డైలీ సీరియల్

పాత్రత ఎరిగి దానం ఇస్తే అక్షయమే (వామనుడు - 6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ మూడవ తాత హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించినవాడు కదా. అతడు గదాదండం పట్టుకొని ఎవరైనా శత్రువులున్నారా అని విశ్వమంతా వెదికాడు. కాని ఆయనకు భయపడి ఆ విష్ణువు దాక్కొన్నాడు. కొన్నాళ్ల తరువాత పందిరూపంలో వచ్చి మీ తాతను ఆ విష్ణువు మట్టుపెట్టాడు.
ఆ సంగతి మీ ఇంకో తాత హిరణ్యకశిపుడు తెలుసుకొన్నాడు. ఆయన మహావీరుడు కనుక మహావిష్ణువుకోసం విశ్వాన్నంతా తిరిగి తిరిగి వెతికాడు. కాకపోతే ఆ మహావిష్ణువు ఇతనికి కూడా దొరకలేదు. మాయలమారి కదా. అతడు ఆ హిరణ్యకశిపుని హృదయంలోకి వెళ్లి అక్కడే దాక్కున్నాడు. అది అటుండనిమ్ము.
‘నీ వంశంలోని వారంతా చాలా దయాపరులు, దానపరులున్నారు. మీ దగ్గరకు వచ్చిన వారని మీరు మీ పరాక్రమంతో కానీ, మీ సంపదతోకానీ వారిని సంతోషింపచేస్తారు కదా. ఆ విషయాలన్నింటినీ నేను ముందే తెలుసుకొని వచ్చాను. నీవు చేస్తున్నపనులు ఎంతో ఉత్తమమమైనవి. రాజ్యాధికారం, సంపద ఉన్నపుడు వాటిని ఇతరులకు పంచి పెట్టాలి. ఈ జీవితంలోని వస్తువులు, సంపద ఇట్లాంటివి ఏవీ ఎత్తుకొని మరు జన్మకు తీసుకొని పోవడానికి వీలుండదు కానీ ఈ జన్మ సంస్కారం మాత్రం వచ్చే జన్మకు మనం వద్దన్నా వస్తుంది. కనుక ఈ జన్మలో చేతనైనంత దానాలు, ధర్మకార్యాలు చేస్తూనే ఉండాలి అపుడు మాత్రమే మన జన్మ సార్థక్యం చెందుతుంది. అందుకే కదా నీవు నీ దగ్గరున్న సంపదనంతా ఇతరులకు పంచిపెడుతున్నావు. నీవు చేసే పనులను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ’
వామనుని మాటలు విన్న బలిచక్రవర్తి అత్యుత్సాహ వంతుడైయ్యాడు. అక్కడే ఉన్న శుక్రాచార్యులు దీనిని గమనిస్తూ ఉన్నారు. ‘3ఓ వామనా! నీవు ఇన్ని విధాల నన్ను తెలుసుకొని వచ్చావుకదా. మరి ఏమీ కావాలో నిస్సంకోచంగా నన్ను అడుగుము.’2 అన్నాడు.
3 ‘ఓ బలి చక్రవర్తీ! ఇన్ని సార్లు నీవు అడుగుతున్నావు కనుక ఆలోచిస్తున్నాను నేను ఒంటరివాణ్ణి, పైగా బ్రహ్మచారిని, నీవేమో పుత్తడిని, కన్యలను, భూములను, సంపదలను, గోవులను, రత్నాలను, ఆగ్రహారాలను ఇస్తానంటున్నావు కానీ వాటిని నేను ఏమీ చేసుకోను. నీ మాట కాదనలేక, నిన్ను నొప్పించడం ఇష్టం లేక మూడుఅడుగుల నేలను నేను కోరుతున్నాను. దానిని నాకు ఇప్పించి నీవు పుణ్యాన్ని మూటగట్టుకొనుము. ఈలోకంలో ఆర్జించాలనే తాపత్రయం ఉన్నవాళ్లు విశ్వాన్ని జయించాలనుకునేవారు కోకొల్లలుగా ఉంటారు. వారంతా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకొంటారు. కానీ వారికి సంతోషం తృప్తిలేకపోయినట్టు అయితే వారు ఎన్ని విజయాలను సాధించినా అవి అన్నీ వృథా అయినట్టే అవుతాయి. కనకు నేను బాగా ఆలోచించి కోరుకుంటున్నాను. నాకు మూడు అడుగుల నేలను దానం చేయుము’22అన్నాడు.
