డైలీ సీరియల్

విలువల లోగిలి-70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళకెదురుగా కొడుకుల దుర్మార్గం కళ్ళకు కట్టినట్లు కనబడటంతో అందరూ వారిని ‘్ఛ’కొట్టడం ప్రారంభించారు.
వాళ్ళలో మార్పు రావాల్సింది పోయి నిజంగా ఆ గంగలో ముంచేసినా బాగుండేది. వదిలేసి వచ్చి తప్పు చేశామని కృంగిపోయారు. ఈనాటి కలియుగం కొడుకుల అంతరంగాలు మరి ఇలా కాక ఎలా ఉంటాయి?
ఇంకా బుద్ధిరాని ఆ కొడుకులను చూసి అందరూ ఔరా! అని ముక్కున వేలేసుకున్నారు.
అందరూ ముసుగు వీరులే అయినా బండారం బయటపడలేదు కాబట్టి అందరూ నిజాయితీపరులే.
వాళ్ళను సిగ్గులేనివాళ్ళుగా చిత్రీకరించటం మొదలుపెట్టారు.
కన్నడల్లిని అనాధాశ్రమానికి పంపేసి ఇక్కడ నువ్వు భార్యతో కులుకుతున్నావా అని ఒకడడిగితే, ఏం జన్మ? నిన్ను పెంచింది మీ అమ్మ కానీ మీ ఆవిడ కాదే. ఆవిడ కొంగు పట్టుకొని తిరుగుతూ తల్లిని కాదంటావా అని మరొకడు, నువ్వు కాబట్టి బ్రతికున్నావ్, నేనయితే ఈ విషయం తెలియగానే ఆత్మహత్య చేసుకొనేవాడ్ని అని ఇంకొకడు.
ఇలా ఇంకొన్నాళ్ళు వీళ్ళందరి మాటలు వింటే మెంటల్ హాస్పిటల్‌లో చేరాల్సిందే అనుకొని వాళ్ళు బుద్ధిమంతుల్లా విశ్వ దగ్గరకు వాళ్ళ అమ్మను తీసుకువెళ్ళటానికి వచ్చామన్నారు.
‘‘బామ్మను మీరు జాగ్రత్తగా చూసుకుంటారని గ్యారంటీ ఏమిటి?’’ అని సూటిగా ప్రశ్నించింది.
‘‘మా అమ్మ కదా!’’
‘‘ఆ అమ్మనే కదా దయాదాక్షిణ్యాలు లేకుండా, ఒక్కటే ఎలా బ్రతుకుతుందో అనే ఆలోచన కూడా లేకుండా వదిలేసి వచ్చింది’’.
‘‘మా తప్పు మేము తెలుసుకొని వచ్చాం. మాతో పంపండి’’
‘‘నాకూ అనపించటంలేదు. బయటివారి మాటలు పడలేక వచ్చినట్లనిపిస్తంది. మీ ముఖాల్లో పశ్చాత్తాపమే లేదు’’.
అప్పుడే అక్కడకు వచ్చిన బామ్మ ‘‘విశ్వా! వీళ్ళు నన్ను తీసుకువెళ్లి చంపేసి నిద్రలో పోయిందని కూడా చెబుతారేమో! నన్ను పంపకమ్మా! నేను నీ దగ్గరే ఉంటాను’’.
కన్నతల్లే తమని నమ్మనని చెబుతూ ఉండటంతో అప్పుడు కొడుకులకు బుద్ధి వచ్చింది.
ఎందుకీ జన్మ అని వారికే అనిపించింది.
‘‘అమ్మా!’’ అంటూ నలుగురూ ఒకేసారి వెళ్లి ఆమె కాళ్ళమీద పడ్డారు. ‘మమ్మల్ని క్షమించాను’ అని చెప్పేవరకూ నీ కాళ్ళు వదలం అన్నారు.
‘‘సర్లే.. లేవండి.. క్షమించాను’’ అన్నాకే వాళ్ళు లేవటం జరిగింది. అప్పుడు వాళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కనిపించింది.
బామ్మ వెళతాననటంతో అప్పుడు విశ్వ అంగీకరించింది బామ్మను వారితో పంపటానికి.
‘‘బామ్మా! మా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆశ్రీతురాలుగాక కాక ఆత్మీయురాలిగా అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’’ అంటూ వీడ్కోలు పలికింది విశ్వ.
