డైలీ సీరియల్

విలువల లోగిలి-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటినుంచో ఇక్కడే ఉన్నారు. ఈ రోజు ఈ ఊరినీ, ఈ లోకానే్న వదిలేసిందన్నమాట. ప్చ్.. ఈ రోజు ఆవిడ.. రేపు ఎవరో.. అంతా మాయ. ఈ ప్రపంచమే మాయ అనుకుంటూ వెళుతున్నాడు ఒక ముసలి వయసులో వున్న పెద్దాయన.
బ్రతుకుమీద తీపి వున్నవాడికి ఎప్పుడు పోతానో అని భయం అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. అదీ వయసు పెరిగేకొద్దీ ఈ యావ మరీ ఎక్కువవుతూ వుంటుంది. అదే ఇంకా ఏం సాధిస్తాంలే అనుకునేవాళ్లకు ఏ రోజైనా ఒకటే అనుకుంటారు.
అసలలా ఒక్కరైనా ఉంటారా?
బ్రతుకుమీద ఆశ లేని వాడెవడు?
సుగుణను ఇక్కడికి తీసుకువస్తే బాగుండేది. ఇక్కడే పుట్టి పెరిగిందిగా. ఊరిమీద మమకారం ఉంటుంది అంటున్నారు వాళ్ళలో ఒకరు.
అక్కడ విశ్వ కాసేపు స్పృహలోకి వచ్చి ‘‘అమ్మా! అమ్మా!’’అంటోంది. మళ్లీ స్పృహ కోల్పోతోంది.
విశ్వ ఆ స్థితిలో ఉంటే చందూకి, మిగిలిన వాళ్లకూ ఏం చెయ్యాలో తోచటంలేదు.
అలా డిప్రెషన్‌లో వున్నప్పుడు ప్రయాణం చేయించకుండా ఉండటమే మంచిదని డాక్టరు చెప్పటంతో సుగుణ అంత్యక్రియలు అక్కడే చేసెయ్యాలని నిశ్చయించుకున్నారు.
అదే సమయంలో తాము బయలుదేరుతున్నామని భువన ఫోనుచేసింది. వాళ్ళుకూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు కాబట్టి ఫర్వాలేదు.
భువనత్తయ్యా సుగుణను సొంత చెల్లిలి కంటే అభిమానంగా చూసుకునేదని అందరూ అంటుంటే ఎన్నోసార్లు వినేవాడిని అనుకున్నాడు చందూ.
అత్తగారి హఠాన్మరణం కంటే విశ్వ ఆరోగ్యం చందూని ఎక్కువ కలవరపెడుతోంది.
నరేంద్రనాధ్ అన్ని పనులు చూసుకుంటున్నారు.
లోగిలికి, కంపెనీకి సెలవు ప్రకటించేసారు.
పిల్లలందరికీ ఆవిడంటే ప్రత్యేక అభిమానం- అందుకే అందరూ తుది దర్శనం కోసం వచ్చి చూసి వెళుతున్నారు.
లోగిలి స్ట్ఫా, కంపెనీ స్ట్ఫా అంతా అక్కడే వేచి ఉన్నాడు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్నట్లు. ఆవిడ విశ్వని చూసినట్లే తమని కూడా చూసేదని అందరూ అనుకోవటమే. అంత విశాల హృదయం ఉన్నాడవిడ కనుకే విశ్వకి విశ్వప్రియ అని పేరు పెట్టగలిగింది.
విశ్వకి తొందరగా స్పృహ వస్తే బాగుండును అని అందరూ అనుకుంటున్నారు.
ఎందుకంటే తన తల్లిని, తల్లి రూపాన్ని ఈ ఒక్కరోజే చూసుకోగలదు. తెల్లవారితే చితాభస్మమే మిగిలేది. అది అందరికీ తెలిసిన విషయమే.
నిస్వార్థ ప్రేమకు ఎంతో విలువ అని పెద్దలు చెప్పినట్లు వారి ప్రార్థనలు విన్నట్లే విశ్వ స్పృహలోకి వచ్చింది రెండు గంటల తర్వాత.
‘‘అమ్మా! అమ్మా!’’ అంటూ సుగుణ ప్రక్కన చేరిపోయింది. ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. విశ్వను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.
చివరకు చందూ కూడా.
అసహాయంగా అలా ఒక ప్రక్కనే నిలబడ్డాడు.