బలిచక్రవర్తికి ఆశ్చర్యానందాలు వేశాయి. అయ్యో ఎంత అమాయకుడు అనుకొన్నాడు. 3 ‘ఓ బ్రహ్మచారీ! నీవింత అమాయకుడుగా ఉంటే ఎలా జీవితం గడుస్తుంది. నావంటి సంపద ఉన్నవారి దగ్గరకు వచ్చి మూడు అడుగుల నేలను దానంఅడుగుతావా? నీవు ఎవరి దగ్గరకు వచ్చావన్న సంగతి అయినా చూడాలి కదా. అయ్యో నీవు అడగడం తెలియడం లేదు. ఇంకాస్త ఆలోచించి అడుగు ఏనుగులో అమ్మాయిలో లేక గోవులో..2’2 ఇంకా ఏదోచెప్పబోతున్నాడు బలిచక్రవర్తి.
3 ‘మహారాజా!నీవు నిజమే చెబుతున్నావు. నీవంటివాని దగ్గర ఇలా తీసుకోవడం బాగలేదు కానీ అవసరం అయిన దాని కన్నా కాస్త కూడా ఎక్కువ పుచ్చుకోకూడదు గదా. సంపదలున్న కొద్దీ ఆశమోహం పెరుగుతాయి. మోక్షానికి దూరం అవుతాము. నేను బ్రహ్మచారిని కనుక జందెం, గొడుగు, మొలత్రాడు ఇట్లాంటివి కావాలి కానీ ఇవన్నీ నాకు ఎందుకు? కనుక నీ హోదా తగ్గుతుంది అనీ ఆలోచించక నేను కోరింది నాకు ఇవ్వుము. నీకు యశస్సు కలుగుతుంది’2అన్నాడు వామనుడు.
అక్కడే ఉన్న శుక్రాచార్యులు ఆగలేక 3 ‘ఓ దానవేంద్రా! కొంచెం ఆగుము. మాట ఇవ్వకుము. నీవు అనుకొన్నట్టుగా ఇతడు కేవలం బ్రహ్మచారి కాకపోవచ్చు. ఆ మాయల మారి మహావిష్ణువు అయి ఉండవచ్చు. నేను చారుల వల్ల తెలుసుకొన్నది నిజమే అనిపిస్తోంది. అదితి గర్భంలో రాక్షస నాశం కోసం పుట్టాడితడు. నీ సంపదను, నీ రాజ్యాన్ని అన్నీ తీసేసుకొని ఆ ఇంద్రునికిస్తాడు. రాక్షసులను నాశనం చేయడానికే ఇతడు పన్నాగంతో నిన్ను మూడు అడుగులు అడుగుతున్నాడు. కనుక నీవు ఇతనికి దానం చేయకుము ’2అని ఆవేశంతో బాధతో చెప్పాడు. కాని బలి చక్రవర్తిని చిరునవ్వు వీడలేదు.
అపుడు ఇంకా శుక్రాచార్యుడీవిధంగా చెప్పాడు.‘ ఓ బలి చక్రవర్తీ ఈ బడుగు బాపడు నిజమైన వాడు కాదు. ఆయన అడిగిన మూడు అడుగుల నేల తోనే విశ్వాన్నంతా ఆక్రమించగల ధీశాలి. అపుడు నీవు ఎక్కడకు వెళ్తావు. అయినా తన్ను మించిన న్యాయం మంచిది కాదు. ఎవరైనా సరే సంపాదించిన సంపదను కామం, అర్ధం, ధర్మం, కీర్తి, దానం అనే ఐదు విధాలుగా వినియోగించుకోవాలి. ’...
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804