అందరికీ వెళ్ళొస్తాననిచెప్పి బామ్మ వారితో వెళ్లిపోయింది.
అన్నాళ్ళూ తమతో కలిసిపోయి ఉన్న బామ్మ అలా వెళ్లిపోతుంటే విశ్వ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘‘అవి నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు’’ అంది అంతరంగం.
చైతూ ఆ ఇల్లంతా తనదే అన్నట్లు తిరుగుతున్నాడు. అనన్య, వాడూ ప్రస్తుతం ఒకే రూములో ఉంటున్నారు. అనన్య ఎప్పటికప్పుడు తల్లి, చెల్లి ద్వారా విషయాలు తెలుసుకుంటూనే ఉంది. పిల్లలు కూడా వాళ్ళ నాన్నకు తెలియకుండా ఆయన సెల్‌లోంచే మాట్లాడి డిలీట్ చేసేస్తున్నారు.
ఇప్పటికే అతను విసిగి వేసారిపోయాడని సారాంశం.
రేపో మాపో ఇక్కడ వచ్చి వాలిపోతాడని అనుకుంటున్నారు అందరూ. అనన్యకి మాత్రం ఎంతో హాయిగా ఉంది. విశ్వతోపాటూ కూడా తిరుగుతూ ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటోంది.
మిగిలినవాళ్ళంతా క్రొత్తవారే.
ఎవరికిష్టమొచ్చిన గదుల్లో వారిని ఉండమంది.
వారికి తోచిన పిలుపులతో పలకరించుకోమంది.
వాళ్ళకు ఒకటే సూచన చేసింది. ‘‘మీరు ఒకళ్ళతో ఒకళ్ళు ఎవ్వరూ గొడవపటానికి వీల్లేదు. ఎంత ప్రేమగా అన్నా ఉండండి. నేను కాదనను. తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం ఇక్కడ నేను ఉండనివ్వను’’ అని ఖచ్చితంగా చెప్పెయ్యటంతో వాళ్ళల్లో వున్న చెడును లోలోపలే కుదించేసుకోవటం ప్రారంభించారు. లేకుంటే బయట లోకానికి అక్కడ లోకానికి తేడా ఏముంటుంది?
బాబాయ్, పిన్నీ, అత్తయ్యా, మామయ్యా, అక్కా, ఆన్నా, వదినా, అమ్మా, చెల్లీ, నాన్నా పిలుపులతో విశ్వసౌధం పులకరించిపోతోంది.
ఎక్కడెక్కడనుంచో ఆశ్రయం కోసం అక్కడికి తరలి వస్తున్నారు.
డబ్బిచ్చి ఉంటామన్న వారిని మాత్రం తిరస్కరిస్తోంది విశ్వ.
తమ పిల్లలు విదేశాల్లో ఉండి తమను ఇక్కడ ఎవరూ చూసుకొనే వారు లేరన్నవారినీ అక్కున చేర్చుకుంది. పాపం ముసలివారు.. ఆ వయసులో వారు ఏ పనీ చేసుకోలేరు. తినే ముద్ద కూడా తక్కువే. అది ఆప్యాయంగా అందితే అదొక అందం. అరవై దాటాక అలిసిన వారి శరీరాలకు విశ్రాంతి ఇవ్వాల్సిందే. వారికై వారు మేము చేస్తాం అని చేస్తే తప్ప వారిని ఇబ్బంది పెట్టకూడదు అంటుంది. అదే అక్కడ అందరూ పాటించేట్లు కూడా చూస్తోంది.
ఓరోజు ‘‘అక్కా!’’ అంటూ ఏడ్చుకుంటూ వచ్చిందో యువతి.
‘‘ఏంటమ్మా!’’ అంటే-
తోటి విద్యార్థే ప్రేమ పేరు చెప్పి మోసగించాడని.
‘‘ఎదుటివాళ్ళు ఏం చెబితే అది నమ్మేయటమేనా? అందులో ఎంత నిజం వుందో పరీశీలించుకోరా?’’
‘‘మనం అన్నిటికన్నా శీలానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అలాంటిది పెళ్లి కాకుండా ఎందుకు మీరిలా మగాళ్ళ మాటలు విని వారికి లొంగిపోతున్నారో నాకర్థం కాదు’’ అంది ఆవేశంగా.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206