డైలీ సీరియల్

కాల మహిమ తోనే సుఖదుఃఖాలు ( వామనుడు - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాదశి. విష్ణువుకు ప్రీతికరమైన రోజు. అదితి తన భర్తచేత ఉపదేశం పొందిన పయోవ్రతం నియమానుసారం చేస్తోంది. ఈ ఏకాదశి మరింత నియమంగా అదితి మొట్టమొదట తన భర్తను పూజించింది. తరువాత మహావిష్ణువు ప్రీత్యర్థం పయోవ్రతాచరణలో భాగంగా మహావిష్ణువుకు క్షీరాభిషేకం నిర్వహించింది. పాలునివేదన చేసింది. ఆ పాలనే ప్రసాదంగా తాను తీసుకొంది.
నియమనిష్టలతో అదితి ఫాల్గుణమాస శుక్లపక్షం ప్రారంభదినాన ఆచరించిన పయోవ్రతం నెమ్మదిగా సాగుతోంది. ఉన్నట్టుండి అదితి మనస్సు ఆహ్లాదకరంగా మారింది. వెలగట్టగలేని సంతోషంతో ఉప్పొంగిపోతోంది. కశ్యపునికి సంతోషతరంగాలు మదిలో మెదులుతున్నాయి. ఇక భగవంతుడు మనలను కరుణించబోతున్నాడని కశ్యపుడు తలిచాడు. అపుడే అదితి వచ్చి 3‘‘ నాథా! నా మనస్సెందుకో కాని మహాసంతోషతరంగాలతో ఉర్రూత లూగుతోంది’’2అంది.
3‘‘ నిజమే నా మనస్సూ ఆ విధంగానే ఉంది. బహుశా నీవుచేస్తున్న ఈ వ్రత మహిమ వల్ల నారాయణుడు సంతోషిస్తున్నాడేమో. నారాయణుడు సంతోషిస్తే లోకం అంతా సంతోషంగా పొంగిపొరులుతుంది’’2అన్నాడు.
అలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగానే వాతావరణంగా చల్లదనంతో నిండింది. వారి ఎదుట ఆజానుబాహుడు, చతుర్భుజుడు, శంఖ చక్రగదాపద్మయుతుడు, అరవిందదళాయతాక్షుడు, పట్టుపీతాంబరాలు ధరించిన వాడు, మెడలో కౌస్త్భుమాల, వనమాలను ధరించినవాడు, వేనవేల సూర్యబింబాలకు సాటిరాని కాంతి గల మోముతో చిరునవ్వు నవ్వుతూ 3‘‘అమ్మా!’’ అని పిలిచాడు.
అదితి ఆ పిలుపుకుత్రొటుపడింది. కళ్లు తిప్పి చూసింది. ఎదురుగా అరవిరిసిన తామరరేకులవంటి కనులు గలవాడు, నుదుట ముంగురులు అల్లలాడుతున్నవాడు, కోదండం వంటి కనుగొమ్మలు కలిగిన వాడు, పాలుగారే చెక్కిళ్లు గలవాడు, కెందామర వంటి మోవితో చిరునవ్వు నవ్వుతూ తననే చూస్తున్న వానిని చూసి అదితి సంతోష తరంగిణియై కనురెప్పవేయకుండా చూస్తోంది. ఆమె కనులు సంతోషంతోనిండిపోయి ఆనందభాష్పాలను కారుస్తున్నాయి. ఆమె చేతులు వణుకుతూ నమస్కారం చేయడానికి పైకి వస్తున్నాయి. ఆమె శరీరమంతా పులకాంకురాలతో నిండిపోయింది. ఎన్నో చెప్పాలన్న ఆత్రుత కలిగిన అదితి పెదవులు మాటను వెలువరించకుండా అదిరిపాటుకు గురి అవుతున్నాయి.తిరిగి శ్రీమన్నారాయణుడు4‘‘అమ్మా!’’22అన్నాడు. అదితి ఆనందాతిరేకంతో వణికిపోతోంది. ఆ స్థితిని కశ్యపుడు చూశాడు.
ఆయన చేతులు జోడించి 3‘‘మహానుభావా! మురారి! నారాయణ! భక్తవత్సలా! యజ్ఞేశ్వరా, విశ్వంభరా, సుగుణాకార, అచ్యుతా, కేశవా, భక్తులపాలిటి కామధేనువా! కమలాలవంటి కనులు గలవాడా! మము కటాక్షించడానికి, మమ్ముకాపాడడానికి, నీ భక్తులను ఆపదలనుంచి కడగండ్లనుంచి కాపాడడానికి వచ్చావా తండ్రీ!’’అంటూ కశ్యపుడు అనేకవిధాలు దేవదేవుని స్తుతించి నమస్కారం చేశాడు.
అదితి కశ్యపుని మాటలు వింది. తాను ఏ కోరికతో పయోవ్రతాన్ని ఆచరించిందో ఇపుడు భగవంతుడు తన కోరికను ఈడేర్చడానికి వచ్చాడని గ్రహించింది. అయినా ఆమె నోటినుంచి మాటలు రావడంలేదు. ఎంతో సంతోషంతో గొంతు గాద్గికం కాగా 3‘‘తండ్రీ’’2అనగలగింది. అదితి అవస్థను గమనించిన మహావిష్ణువు 3అమ్మా! స్వస్థురాలివి కమ్ము. నీ బాధ నాకు అర్థమైంది. త్వరలోనే నీవు సంతోషించేకాలం ఆసన్నమవుతుంది. రాక్షసులను, అసురీ శక్తులను అంతమొందించడానికి నేనే నీ కడుపున ఉదయించబోతున్నాను. నీవు నిశ్చంతగా ఉండుము. నీ బిడ్డలైన దేవతలకు వచ్చిన ఆపద తొలిగిపోయే సమయం వచ్చింది. అమ్మా! కుమారునివలె రాబోతున్న నాకు నీ మమతానురాగం కావాలి. నీ అమ్మతనంతో నన్ను పాలిస్తావు కదా తల్లీ శీఘ్రంగా నీ కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. సంతోషంగా కాలం గడుపుము2అని చెప్పాడు.
అదితికి సంతోషం మితిమీరింది. ఆమె కనుల నీరు కారుతుండగా చేతులెత్తి మహావిష్ణువుకునమస్కారం చేసింది.
మహావిష్ణువు తన ధామానికి వెళ్లిపోయాడు. అదితి, కశ్యపులు ముదంతో ముచ్చట్లాడుకున్నారు. దేనికైనా కాలం రావాలి. మీరు తపోభూమికి తరలివెళ్లిన తరువాత దితి బిడ్డలు అహంకార పూరితులయ్యారు.
ఇంద్రుని చేతిలో ఓడిపోయిన బలి శుక్రాచార్యుని సేవించాడు. గురువును నమ్మినవారికి లేనిదంటూ ఏమీ ఉండదు కదా. అందుకే గురుఅనుగ్రహంతో బలి అజేయుడై నిలిచాడు. కాలం ఒక్కరీతిగా ఉండదుకదా. బలి శుశ్రూషతో ఆనందించిన శుక్రాచార్యులు బలిచేత విశ్వజిద్యాగాన్ని ఆచరింపచేశాడు. బలి చక్రవర్తికి హోమాగ్ని నుంచి బంగారు వస్త్రాలు కప్పిన రథమూ, సూర్యుని గుఱ్ఱాల వంటి గుఱ్ఱాలు, సింహపు జెండాకలిగిన గొప్పవిల్లూ, అమ్ములపొద, కవచమూ లభించాయి.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804