డైలీ సీరియల్

కూడా వచ్చేది కర్మ సంచయమే ( వామనుడు - 7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి చేతిలో చిప్ప పట్టుకోగూడదు. ఉన్నదానిలోనే తాను తింటూ ఆ తరువాత యజ్ఞాల గురించి, దానాల గురించి ఆలోచించి చేయాలి. అడిగిన వానికంతా ఇవ్వకూడదు. అర్హత ఎరిగి దానం చేయాలి సచ్చరితా! ఎపుడైతే చేసిన దానం వల్ల సర్వమూ నష్టమవుతుందో ఆ దానాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తానని మాట ఇచ్చినా అసలుకు నష్టం వస్తోంది కనుక దానిని కూడా ఇవ్వకూడదు. ఒక చెట్టు బాగుంటేనే కదా పూలు పండ్లు ఇవ్వగలుగుతుంది. చెట్టు వేర్లు తీసుకొంటే ఆ చెట్లు పూలను పండ్లను ఇవ్వగలదా? అందుకే మాట ఇచ్చినా కూడా దానం చేయనక్కర్లేదు. దీని వల్ల నీకు అసత్యదోషం ఏమీ రాదు. అంతేకాదు అసురేంద్రా! పెండ్లిండ్లల్లోను, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేట్టు అయితే అంతేకాదు మాన ప్రాణ రక్షణ కోసం ఆడవారి విషయంలోను, గోవులను, బ్రాహ్మణులను రక్షించేవిషయంలోను అబద్దం ఆడితే తప్పు కాదు. కనుక నీవు ఇతని విషయంలో ఆలోచించక దానం ఇవ్వనని చెప్పేయుము. లేకపోతే అసలుకే నష్టంవస్తుంది అని పలువిధాలుగా శుక్రాచార్యులు బలిచక్రవర్తికి చెప్పారు. అయినా కాస్త కూడా ముఖకవళికల్లో మార్పు లేకపోయేసరికి 3‘ఓ మాన్య శిరోమణీ!నీకులాన్ని,రాజ్యాన్ని, పరాక్రమాన్ని నీవుచేజేతులారా పోగొట్టుకోకు. ఈ పొట్టివాడు గట్టివాడు సుమా! ఇతడు మూడు అడుగులతోనే విశ్వాన్నంతా ఆక్రమించుకుంటాడు. నా మాటలు ఆలకించు. దానం వద్దు గీనం వద్దు. ఇతడిని త్వరగా పంపించేయి. వీని వల్ల అనేక ఆటంకాలు కలుగుతాయి’ అని మరలా మరలా శుక్రాచార్యులుచెప్పారు.
ఓ క్షణం కనులు మూసుకొని బాగా ఆలోచించాడు. 33‘‘మహాత్మా! మీరు చెప్పింది నిజమే. ఇతనుమూడు అడుగులతోనే విశ్వానే్నకాదు అంతటినీ ఆక్రమించవచ్చుగాక! ఈ భూదేవి ఎటువంటి తప్పిదము చేసినవాడినైనా మోస్తాను కానీ ఆడిన మాట తప్పిన వానిని మోయలేను అని మొరపెట్టుకుంటుంది కదా. అయినా ఇతఃపూర్వం ఎందరూరాజులు ఈ భూమండలాన్ని ఏలారు కదా. వారంతా ఏమి మూటకట్టుకొని పోయారు. కాల మహిమ ఒకనాడు ఒకరు గొప్పగా ఉంటే మరోరోజు మరొకరు గొప్పగా ఉంటారు. అంతేకానీ ఎవరూ ఎప్పటికీ గొప్పవారిగానే ఎక్కడ ఉంటున్నారు. అంతేకాదు విప్రోత్తమా! ఎన్నో యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మకార్యాలుచేసినా అగుపించని మహావిష్ణువు నేడు నా చెంత