డైలీ సీరియల్

విలువల లోగిలి-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారి పొడుగునా కబుర్లు చెబుతూనే ఉన్నాడు చందూ.
మధ్య మద్యలో ఏవేవో అడుగుతున్నాడు.
తనూ సమాధానాలు చెబుతూనే వుంది.
కానీ శరీరం ఇక్కడున్నా మనసు ‘లోగిలి’ లోగిలిలోనే ఉండిపోయింది. అది తనకు మాత్రమే తెలుసు.
‘చందూకి కూడా’ అంది అంతరంగం.
‘‘ఏం కాదు. ఈసారి అసలు చందూ నా బాధను గుర్తించటమే లేదు’’ తనలో తాను అనుకుంటున్నానని బయటకే అనేసింది.
‘‘ఏమిటంటున్నావ్?’’ అడిగాడు చందూ.
‘‘ఏం లేదు! ఏం లేదు!’’ అంది కంగారుగా.
‘‘ఏదో అన్నావ్? చెప్పు’’ మళ్లీ రెట్టించాడు.
‘‘ఏం లేదన్నాగా చందూ! నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి’’
‘‘అబ్బో! మాకు తెలియదులే!’’
అందుకే గదా చెప్పింది అనేది మామూలుగా అయితే.
కానీ ఇపుడు మాత్రం ఏమీ మాట్లాడాలనిపించటంలేదు.
అలా దారిపొడవునా ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉన్నాడు చందూ.
‘‘చందూ, ఏమిటి వైజాగ్ పొలిమేరలను దాటేస్తున్నాం. ఎక్కడికి తీసుకెళ్తున్నావ్?’’
‘‘రాణీగారిని ఒంటి స్తంభపు మేడలో బంధించటానికి’’ అంటూనే కారు ఆపాడు.
ఎదురుగా లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా అందంగా శిల్పాలతో అమర్చిన ఆర్చ్. దానిపైన బంగారంలా మెరుస్తూ కనిపిస్తున్న అక్షరాలు ‘అమృత హృదయ నిలయం’.
‘‘ఏమిటిది? పేరు చాలా బాగుంది’ అనుకుంది మనసులో.
‘‘ఎక్కడికి వచ్చాం? ఇంకా సస్పెనే్సనా?’’
‘‘లేదులే. కారు ఎక్కు. ఇంకాసేపట్లో మేఘాలు విడిపోయినట్లు అంతా తేటతెల్లమయిపోతుంది.’’
ఏమిటో ఈ రోజు చందూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు.
చిత్రం తనకు చూపించటానికేనని ఆమెకు తెలియదుగా!
లోపలికి తీసుకువెళ్లి కారు ఆపాడు.
ఎదురుగా మైసూరు మహారాజా ప్యాలెస్‌కి మూడింతలున్న అతిపెద్ద బిల్డింగ్.
‘‘ఏమిటిది?’’
‘‘పైన చూడు’’
‘‘ఏముంది?’’
‘‘చూస్తే తెలుస్తుందిగా’’
‘‘విశ్వసౌధం’’
‘‘ఎవరిది?’’
‘‘మనదే!’’
‘‘అంటే’’
‘‘విశ్వ సౌధం అంటే విశ్వభవనం అని’’
ఇంకా అర్థం కాలా.. అంది అయోమయం.
‘‘విశ్వా! ఇది నీ కలల సౌధం’’
‘‘నాదా!’’ అంది ఆశ్చర్యంగా.
‘‘పదేళ్ళ క్రితం నీకు మాటిచ్చాను, గుర్తుందా?’’
‘‘ఏమని?’’
‘‘ఓ అనాధాశ్రమం, ఓ వృద్ధాశ్రమాన్ని కావాలన్నావుగా’’
‘‘అదా ఇది?’’
‘‘అవును. ఇక నుంచీ మనంకూడా ఇందులోనే ఉంటాం. అందరితో కలిసి’’
‘‘అదెలా?’’
‘‘అంతా ఒకే కుటుంబంలా?’’
‘‘అవునా?’’