విశ్వకు దగ్గరగా వెళ్లాలని ఆమెను ఓదార్పునివ్వాలని ఎంతగా వున్నా ఆమెకు చేరువ కాలేకపోతున్నాడు.
విశ్వ ఎవరినీ దగ్గరకు రానివ్వటంలేదు.
కనీసం చెయ్యి కూడా వెయ్యనివ్వటంలేదు.
వాళ్లవి శరీరాలు వేరైనా ఒకే ప్రాణంలా పెరిగారు.
బంధం తల్లీ కూతుర్లే అయినా ప్రాణ స్నేహితులలా వ్యవహరించేవారు. ఇద్దరిదీ ఒకటే లోకంగా బ్రతికేవారు.
ఇప్పుడు ఒకరిని మాత్రం తీసుకువెళ్లిపోతానంటే ఎలా ఒప్పుకుంటారు?
‘‘అమ్మా! నేనూ నీతో వచ్చేస్తానమ్మా! నన్నూ తీసుకెళ్లిపో నీతో!’’ హృదయవిదారకంగా ఏడుస్తోంది విశ్వ.
ఇక లాభం లేదని అమృత విశ్వ ప్రక్కనే కూర్చుంది.
‘‘ఓర్చుకో విశ్వా! ప్లీజ్! అందరం ఏదో ఒక రోజు అక్కడికి వెళ్లాల్సిన వాళ్లమే. భగవంతుడు మంచివాళ్ళను ముందుగా తన దగ్గిరకు తీసుకువెళ్తాడు. అంతే.. నువ్విలా ఆరోగ్యం చెడగొట్టుకుని ఏడుస్తుంటే అమ్మ ఆత్మ శాంతిస్తుందా? చెప్పు. మీ అమ్మ ఎప్పుడూ నిన్ను సంతోషంగా నవ్వుతూ ఉండాలనే ఆకాక్షించింది. ఇదుగో, ఈ చేతి రుమాలుతో ముఖం తుడుచుకో. అమ్మను నవ్వుతూ సాగనంపు. ధైర్యం తెచ్చుకో.
ఆ మాట విశ్వను మరింత వివశురాలిని చేసింది.
రాత్రే అమ్మ తన మాటలతో వీడ్కోలు చెప్పేసింది. తనకే అర్థంకాలేదు.
ఆవిడ మీద అలిగింది.
ఎప్పుడూ మాట్లాడద్దు అంది. అందుకే తను మాట్లాడలేనంత దూరంగా వెళ్లిపోయింది.
అమ్మ మాట్లాడినా తనకు వినిపించనంత.. వెక్కి వెక్కి ఏడుస్తోంది.
అమృతను ఎవరో పిలవటంతో అక్కడనుంచీ లేచి వెళ్లింది. విషయం తెలియగానే భీమేశ్వరి, జార్జ్ వచ్చేశారు.
అమృత అటు వెళ్లటంతో భీమేశ్వరి విశ్వప్రక్కన వచ్చి కూర్చుంది.
‘‘చూసావా అక్కా! అమ్మ నన్నువిడిచి ఎలా వెళ్లిపోయిందో? కనీసం వెళుతున్నానని మాట మాత్రం చెప్పలేదు’’ అంది విశ్వ ఆమెను చూస్తూ.
‘‘అమ్మకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి.. ఊరుకో’’ అంది సముదాయింపుగా.
‘‘ఎలా ఊరుకోమంటావ్? ననె్నలా ఊరుకోమంటావ్? అమ్మను విడిచి నేనెలా ఉండగలను? నేనెలా ఉండగలను?’’ అంది రోదిస్తూనే.
కష్టం అంటే ఇదా?
తను బ్రతికి ఉన్నంతవరకూ ఏ కష్టాన్నీ తన దరిదాపులకు రానివ్వలేదు అమ్మ. కష్టానికీ తనకీ అడ్డుగోడగా నిలిచింది.
ఆ రోజు ఏమంది?
కష్టం వచ్చినా సుఖం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా తీసుకోవాలందే! నేను అలాగే తీసుకుంటానని ఆ రోజు సుందరి ముందు ప్రగల్భాలు పలికిందే! మరి ఇప్పుడు తనేం చేస్తోంది? పిలుపు వచ్చింది అమ్మ వెళ్లిపోయిందని తను తేలికగా తీసుకోలేకపోతోందేం?
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206