డైలీ సీరియల్

విలువల లోగిలి-63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా.. అమ్మా.. ఆక్రోశిస్తోంది ఆమె హృదయం ప్రతిక్షణం.
‘‘ఆ అమ్మాయిని కాసేపు లోపలికి తీసుకువెళ్లండి’’ అన్నారెవరో. దానికోసమే చూస్తున్న భీమేశ్వరి విశ్వ రానంటున్నా బలవంతంగా లోపలికి తీసుకువచ్చింది.
‘‘నన్ను ఉండనీ అక్కా! మళ్లీ అమ్మను చూడలేనుగా’’
వెళుదువుగానీ.. ఇప్పుడే వెళుదువుగానీ అని కాసేపు ఆపగలిగింది ఆమె.
విశ్వను లోపలి తీసుకెళ్లడం చూసి తను కూడా గబగబా లోపలికి వెళ్ళాడు చందూ.
ఒక గ్లాసుతో మజ్జిగ తీసుకురమ్మని గంగకు పురమాయించాడు.
‘‘విశ్వా!’’ అన్నాడు దగ్గరగా వెళ్లి
‘చందూ’ అంటూ అతన్ని అల్లుకుపోయింది.
‘‘విశ్వా! ఏడవకు. అమ్మ ఎక్కడికీ వెళ్లదు. ఆత్మగా మన దగ్గిరే ఉన్నారు. మన చుట్టూనే తిరుగుతున్నారు. నువ్విలా బాధపడుతూంటే ఆవిడ తట్టుకోలేరు. ఓర్చుకో విశ్వా. నువ్వు ధైర్యంగా ఉంటేనే అమ్మ ఆత్మ సంతోషిస్తుంది’’
మళ్లీ ‘్ధర్యం’అనే మాట వినగానే రాత్రి అమ్మ మాటలు గుర్తువచ్చాయి.
అప్పటిదాకా చందూ మాటలు విని తనకు తనే సర్ది చెప్పుకుని ధైర్యంగా ఉండాలనుకున్న ప్రయత్నం ఆ మాట వినటంతో నీరుగారిపోయింది.
గంగ మజ్జిగ గ్లాసు తెచ్చి చందూకిచ్చింది.
గంగ దగ్గరనుంచీ మజ్జిగ గ్లాసును అందుకుని ‘‘విశ్వా! బాగా నీరసపడిపోయావు. కాస్త. ఈ మజ్జిగ త్రాగు’’ అన్నాడు బ్రతిమాలుతూ.
‘‘వద్దు చందూ! నాకేం వద్దు! నాకు అమ్మ కావాలి. అమ్మకావాలి అంతే’’
మళ్లీ స్పృహ తప్పిపోతుందేమోనని చందూకి భయం వేసింది.
‘‘నువ్వు త్రాగకపోతే ఊరుకునేది లేదు. డాక్టరు గారు మధ్య మధ్యలో ఏదో ఒకటి ఇస్తూ ఉండమన్నారు’’ అంటూ వద్దు వద్దంటున్న ఆమెతో బలవంతంగా తాగించాడు.
సుగుణ గుడివాడలో పెరిగింది. అక్కడే ఈ కార్యక్రమం చేయాలని విశ్వకి ఏమన్నా ఉందా? తర్వాత అనుకుంటే లాభం ఉండదు. ఆ విషయం అడగకుండా ఉండలేడు. ఎలా అడగాలి?
మజ్జిగ తాగాక విశ్వ కాస్త తెప్పరిల్లింది.
ఇక ఏదైతే అదయింది, అడగక జీవితాంతం బాధపడేకన్నా ఇప్పుడు అడిగెయ్యటమే మంచిది అనుకున్నాడు.
అత్తయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు కూడా.
అయినా తప్పదు.
విశ్వను ఒక్కసారి అడగాల్సిందే?
విశ్వను ఒక ప్రక్క అనునయిస్తూనే ‘‘అమ్మను గుడివాడ తీసుకుని వెళ్దామా. డాక్టరుగారు నిన్ను అంతదూరం ప్రయాణం చేయించవద్దన్నారు. నాకేం చెయ్యాలో తోచటంలేదు. నువ్వు చెబితే నీ ఇష్టమొచ్చినట్లే చేద్దాం’’ అన్నాడు చందూ.