‘‘అదేగా నీ కల’’
‘‘నాకింకా నమ్మబుద్ధికావటంలేదు’’
‘‘ఇది ఎలా సాధ్యమైంది’’
‘‘‘పది సంవత్సరాలు కృషి చేస్తే’
‘‘అప్పటినుంచా?’’
‘‘నీకు మాట ఇచ్చినప్పటినుంచీ’’
‘‘మన మధ్య రహస్యాలే లేవనుకున్నా’’
‘‘మరి ఇంత సర్‌ప్రైజ్ ఇవ్వాలంటే రహస్యంగా ఉంచకపోతే ఎలా?’’
ఇదేముంది. నీకు కాళ్ళు నొప్పి పుట్టవంటే ఇంకా చాలా ఉంది’’
కాస్త దూరంలో వున్న మరో పెద్ద బిల్డింగ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు’’.
‘‘ఇదేమిటో తెలుసా?’’
‘‘మన స్కూల్ ‘లోగిలి’కి కొత్త బ్యాచ్ కోసం.’’
‘‘లోగిలి బ్యాచ్ వెళ్లిపోతున్నారుగా’’
‘‘ఎక్కడికి వెళ్లిపోతారు వాళ్లంతా? మనతోనే ఉంటారు. అటు చూడు, అదే ఇకమీద వారి కాలేజీ’’
‘‘సూర్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ’’ బోర్డును చూపిస్తూ.
‘‘అంటే వాళ్ళంతా మనల్ని విడిచిపెట్టి వెళ్లటంలేదా?’’
‘‘ఎక్కడికి వెళతారు? మనమే కాలేజీ పెడుతుంటే. వాళ్ళు మరోచోటుకు వెళ్లటానికి ఇష్టపడతారా? నువ్వే చెప్పు’
‘‘ఇదంతా నిజమేనా?’’ ఇంకా ఆశ్చర్యం నుంచీ తేరుకోలేదు విశ్వ.
‘‘అరె! విశ్వ బంగారం! కళ్ళముందు కనిపిస్తున్నా నమ్మమా?’’
‘‘ఇది.. ఇదంతా ఎలా సాధ్యమైంది?’’’
‘‘ఎలా.. అంటే.. అనుకున్నాం కాబట్టి అయ్యింది’’
‘‘దొంగా! పిల్లల గురించి ప్రొద్దున నుంచీ నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా!’’
‘‘నిజం చెప్పాలంటే ప్రారంభోత్సవం రోజునే నిన్ను తీసుకుని వద్దామనుకున్నా. కానీ నీ దిగులు చూసి మనసుకు సర్ది చెప్పలేక నిన్ను తసుకుని వచ్చేసాను’’
‘‘అంటే ఇదంతా అత్తయ్యకి, మామయ్యకి కూడా తెలుసా?’’
‘‘్భలేదానివే. వాళ్లే కదా ఇదంతా ప్లాన్ చేసింది’’
‘‘అన్యాయం, మీరంతా మంచివాళ్ళు అనుకున్నాను. అందరూ మోసగాళ్ళే’’
‘‘అవును. ఒప్పుకుంటున్నాం. నీ గుండె గదిలో శిక్ష వేసేయ్. జైలులోలా అలా ముగ్గురం ఉండిపోతాం’’ అన్నాడు సరదాగా నవ్వుతూ. ‘నేను చెప్పలా చందూ నీ బాధ పోగొడతాడని’ అంది అంతరంగం.
‘‘నువ్వు నిజమే చెప్పావు. నేనే మొదటిసారి పొరబడ్డాను చందూ గురించి. ఇప్పుడనిపిస్తోంది, చందూ నా కోసం ఎంత చేసాడో?’’ అని.
‘‘్థ్యంక్యూ చందూ’’ అంటూ అతని నుదుటిమీద ముద్దిచ్చింది.
‘‘పోనీలే బ్రతికిపోయాను. నిజం దాచానని చెంప పగలగొడతావని అనుకున్నాను’’.
‘‘ఎందుకు. తాజ్‌మహల్‌లా నాకోసం విశ్వా పాలెస్ కట్టినందుకా?’’
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206