డైలీ సీరియల్

తత్త్వం తెలిస్తే.. తెలిసినట్లే! (వామనుడు - 9)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను శత్రుత్వంపొందకుండానే నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని పొందాను.
అంతలో అక్కడికి పరమ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు వచ్చాడు. తాతను చూసిన వెంటనే బలి కన్నుల్లో కన్నీరు తిరిగింది. తన చేతులు కట్టివేసినందువల్ల అతడు మనసులోనే శిరసా ప్రణామాలు ప్రహ్లాదునికి అర్పించాడు. సనకసనందాదుల మధ్య ఉన్న వామనుడిని ప్రహ్లాదుడు చూశాడు. ఆహా ఎంతటి భాగ్యమబ్బింది అంటూ వామనుని పాదాలకు నమస్కరించాడు. 3స్వామీ నీవు ఈ బలిచక్రవర్తికి మొట్టమొదట ఇంద్ర పదవి ఇచ్చావు. నేడు దాన్ని తొలగించావు. పదవి అనేది అజ్ఞానానికి అహంకారానికి మూలమైంది. నిన్ను తెలుసుకొన్నవారికి ఏ ఇంద్రపదవి పైనా ఆశకలుగదు. 1అని అటుండగానే అక్కడికి బలిచక్రవర్తి భార్య వింధ్యావళి వచ్చింది. ఆమె కనులనిండా కన్నీరు ఉబికి వస్తోంది. ఆ కన్నీరును తుడుచుకుంటూ వామనుని దగ్గరకు వచ్చి 3ఓ లక్ష్మీపతీ ! నా పతిదేవులు నిన్ను లేదు, కాదు పొమ్మనలేదుకదా. నీవు అడిగినంత దానం అందరూ వద్దన్నా గురువే వద్దన్నప్పటికీ కూడా నీకు దానమిచ్చాడు కదా. మరి నేడు ఆయన్ను ఎందుకు బంధించావు.
అక్కడికే బ్రహ్మదేవుడు వచ్చాడు. వామనుని చూసి2స్వామీ జగన్నాథా. అన్నిప్రాణులను కాపాడేవాడవు నీవేకదా. ఈ బలిచక్రవర్తి గొప్ప దాత. ఇతడు శిక్షించదగినవాడుకాదుకదా. ఆయనకున్నదంతా నీపరం చేసేశాడు. ఇతడు నీపాదాలను అర్చించిన మహాభక్తుడు. నీవుఎవరివో తెలుసుకొని కూడా దానం ఇచ్చాడు. కనుక అతని భయం పోగొట్టి నీవే బలిని రక్షించుము2అన్నాడు.
అపుడు వామనరూపంలో ఉన్న పరమాత్మ ఇలా అన్నాడు4ఎవనిపైన నేను దయచూపాలనుకొంటానో వాని సంపదనంతానేను ముందే అపహరించివేస్తాను. ఎవరైతే ఆ ధనానికి గానీ, ఐశ్వర్యానికి కానీ విద్యకు గానీ గర్వాన్ని పొందకుండా అచంచలమైన భక్తిని కలిగి ఉంటాడో వానిని నేను ఎంతోప్రీతి పూర్వకంగా కాపాడుతాను. నాకు ఈ బలిచక్రవర్తి గురించి తెలుసు. ఇతడు సత్యవాది. ఇతనికి మేలు చేయక ఎవరికి చేస్తాను. సావర్ణిమనువుకాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. అంతవరకూ సుతల లోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పెంపొందుతాడు. సుతల లోకాన్ని అత్యంత సుందరంగా పవిత్రంగాబలిచక్రవర్తికోసం విశ్వకర్మ నిర్మించాడు. అక్కడే ఇతడు ఇకపై నివసిస్తాడు.
3ఓ బలిమహారాజా! నీదానం ఎన్నటికీ వృథా కాదు. నీ త్యాగం శ్రేష్టమైంది. సుతల లోకంలో దేవతలు నివసించడానికి కూడా ఇష్టపడుతారు. ఆ లోకంలో దుర్మరణాలు, రోగాబాధాకీడు ల్లాంటి ఏ దుశ్శకునాలు ఉండవు. నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఈలోకంలో నీపై దిక్పాలురకు అధికారం ఉండదు. నేనే నినె్నప్పుడూ రక్షిస్తూ ఉంటాను. నీవెప్పుడు నన్ను తలుచుకున్నా నీకు నా దర్శనం లభ్యమవుతుంది. నీకు సదా సంతోషంతోనే ఉంటావు2 అని భగవంతుడు చెప్పాడు.
బలిచక్రవర్తికి పరమానందం వేసింది. 3ఓ మహానుభావా! ఇంతకంటే నాకు కావల్సింది ఏముంది. నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరను. నీవే నన్ను సంరక్షిస్తూ ఉంటే ఇక నాకు ఏ ఆపద వాటిల్లదు. నీవు చెప్పినట్లుగానే నేను సుతలలోకానికి నాపరివారంతో వెళ్తాను2అన్నాడు.
బలి చక్రవర్తి బంధనాలు తెగిపోయాయి. ప్రహ్లాదుడు కూడా వామనునికి నమస్కరించగా వామనుడు 3ప్రహ్లాదా! నీవు కూడా ఆ సుతల లోకానికి వెళ్లి అక్కడే నివసించుము. నేను ఎల్లపుడూ గదాధారినై మిమ్ము కాపాడుతూ ఉంటాను. మీకే ఆపద వాటిల్లదు. సమయం ఆసన్నమైనపుడు నేను బలిని పిలిచి ఇంద్రపదవినిస్తాను2అన్నాడు. ప్రహ్లాదుడు కూడా సంతోషంతో వామనునికి నమస్కరించాడు బలితో బయలుదేరి రాక్షసులంతా సుతల లోకానికి వెళ్లారు.
అక్కడే ఇదంతా చూస్తున్న శుక్రాచార్యునితో వామనుడు 3శుక్రాచార్య! ఈ ఆగిపోయిన బలి యజ్ఞాన్ని నీవు పూర్తిచేయుము. బ్రాహ్మణులకు, రాక్షసులకు మంచి కాలం రావాలని వారిని ఆశీర్వదించుము. 1అని చెప్పాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804