‘‘నీ ఇష్టం చందూ’’ అనేసింది.
సమాధానం ఏం చెప్పాలి అని ఆలోచించే స్థితిలో కూడా లేదు విశ్వ.
ఇంకా సంశయం వీడలేదు చందూకి.
అక్కడయితే ఆవిడ ఆత్మకి శాంతి చేకూరుతుందా?
‘‘ఆమె విశ్వను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. విశ్వకి అపాయం అంటే ఆమె అలా ఎలా కోరుకుంటుందనుకుంటున్నావ్?’’ అని అంతరంగం సమయానికి ప్రశ్నించటంతో చందూ ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేశాడు.
ఇక్కడే ఇక ఆ కార్యక్రమం జరిపిద్దామని నిశ్చయించుకున్నాడు. చందూ తాపత్రయం అలాంటిది.
అక్కడ గుడివాడలో అందరూ టీవీలకు అతుక్కుపోయారు.
అన్ని న్యూస్ ఛానెల్స్ వారు ప్రముఖ సంఘ సేవకురాలు విశ్వప్రియకి మాతృవియోగం అని ఇక్కడ జరుగుతున్నదంతా లైవ్‌కాస్ట్ చేస్తున్నారు.
తమ దగ్గరలేని సుగుణను కనీసం ఇక్కడైనా చూసుకోగలుగుతున్నామని తిండి తినటం మానేసి మరీ టీవీల ముందే కూర్చుండిపోయారు.
ఒకరకంగా చందూ కోరిక అలా తీరిందనే చెప్పాలి.
విశ్వ అమ్మ దగ్గర ఉంటానని వెళ్లిపోయింది.
కాసేపు తన ప్రక్కన గంగ కూర్చుంది.
ఎవరో ఒకరు ఆమెను అంటిపెట్టుకునే ఉంటున్నారు ఆమెకు ధైర్యం చేకూర్చటానికి.
ఎక్కడ కన్ను ఆర్పితే అమ్మను చూడలేనో అన్నట్లు కళ్ళార్పడం మరిచి తల్లినే చూస్తోంది విశ్వ.
కాలం అలా గడిచిపోతూనే వుంది.
భువనేశ్వరి వాళ్ళు రావటంతో విశ్వను ఎవ్వరూ ఆపలేకపోయారు.
‘‘పెద్దమ్మా!’’ అంటూ భోరుమంది.
తనను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న విశ్వను ఓదారుస్తూ ‘‘ఊరుకోమ్మా, ఊరుకో నాన్నా’’అంది భువనేశ్వరి.
‘‘ఎలా ఊరుకోను పెద్దమ్మా! అమ్మను అప్పుడే తీసుకెళ్లిపోవావాలా? ఏమంత వయసు అయిపోయిందని. వందేళ్ళు బ్రతుకున్నవారు లేరా? ఆయనకు మా అమ్మే కావాల్సి వచ్చిందా?’’
దుఃఖంలో భగవంతుడినే నిందిస్తోంది విశ్వ.
కాత్యాయనీ, సరోజినీ ఒక ప్రక్కనే నిలబడ్డారు.
మిగిలిన వాళ్ళందరూ కాస్త దూరంగా నిలబడి చందూతో అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయిందని వివరాలు తెలుసుకుంటున్నారు..
‘నిద్రలోనే చనిపోవటం అనేది ఎందరికో దొరకని అదృష్టం. ప్రశాంతంగా వెళ్లిపోయింది సుగుణ’ అంటున్నాడు మోహనగాంధీ.
అందరి నోట అదే మాట.
ప్రొద్దుగుంకకముందే కార్యక్రమం ముగించాలని పంతులుగారు కంగారు పెడుతున్నారు. శాంతి బయలుదేరానని ఫోను చేయటంతో చందూ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ముందు జరగాల్సినవి అన్నీ జరిపిస్తేఆ సమయానికి ఆవిడ చేరుకుంటారు అని ఎవరో సలహా ఇవ్వటంతో అన్నీ యధావిధిగా జరిగిపోయాయి.
ముందుగా విశ్వను ఆమె చుట్టూ ప్రదక్షిణం చేయమన్నారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206