.
తనకిష్టం లేకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి అంగీకరించక తప్పటంలేదు.
అయిదేండ్ల క్రితం గిన్నీస్ తరువాత ఇదే. అయినా మనసు అంగీకరించదు.
ఇలాంటివి అవసరమా అని తనను నిలదీస్తూంది.
దానికి సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితి తనది అనుకుంది విశ్వ.
కాలచక్రంలో అయిదేండ్లు కదిలిపోయాయి.
లోగిలిలో విద్యార్థులంతా పదవ తరగతి పరీక్షలు వ్రాశారు. ఇక ఎక్కడివారు అక్కడు వెళ్లిపోయి తమకిష్టమైన కాలేజీల్లో చేరతారని తలచుకుంటూంటే విశ్వకు దుఃఖం తన్నుకువస్తోంది.
తమకు పిల్లలు కలగకపోనా చందూ, తనూ దానిని ఓ లోటుగా భావించలేదు. ఎవరిని దత్తత తీసుకోవాలని ఆలోచన కూడా రానీయలేదు.
విశ్వాన్ని ప్రియంగా ప్రేమించే విశ్వ స్వార్థంగా ఒక్క తన పిల్లలకే తన ప్రేమను పంచాలని ఎప్పుడూ అనుకోదు. అందుకే స్కూలులో పిల్లలందరినీ తన పిల్లలే అనుకుంది. దానికి తగ్గట్టుగానే వారంతా తనని అమ్మా అనే పిలుస్తారు.
ఇంతకంటే అదృష్టం ఏం కావాలి?
కానీ వారంతా తమని వీడి వెళ్లిపోతారంటేనే భరించలేనంత బాధ. ఎలా దీనిని తట్టుకోవటం?
పిల్లలు వెళ్లిపోవటం, భవనం స్వాధీనం చేసుకోవటం రెండూ ఒకేసారి జరిగిపోతాయేమో.
ఉబికి వస్తున్న కన్నీటిని కర్చ్ఫీతో వత్తుకుంది. అయినా అవి ఆగని ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి.
చందూ బయటనుంచీ హడావిడిగా వస్తూ ‘‘విశ్వా! మనమొక చోటికి వెళ్లాలి. రా!..’’ అంటూ కూర్చున్న విశ్వను లేపి మరీ తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు కార్లో.
‘‘అమ్మకి, అత్తయకి చెప్పివస్తాను’’అని దిగబోయింది.
‘‘అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వుండు’’ అని డోర్ వేసి కారును వైజాగ్ వైపు మళ్లించాడు.
చందూ తనని ఎక్కడికి తీసుకువెళుతున్నాడు?
‘‘ఎక్కడికి వెళుతున్నాం చందూ?’’’ అడిగింది ఉండబట్టలేక.
‘‘తినబోతూ రుచి అడుగుతావెందుకు?’’ అన్నాడు చిలిపిగా.
‘‘ఎప్పుడూ తను రవ్వంత బాధపడినా దాన్ని చిటికెలో తీసేసే చందూ ఇప్పుడు తనింత బాధతో ఉంటే గమనించలేదా?’’ ఆశ్చర్యంగా ఉందే’’ అనుకుంది మనసులో.
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