డైలీ సీరియల్

పేర్లు వేరైనా పరతత్వం ఒక్కటే (పరశురాముడు -4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కృష్ణ కవచము అగస్త్యుని ఆశ్రమంలో కదా లభ్యమయ్యేది. ఇక అగస్త్యుని దగ్గరకు ఇతడు వెళ్తాడు. మనమూ పరశురామునితోనే వెళ్దాం అని అవి మాట్లాడుకున్నాయి. ఆ మాటలు విని ఆశ్చర్యంతో పరశురాముడు అగస్త్యాశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఆ అగస్త్యుని వల్ల కృష్ణ కవచము, కృష్ణాష్టోత్తరము విన్నాడు. భార్గవ రామునితో కలసి ఆ జింకలు కూడా కృష్ణాష్టోత్తరాన్ని విన్నాయి.
వాటికి ముక్తి లభించింది. అవి స్వర్గానికి వెళ్లాయి. ఆ తరువాత పరశురామునికి కృష్ణుడు సాక్షాత్కరించి తన తేజాన్ని ఇచ్చాడు. పరశురాముడు పరమశివుని గూర్చి తపస్సు చేసి శివానుగ్రహాన్ని కూడా పొందాడు.
***
తపస్సు తరువాత కార్తవీర్యార్జునుని నగరానికి పరశురాముడు వచ్చి అతనిని యుద్ధానికి పిలిచాడు. కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణులు కోరినది నేను దేనిని నిరాకరించను. నీవు యుద్ధం అడుగుతున్నావు కనుక నేను నీకోరిక నెరవేరుస్తాను. అని యుద్ధ్భేరి మోగించాడు. పరమశివుడు అనుగ్రహించిన పరశువుతో భార్గవరాముడు యుద్ధాన్ని ఆరంభించాడు. ఆ యుద్ధంలో మత్స్యరాజు, మఘ్ధ, నిషాద, విదర్భ, మిథిల, కన్యాకుబ్జ, అవంతి మొదలైన రాజ్యాల నుంచి రాజులు వచ్చి పరశురామునితో యుద్ధం చేసి వారంతా స్వర్గలోకానికి చేరుకొన్నారు. సుచంద్రుడను రాజు పరశురామునితో ద్వంద్వయుద్ధం చేశాడు. అతడు శివుని త్రిశూలాన్ని పరశురామునిపై విసిరాడు. ఆ త్రిశూలము పరశురామునికి కంఠహారంగా మారిపోయింది. అపుడు కాళికా దేవి ప్రసన్నమై సుచంద్రుడిని అగ్నేయాస్త్రంతో సంహరించమని సూచించింది. పరశురాముడు అట్లే చేశాడు. సుచంద్రుడు దివికేగాడు. కార్తవీర్యార్జునుడిని కూడా పరశురాముడు యుద్ధంలో జయించి అతడిని యమసదనానికి పంపించివేశాడు. కార్తవీర్యుని పుత్రులు కూడా పరశురాముని చేతిలో సంహరించబడ్డారు.
తండ్రి దగ్గరకు వెళ్లి జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పాడు. జమదగ్ని భార్గవుడిని హిమాలయాలకు వెళ్లి పాప ప్రక్షాళనం కోసం తపస్సు చేయమని చెప్పాడు. తండ్రి ఆనతి ప్రకారం పరశురాముడు హిమాలయాలకు వెళ్లాడు.
కొంతకాలానికి కార్తవీర్యుని కొడుకు ఒకడు వచ్చి తన తండ్రిని సంహరించాడని, తల్లి కూడా సహగమనం చేసిందని పరశురాముడు తెలుసుకొని ఆగ్రహించి తిరిగి క్షత్రియులందరినీ వధించి పితృతర్పణం చేస్తానని వాగ్ధానం చేసి దండయాత్రకు బయలుదేరాడు. అట్లా పరశురాముడు 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియ నాశనం చేశాడు. క్షత్రియులు పరశురామునికి భయపడి పరశురాముడు యుద్ధ చేయనని వదిలివేసిన స్ర్తిల మధ్యలోగాని, వృద్ధులు, బాలల మధ్యలో ఉంటూ కొంతమంది వారి ప్రాణాలను కాపాడుకున్నారు.
***
మరికొన్నాళ్లకు దశరథుడు తన కుమారులకు జనకుని కుమార్తెలైన సీత ఊర్మిళ లతో వివాహం చేసుకొని వస్తుండడం తెలుసుకొని పరశురాముడు రాముని చూడడానికి వారి దగ్గరకు వచ్చాడు. అపుడు దశరథుడు చాలా భయపడి పరశురామునికి దండ ప్రణామాలు చేయగా అతడు రామునితో నీవు శివుని విల్లును విరిచితివి కదా మరి నా దగ్గర ఉన్న విష్ణు విల్లును ఎక్కు పెట్టమని అడిగాడు. రాముడు సునాయాసంగా విష్ణువు విల్లు ఎక్కుపెట్టగా రాముడే మహావిష్ణువు అని పరశురాముడు తెలుసుకొని రామునికి నమస్కారం చేసి మహేంద్రగిరికి వెళ్లిపోయాడు.
శుభం
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి