డైలీ సీరియల్

విలువల లోగిలి-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా తప్పేం లేదక్కా. మంచినీళ్ళలో మత్తుమందు కలిపిచ్చాడు’’.
‘‘ఎక్కడ?’’
‘‘అతని గదిలోనే’
‘‘మరి అతని గదికి ఎందుకు వెళ్ళావ్? అది తప్పు కాదా? పెళ్లి తర్వాత ఎంత జీవితం ఉంది? ముందే ఈ డేటింగులు అవసరమా?’’
‘‘అతని సంగతులు తెలుసుకోవాలి’’.
‘‘అందులో తప్పులేదు. జీవిత సహచరుడు ఎలాంటివాడో తెలుసుకోవటం చాలా ముఖ్యమే. కానీ దానికోసం ఆపదను కొనితెచ్చుకొని నువ్వు వెళ్ళక్కర్లేదు. మీ నాన్ననో, మీ అన్ననో పంపవచ్చు అతనెలాంటివాడో తెలుసుకోవటానికి’’’.
‘‘ఇంట్లో వాళ్ళకి చెబితే కాలేజీ మాన్పించేస్తారని’’
‘‘మరి ఇప్పుడు బాగుందా? ఇంట్లోంచే పంపించేసారుగా’’
‘‘అతను ఆరుగురితో ప్రేమ వ్యవహారం నడుపుతాడని నాకేం తెలుసు?’’
‘‘నీకు ప్రేమ అని చెబితే నమ్మటం ఒకటే తెలుసు. కన్న తల్లిదండ్రులకు
ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం మాత్రం లేదు. ఎందుకని? అతను మంచివాడయితే మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోరు?
ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు. బ్రొటనవ్రేలిని నేలకు గీస్తూ నిలుచుంది.
‘‘అతనితో షాపింగ్‌కి కూడా వెళ్ళావా?’’
‘‘ఆ! వెళ్ళేదాన్ని! నాక్కావలసినవన్నీ అతనే కొనిపెట్టేవాడు. పెళ్ళయ్యాక కూడా అలాగే చూసుకుంటాడని అనుకున్నానక్కా!’’
‘‘అదే నువ్వు చేసిన పొరపాటు. మీరిలా అనుకుంటుంటే వాళ్ళేం అనుకుంటున్నారో తెలుసా? ప్రేమ అంటేనే జేబులు ఖాళీ చేయించటం. దానికోసమే మన వెంబడి పడుతున్నారు ఆడవాళ్ళని. ఆ డబ్బును ఎరగా వేసి నీలాంటివాళ్ళను వాడుకుని వదిలేస్తున్నారు. పేపర్లలో, పత్రికల్లో ఎనె్నన్ని చూస్తున్నాం. టీవీల్లో ఎనె్నన్ని వింటున్నాం. ఇంకా మీరు వాళ్ళను అర్థం చేసుకోరా? ఎందుకింత గుడ్డి నమ్మకం? అన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ అర్థం చేసుకోరా? పోనీ అతనే్న తీసుకువచ్చి నీకిచ్చి చేద్దామంటే వాడో వెధవ అని నువ్వే చెబుతున్నావు. పోనీ జైల్లో పెట్టిద్దామంటే భవిష్యత్తు పాడయిపోతుంది. తల్లిదండ్రులు బాధకు గురవుతారు. అయినా అతన్ని వదిలేదిలేదు.
ఎలాగో అతన్ని తన దగ్గరకు వచ్చేట్లు చేసింది విశ్వ. మరోసారి ఏ ఆడపిల్లనన్నా మోసం చెయ్యాలని, ప్రేమించానని వెంటపడ్డామంటే నినే్న ఆడది కనె్నత్తి చూడకుండా ఉండేట్లు చేసేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి పంపింది.
విశ్వ సంగతి అందరికీ తెలుసు. ఆమె అభిమానులు ఇలాంటివారిని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు.
పోనీలే.. ఇప్పటికైనా నిజం ఏమిటో, భ్రమ ఏమిటో తెలుసుకున్నావ్. ఇక నుంచీ బుద్ధిగా చదువుకో. డేటింగ్‌లు, పబ్బులకు తిరగటం మన సంస్కృతి కాదే. మనది కానిది మనకెందుకు? విదేశీయులంతా మన సంప్రదాయాలను నేర్చుకొని పాటిస్తుంటే మనం అక్కరలేని ఇలాంటి వాటిని అరుపు తెచ్చుకోవడం ఎందుకు? నీలాంటి యువతులు ఈ విషయం ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడే బాగుపడతారు. వెళ్ళు. నీకూ ఏదో ఒకమంచి రోజు రాకపోదు అని పంపించింది, లోపలికి నిట్టూరుస్తూ.