తనకై తాను నిల్చున్నాడు. ఈ సంపదనంతా ఇట్లానే నేను దాచినా దాగుతుందా పోయేనాటికి ఎవరికీ చెప్పకుండానే పోతుందికదా. మనచేతుల్లో ఏముంది? అయినా విశ్వానే్న నడిపించగల ధీశక్తి సంపన్నుడు నా ముందు చేయి చాచి అడుగుతున్నాడు. ఈ చెయ్యి ఎంత గొప్పది? ఏది శాశ్వతం కానీ వాటిని నేను దాచుకొని కూడా ఏమి చెయ్యగలను ? ఒకవేళ నేను చేసిన దానం వల్ల నాకు నరకం ప్రాప్తించినా, బంధనం ప్రాప్తమైనా, భూమండం అదృశ్యమైనా, దుర్మరణం వచ్చినా కులానికి చేటు కల్గినా, ఆడిన మాట తప్పను. నా నాలుక మారు మాట మాట్లాడదు. ఇదియే నా వ్రతం. ఈ అడిగెడు వాడు శివుడో, విష్ణువో, లేక బ్రహ్మదేవుడో లేక పరమాత్మనో ఎవరైతే నేమి నాముందు నిలిచి నన్ను అడుగుతున్నాడు. నాకై నేను అడుగు అనీ మరీ బలవంతం కూడా పెట్టాను. తీరా అడిగే సరికి నేను కాదు పొమ్మని ఎలా అనగలను? నేను ఆడిన మాట ఎన్నటికీ తప్పను గాక తప్పను. సముద్రాలు ఇంకిపోయినా, మేరు పర్వతం తలకిందులు అయినా, భూమండలం లోలోపల పాడియై పోయినా, మిన్ను విరిగి మీద పడినా సరే నేను మాత్రం ఇతనికి అడిగిన దానం ఇచ్చి తీరుతాను. మీ మాట వినలేదని కోపం తెచ్చుకోకండీ. పాపం ఈ పొట్టివానికి అన్నదమ్ములు లేరట. పైగా బ్రహ్మచారీ కూడా నేను ఇస్తానన్నా ఏ సంపదలు కోరలేదు. మితిలేని కోరికలు కలవాడు కాదు ఇతను. కనుక నేను దానం ఇవ్వాలనే కోరుకుంటున్నాను.’’ అంటూ అక్కడే ఉన్న తన ఇల్లాలు వింధ్యావళికి కనుసైగ చేశాడు.
ఈ చర్యతో శుక్రాచార్యునకు కోపం ఆగలేదు. కోపోదేక్రంతో శుక్రాచార్యుడు మండి పడడం చూసి కూడా దానం ఇవ్వడంలో కాస్త కూడా చలించని బలిని చూసేసరికి మరింత ఆగ్రహం శుక్రాచార్యునిలో పొంగి పొరలింది. అంతే 3‘‘ఓ బలి చక్రవర్తీ! నీవు నా మాట మీరుతున్నావు. నాత్వరలో పదభ్రష్టుడివై పోతావు’’2 అని శపించాడు. అప్పుడు కూడా వీసమంత చలించని బలి వింధ్యావళికై చూశాడు. ఆ మె భర్త మాట బిగువును చూసింది. ఆయన మనసును అర్ధం చేసుకొంది. బంగారు కలశంతో నీరు తెచ్చింది.
‘‘3ఓ వామనా! బ్రహ్మచారీ ఇటు రావయ్య. వచ్చి ఈ ఆసనం పై కూర్చో. నీకు నీవుఅడిగిన నేలను దానం ఇస్తాను2అని బ్రహ్మచారి ని పిలిచాడు’’ బలి చక్రవర్తి. ఆ పిలుపు విని వామనుడు బలి మహారాజు చూపిన ఆసనంలో కూర్చున్నాడు. ఆయన వింధ్యావళి తెచ్చిన బంగారుకలశంలో నీరు పోస్తూ ఉండగా బలిచక్రవర్తి వామనుని పాదాలు చేతులతో రుద్ది కడిగాడు. ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804