డైలీ సీరియల్

తత్వం తెలిస్తే...అంతా తెలిసినట్లే( వామనుడు - 8)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాత 34 ‘‘బ్రాహ్మణుడవూ ప్రసిద్దమైన వ్రతం కలిగిన వాడవూ విష్ణు స్వరూపుడవూ అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను’’ 12అని అంటూ ‘‘ఈ చర్య పరమాత్మునకు ప్రీతి కలిగించుగాక3’’ 2అన్నాడు.
బలి చక్రవర్తి దృఢ నిశ్చయానికి లోకం అంతా ఆశ్చర్యానందాలకు గురైంది. దేవతలంతా దిగ్భ్రమ చెందారు. ఎంతైనా బలిని మెచ్చుకొనవలసిందే అనుకొన్నారు.
దానం గ్రహిస్తున్న వామనుడు చల్లని చిరునవ్వు నవీ4బలి ‘‘మహారాజా! దానం ఇచ్చేవారు, తీసుకొన్నవారు కూడా చల్లగా వేయేండ్లు స్వర్గలోకంలో విహరిస్తారు. వారిద్దరి కీర్తి అజరామరంగా ఉంటుంది. భూమి దానం చేయడం వల్ల నీకు అనంతమైన కీర్తి లభిస్తుంది. నీవిచ్చిన ఈ మూడు అడుగుల నేల నాకు ముల్లోకాలతో సమానం అవుతుంది’’2 అన్నాడు.
దానం తీసుకొన్న వామనుడు అప్పటికప్పుడు ఇంతింతగా పెరిగి పెరిగి ఆకాశాన్నంతా ఆక్రమించాడు. విశ్వరూపాన్ని ధరించాడు. ఒక్క అడుగుతో భూలోకాన్ని ఆక్రమించివేసాడు. మరో అడుగుతో స్వర్గలోకాన్నీ ఇంకొక అడుగతో పైలోకాలన్నింటినీ కప్పివేశాడు. ఇంకా వామనుడు సాగుతూనే ఉన్నాడు. ఆ మహారూపానికి బ్రహ్మాండభాండం పెటపెటలాడి బ్రద్ధలైపోసాగింది. ఆ విశ్వరూపుడు తప్ప మరెవరూ ఎవరికీ కనిపించకుండా పోయారు. అన్ని లోకాలనూ దాటిపోతున్న ఆ దివ్యరూపపు పాదాల వేళ్లగోర్లకాంతి సత్యలోకంలోని బ్రహ్మతేజస్సు సూర్యుని ముందు దివిటి వలె వెలవెల పోయింది. బ్రహ్మలోకంలో నివసిస్తున్న మరీచి, సనందుడు లాంటి యోగీంద్రులందరూ ఆ విశ్వరూపుని పాదాలను చూసి భక్తి తన్మయత్వంతో మొక్కారు. బ్రహ్మదేవుడు ఆ విశ్వరూపుని నాభిస్థానాన్ని గుర్తించి ఇదిగో ఇదే నా జనన స్థానం అనుకొని తెప్పరిల్లి తన కమండలంలోని నీటితో బ్రహ్మపాదాలను కడిగాడు.బ్రహ్మాదులంతా మహావిష్ణువు విశ్వరూపాన్ని పూర్తిగా దర్శించలేకపోయారు. కానీ చేతులెత్తి అందరూ నమస్కరించారు. ఎవరూ వామనుని పూర్తి రూపాన్ని చూడలేక పోయా రు. ఇక బలి చక్రవర్తి యాగమండపంలో ఉన్నవారు ఆశ్చర్యానందాలకు లోనై తమకు కనిపిస్తున్నంత మేర భగవంతుని తనవితీరా చూస్తూ శరీరంలో పులకాంకురాలు మొలకెత్తుతుండగా చేతులెత్తి మొక్కారు.
