డైలీ సీరియల్

పరశురాముడు - 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋచీకుడు మహాతప్సంపన్నుడు. ఆయన ఒకసారి వివాహం చేసకుందామనుకొన్నాడు.గాధి మహారాజు దగ్గరకు వచ్చాడు. అతనికి సత్యవతి అను కూతురుంది. ఆ సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని గాధిని ఋచీకుడు అడిగాడు. గాధికి ఋచీకునికి తన కూతురినివ్వడం ఇష్టం లేకపోయింది. బాగా ఆలోచించి శరీరమంతా తెలుపు వర్ణమూ ఒక చెవి మాత్రం నీలవర్ణము గల అశ్వాలు వేయి కన్యాశుల్కంగా ఇస్తే సత్యవతితో వివాహం చేస్తానని గాధి ఋచీకునకు చెప్పాడు.
గాధి మాటలకు సరే అని చెప్పి వెళ్లి తన తపశ్శక్తితో వరుణుడిని గాధి కోరిన అశ్వాలను ఇవ్వమని కోరుకున్నాడు. వరుణుడు కన్యాకుబ్జ సమీపంలో ఈ అశ్వాలు ఉన్నాయని వరుణుడు చెప్తే అక్కడికి వెళ్లి ఋచీకుడు అశ్వాలను తీసుకొని వచ్చి గాధికి ఇచ్చాడు. అపుడు ఋచీకుని శక్తి తెలుసుకొని గాధి సంతోషంతో తన కూతురినిచ్చి వివాహం చేశాడు.
ఋచీకుడు సత్యవతి అన్యోన్యానురాగాలతో కాలం గడుపుతున్నారు. తన భర్త తపశ్శక్తి తెలుసుకొన్న సత్యవతి ఒక వరాన్ని కోరుకోవాలనుకొంది. తనకు తన తల్లికి కూడా పుత్ర సంతానం కలిగేలా వరం ఇవ్వమని తన భర్తను కోరుకుంది. ఋచీకుడు ఆమె కోరిక నెరవేరేలా వరం ఇచ్చాడు. ఆ తరువాత సత్యవతిని మేడిచెట్టును, ఆమె తల్లిని రావి చెట్టును పూజించమని చెప్పాడు. ఆతరువాత వారిద్దరికీ చెరొక మంత్రపూరిత జలాన్నిచ్చి వాటిని సేవించమని చెప్పాడు. సత్యవతి తన భర్త చెప్పిన నియమాన్ని మరిచిపోయి తాను రావిచెట్టును, తన తల్లిచేత మేడిచెట్టును పూజ చేయించింది. మంత్రపూరిత జలాన్ని కూడా తారుమారుగా వారు సేవించారు. జరిగిన సంగతి తెలుసుకొన్న ఋచీకుడునీకు బ్రాహ్మణ వంశంలో పుట్టినా క్షత్రియ బుద్ధి కలవాడు, మీ తల్లికి క్షత్రియుడై ఉన్నా బ్రాహ్మణ బుద్ధి కలవాడుగా ఉండే కుమారులు పుడతారు అని చెప్పాడు.
సత్యవతి తమ తప్పును క్షమించమని తెలియక చేశామని వేడుకుంది. తన పుత్రుడికి కాక మనమడికి ఈ మార్పు జరగేలా చేయమని ఋచీకుని ప్రార్థించింది. ఋచీకుడు ఆమె కోరికను మన్నించాడు. అలా పుట్టినవాడే జమదగ్ని.
జమదగ్ని భార్య రేణుకాదేవి. జమదగ్ని చాలాకాలం తపోదీక్షలో ఉండేవాడు. రేణుకాదేవి ఆయనకు సపర్యలు చేస్తూ ఉండేది. వారికి రమణ్వతుడు, సుషేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు అనే కుమారులు కలిగారు. వీరిలో పరశురాముడు తన తాతయైన ఓర్వుని ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉండి తిరిగి తన జమదగ్ని పితామహుడు అయిన భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. పరశురాముని తేజస్సు భృగు మహర్షి శిష్యులు చూడలేకపోయారు. భృగుమహర్షి తన మనుమడిని ఆదరించి మనకు, లోకులకు హితమైన ఓ కార్యాన్ని చెప్తాను. దానిని నీవు చేయుము అని పరశురామునితో చెప్పాడు. భృగుమహర్షి దానిని చెప్పుము దానిని తప్పక చేస్తానని పరశురాముడు అడిగాడు. భృగుమహర్షి పరశురాముని హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేయమని ప్రోత్సహించాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804