డైలీ సీరియల్

విలువల లోగిలి-72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిలు కూడా నిండుగా బట్ట కట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చెబితే మన వంక కూడా అదోలా చూస్తున్నారు, అదేదో అపరాధమన్నట్లు.
అంతెందుకూ, టీవీ షోల్లో జడ్జీలుగా వచ్చినవాళ్ళు ఎంత సభ్యత పాటిస్తున్నారు ఈ బట్టల విషయంలో. యాంకర్లు ఎలా ఉంటున్నారు? ఎదుటివారిని వెర్రెక్కిస్తూ తప్పు చేస్తున్నామని ఆక్షేపించటంలో అర్థంలేదు.
మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం మనందరి కర్తవ్యం. దానికి అందరూ కలిసి పాటుపడాలి. ఒక్కరిలో మార్పువస్తే చాలదు. ప్రతి ఒక్కరూ అలా అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.
ఎవరు వింటారు తన మాటలు?
వౌనంగా నిలబడ్డ అతనిని ‘లోపలికి వెళ్ళు. ఇప్పటినుంచీ బాగా చదువుకో. మంచి ఉద్యోగం సంపాదించుకో. అప్పుడు మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లిచేస్తాను, సరేనా?’’ అంది విశ్వ.
అలాగే అని లోపలికి వెళ్లిపోయాడు.
ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ముడిపెట్టేస్తే సరిపోతుంది అనుకుంది మనసులో.
అయినా లైఫ్‌లో సెటిల్ అవ్వకుండా వీళ్ళందరూ ముందు పెళ్లి గురించి ఆలోచిస్తారెందుకు? ఆలోచనలో పడింది విశ్వ.
అక్కడే గాడి తప్పుతోంది యువతరం.
దీన్ని పట్టాలు ఎక్కించి జీవన ప్రయాణాన్ని సరైన దారిలో నడిపించం విజ్ఞుల పనేగా.
***
నాలుగు రోజుల తర్వాత గోడకు కొట్టిన బంతిలా వచ్చి పడ్డాడు అనన్య భర్త.
‘‘బుద్ధివచ్చింది. ఇంక పెత్తనం అంతా తనకే ఇచ్చేస్తాను. జీతం ఆమె చేతిలో పోసేస్తాను అమ్మ దగ్గిరకెళుతుందో, అత్త దగ్గరకెళుతుందో తన ఇష్టం. తను లేకుండా నేను సంసారం నడపలేను. ఇక నుంచీ ఆమెనూ గౌరవంగా చూసుకుంటాను. నా భార్యను నాతో పంపండి’’ అని దీనంగా వేడుకున్నాడు విశ్వను.
‘‘నాకేమో పనిచేసుకోలేక ఇలా మాట్లాడుతున్నావని అనిపిస్తోంది’’ అంది విశ్వ.
‘‘ఇదివరకయితే మీరు చెప్పింది నిజమే. ఆడవాళ్ళను ఏ కష్టమొచ్చినా పుట్టింటివాళ్ళు ఆదుకోరు.. ఆ ధైర్యంతో వాళ్ళెక్కడికి పోతారులే అనే ధీమాతో అలా మాట్లాడేవాళ్ళం. ఇపుడు అలా కాదు. మాకు విశ్వక్క ఉంది, మాకు విశ్వమ్మ ఉంది అంటున్నారు. మీ అండదండ ఉందని తెలిసాకే మాలో ఈ మార్పు వచ్చింది. మీకెలా కావాలంటే అలా నన్ను పరీక్షించుకోండి’’ అన్నాడు నిర్భయంగా.
అనన్య వంక చూసింది విశ్వ ఏం చేద్దాం అన్నట్లుగా.
‘‘ఆయనతో వెళ్తానక్కా! నన్ను గౌరవించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. తనతో సమానంగా నా మాటకు విలువ ఇస్తే చాలనుకున్నాను. అది ఇపుడు ఈయనలో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అతనితో వెళ్తానంటున్నాను. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎందరో కాపురాలను నిలబెడుతున్నావు. నీకు ఆ దేముడు దీర్ఘాయుష్షు ప్రసాదించాలక్కా’’ అంటూ తన బ్యాగ్ తీసుకుని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్లిపోయింది జంటగా.