మెల్లమెల్లగా తిరిగి వామనుడు తన పూర్వరూపాన్ని పొందాడు. అపుడు అక్కడున్న రాక్షసులు ‘‘చూశారా! ఇది అంతా ఆవిష్ణు మాయ అందుకే ఈ పొట్టివానిని కదలనివ్వకుండా చేయాలి’’ అంటూ పరుగెత్తారు. మరికొంతమంది ‘‘ఇతడిని చంపివేయాలి సుమా’’ అంటూ తమకు దగ్గరున్న ఆయుధాలను తీసుకొని పరుగెత్తారు. అట్లా రాక్షసులు రావడం వామనుడు చూసి శుక్రాచార్యుని శాపం గుర్తుకు తెచ్చుకున్నాడు. అంతలో విష్ణుసేవకులైన సునందుడూ, నందుడూ జయడు జయంతుడూ ప్రబలుడూ ఉద్బలుడూ గరుడుడూ పుష్పదంతుడూ మొదలైనవారంతా పరుగెత్తుకున వచ్చారు.
వారినంతా చూసిన బలి చక్రవర్తి ముందుకు వచ్చి 3‘‘4ఓ రాక్షస్తోత్తములారా! కాస్త ఆగండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఇంతకుముందు మనం దేవతలపైన యుద్ధం చేశాం. వారిని అడవుల బాట పట్టించాం. అపుడు కాలం మనకు అనుకూలంగా ఉంది అనుకొన్నాం. కానీ కాలాన్ని అదుపు చేసే భగవంతుడు ఇపుడు మనకు అనుకూలంగా లేడు. ఇది యుద్ధం చేసే సమయం కాదు. ఇపుడు యుద్ధం చేస్తే సంపద దేవతల పాలు అవుతుంది. నిదానించండి . ఈ విష్ణు సేవకులతో పోరాడకండి. బతికి ఉంటేబలుసాకు తినవచ్చు. నందో రాజ భవిష్యత్తి కాలం కలసి వస్తే మనమే మరలా రాజులం కావచ్చు. కనుక మీరంతా చేతనంత పరుగెత్తి వెళ్లండి. దూరంగా పారిపొండి. రసాతలానికి వెళ్లిపొండి’’ 22 అన్నాడు.
అంతలో గరుడుడు వచ్చి బలిచక్రవర్తిని యాగ శాలలోనే బంధించివేశాడు. రాక్షసులంతా రసాతలానికి పారిపోయారు. బలి ఒక్కడే బంధీగా నిల్చున్నాడు. ఐనా బలి చక్రవర్తిలో దీనత్వము కలుగలేదు. తెగువ జ్ఞాన దీప్తి కానవచ్చింది. దాన్ని చూసి వామనుడు ఇలా అన్నాడు.
3‘‘ఓ దానవేంద్రా! మూడడుగుల నేల ఇస్తానంటివి. భూలోకమూ ఇంద్ర సూర్యుల దాకా ఉండే స్థలమూ నాకు ఒక అడుగైంది. స్వర్గలోకం ఒక అడుగైంది. నీ సంపద అంతా నాకు రెండడుగులైనది. ఇక మూడవ అడుగు ఎక్కడుంది? ఇక నీవు ఇస్తానని ఇవ్వలేకపోతున్నావు కనుక నీకు నరక ప్రాప్తి కలుగుతుంది’’ 2అన్నాడు. అపుడు బలి చక్రవర్తి తొట్రుపడ్డాడు. వెంటనే కదిలిక కలిగి 3‘‘ఓ మహానుభావా! నా రసన ఎప్పుడూ సత్యమే పలుకుతుంది. దానికి తిరుగులేదు. అసత్యం పలుకదు. నాలో అసత్యం లేదు. నీ మూడవ పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టుము ’’ 12అన్నాడు.
‘‘ఆనంద స్వరూపా! ఇక నాకు అంతా తెలిసింది. పూర్వం మావాళ్లు అంతా నీతో శత్రుత్వం పొందితేకానీ వారికి నీవు దర్శనం ఇవ్వలేదు. అజన్మాంతమూ నిన్ను శరణు కోరితే వారికి మాత్రమే నీవు దర్శనం ఇస్తుంటావు. కానీ నేడు నీవే నా దగ్గరకు వచ్చి దేహి అని అడిగావు. ఇదంతా నా పూర్వజన్మ పుణ్యమే కదా.’’ ...

- డా. రాయసం లక్ష్మి. 9703344804