తల్లిదండ్రులే పిల్లల్ని ఇలాంటివాటికి దూరంగా ఉంచాలి. అలాంటివాటిని నిషేధించేవరకూ నిద్రపోకూడదు. ఎవ్వరూ ఆ ఛాయలకి వెళ్ళకపోతే మనం చెప్పకుండానే పబ్బులూ, బార్‌లూ మూసుకుపోవా?
మనం చేయగలిగిన పనిని కూడా మనం చేయకపోతే ఎలా? ఎప్పుడు వస్తుందో వీళ్ళలో మార్పు?
పిల్లలు తమ మాట వినటం లేదని వీళ్ళు, వాళ్ళే తమని పట్టించుకోవటం లేదని వీళ్ళు కొట్టుకోవటంలోనే జీవితం వెళ్లిపోతోంది. మేజర్లు అయ్యాక కూడా ఇలా మాట్లాడడం పిల్లలకు మాత్రం ఏం సబబు? తనకే ప్రభుత్వ అధికాఠం ఇస్తే ఇలాంటివాటినన్నింటినీ నిషేధించడమే మొదటిపనిగా పెట్టుకుంటుంది. రాజకీయాల్లో ఇప్పుడు అంత నీతిమంతులెవరున్నారు? ఎంతసేపూ ఎలా దండుకుందామా అని చూడటమే తప్ప ప్రజలకు ఎలా మంచి చేద్దామా అని ఆలోచించే నాయకుడు ఏడి? అసలీ జనాలను అనాలి. అలాంటివాళ్ళను ఎన్నుకోవచ్చుగా. అక్కడ కూడా ప్రలోభాలే. ఎవడెక్కువ ఇస్తే వాళ్ళకు ఏసేస్తారు ఓటు. మరి డబ్బు అంతా రాబట్టుకునేదాకా వీళ్ళ ముఖం చూడరు. ఎవరు తీసిన గోతిలో వారు పడటం అంటే ఇదే!
మరునాడు పిచ్చోడిలా వన్న ఓ యువకుడ్ని లారీ క్రింద పడ్డాడని ఎవరూ పట్టించుకోవటంలేదని కానిస్టేబుల్స్ తీసుకొచ్చి తనకు అప్పగించారు. బాధితులకు కేరాఫ్ ఫ్లాట్మ్ అయింది విశ్వసౌధం.
అతను కోలుకున్నాక తన కథను చెప్పాడు- పైన కథకు పూర్తి రివల్స్‌లో. అమ్మాయిలే తమను వాడేసుకుని వదిలేస్తున్నారని, వాళ్ళు కట్టుకునే దుస్తులు తమను వెర్రెక్కించి వెంటపడేట్లు చేస్తున్నాయని.
అతన్ని ఒక్కటే అడిగింది. అలాంటి దుస్తులు వేసుకునేది ఏ కొద్దిమందో? మిగతావాళ్ళంతా నీకు కనిపించలేదా? వాళ్ళే కనిపించారా? అని.
తలదించుకున్నాడు వీరుడు.
ఈ ఆడవాళ్ళకూ బుద్ధిలేదు. చక్కగా మన సంస్కృతి తెలుసుకుని లంగా, ఓణీలు వేసుకోండి అంటే పంజాబీలు, మిడ్డీలు, స్లీవ్‌లెస్ బ్లౌజులు వేస్తున్నారు. వీటిని వదిలేస్తే ఇలా మాట్లాడే మగవాళ్లను నోరుమూయించేస్తాంగా!
‘‘సరే! నువ్వు చెప్పినట్లే ఆడవాళ్ళు నిండుగా దుస్తులు ధరించండి అని నేను చెప్తాను. మరి పసిపిల్లలమీద, ముసలివాళ్ళమీద మీ అత్యాచారాలు ఏమిటి? దానికి జవాబు చెప్పు. వాళ్ళు కూడా అసభ్యంగా బట్టలు కట్టుకుంటున్నారా?
విశ్వ సూటి ప్రశ్న బాణంలా తగిలింది అతనికి.
ఆ ప్రశ్న ఒక్క అతనికే కాదు, మగవాళ్ళందరికీ కూడా! అందుకే విలువలతో కూడిన విద్య అవసరమని ‘లోగిలి’కి అంత ప్రాముఖ్యతనిచ్చింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206