విశ్వ మనసంతా తృప్తితో నిండిన బెలూన్‌లా తయారయింది. చందూతో ఈ అనుభూతి పంచుకుంటే కానీ లాభం లేదు అనుకుని అటువైపు అడుగులు వేసింది.
‘‘రండి! రండి! అమ్మగారికి మా మీద ఇంత దయగలిగిందేమిటి?’’ అన్న చందూ ప్రశ్నకు.
‘‘ఏంటి చందూ! అలా అంటావ్? నిన్ను విడిచి ఎక్కడికో వెళ్లిపోయినట్లు?’’
‘‘ఎక్కడికీ వెళ్ళకుండా ఇపుడు ఎలా ఇక్కడికి వచ్చావో చెప్పు ముందు?’’
అసలు నువ్వు లాయర్ అవ్వాల్సింది, సాప్ట్‌వేర్‌లోకి ఎలా అడుగుపెట్టావ్?’’
‘‘సాప్ట్‌గా ఉన్నానని’’ కొంటెగా కన్ను గీటుతూ.
‘‘మాటలకేం తక్కువ లేదు’’
‘‘పోనీ చేతులకు పని కల్పించమంటావా?’’
‘‘వద్దు బాబూ వద్దు. అందుకే నీతో ఏం మాట్లాడాలన్నా నాకు భయం’’
‘‘మరి నేను రాక్షసుడిని కదా!’’
‘‘అవును. నిజం చెప్పావు. ప్రేమ రాక్షసుడివి’’
‘‘మైగాడ్.. ప్రేమలో కూడా రాక్షసులుంటారా?’’
‘‘ఎందుకుండరు? ఏదైనా అతిగా చేస్తే వాళ్ళనే రాక్షసులంటారు’’
‘‘బాబోయ్! విశ్వా! నువ్వు నిర్వచనాలనే మార్చెయ్యకు’’
‘‘ఏదో సరదాకి అన్నానులే’’
‘‘ఏమో! నిజంగానే నన్ను రాక్షసుడన్నావనుకున్నా’’
‘‘కోయ్! కోయ్! కోతలు’’
‘‘చివరకు అదే చెయ్యాల్సి వచ్చేట్లుంది’’
‘‘ఏమన్నావ్?’’
‘‘దేవిగారు కరుణించకపోతే పొలమూ, కోతలేగా నా పని అని’’.
‘‘బాబోయ్! ఒక్క క్షణంలో ఎక్కడినుంచీ ఎక్కడికి వెళ్లిపోయావ్? జాబ్ చేస్తున్న మీ ఆఫీసులో వాళ్ళంతా ఏమయిపోతారు? ఆఫీసు ఏమయిపోతుంది నువ్వు లేకపోతే’’
‘‘నువ్వే లేనప్పుడు అవన్నీ ఎవడికి కావాలి? దేవదాసు ఎక్కడ ఉంటాడు. దూరంగా.. పొలాలలో.. ఏ ఎండు చెట్టునో వెతుక్కుని, ఎక్కడో ఒక చోట ఓ కుక్కని పట్టుకుని, ప్రక్కనే పెట్టుకుని, ఓ బాటిల్ పట్టుకుని..’’
‘‘ఇంకా?..’’
‘‘ఇంకేముంది విరహగీతం పాడుకొంటాం’’
‘‘నాకోడౌటు చందూ’’
‘‘ఏమిటో’’
‘‘అబ్బాయిలు విఫలమైతే అలా దేవదాసుల్లా, అమ్మాయిలు ప్రేమలో విఫలమైతే..?’’
‘‘ఏముంది? ప్యాంటూ, చొక్కా వేసుకొని దేవదాసులయిపోవాలి’’
‘‘బాగుంది. బాగుంది. నీ జోక్ బాగుంది’’
‘‘మరి పార్వతి చక్కగా సంసారం చేసుకుందిగా’’

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