డైలీ సీరియల్

విలువల లోగిలి-75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే నేను చేయబోయే తప్పుల్ని నాకు అద్దంలో చూపించినట్లుగా చెప్పారు. మీరు వ్రాసినది అంతా చాలా నిజం మేడమ్. చిన్నప్పటినంచీ ఎన్నో కష్టనష్టాలను ఓర్చి మమ్మల్ని పెంచి పెద్దచేసిన అమ్మా నాన్నని పట్టించుకోకుండా కేవలం అమ్మాయి ప్రేమనే నిజమైన ప్రేమగా భావిస్తూ ఒక మైకంలో ఉండి కన్నవారి ప్రేమకు తూట్లు పొడిచి మరీ దూరమవుతున్నాం. నవల ద్వారా మీరిచ్చిన సందేశాన్ని ఆకళింపు చేసుకున్నాక నేను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను అని చాలా బాధపడ్డాను. నా కళ్ళు తెరిపించిన మిమ్మల్ని చూడాలని, నిజాయితీగా మీకాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది మేడమ్.
ఎందుకంటే మీలాంటివారు మా చుట్టూ ఉండి ఇలాంటి గైడెన్స్ ఇస్తుంటే ఖచ్చితంగా మా యువత ఒక్కొక్కరుగా మారతారని. అలా చాలామందిలోనే మార్పు తెస్తుందని నాకనిపిస్తోంది. మిమల్నేదో పొగడాలని నేను రాయటంలేదు. అలా మారాననటానికి నిదర్శనమే నేను.
మీ దయవలన నా ఆలోచనలలో మార్పు వచ్చింది. అదెలా అంటే నేనూ ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను చేస్తున్న మామూలు ఉద్యోగంతో ఇంట్లో వాళ్ళను ఒప్పించలేనని, మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పటం, ఒప్పుకోకపోతే బయటకు వెళ్లి ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవచ్చు అనే స్వార్థపు ఆలోచనతోనే ఉండేవాడ్ని. దానికీ ఓ కారణముంది. మా అమ్మా నాన్న నాకు ఇష్టమైన, నేను ప్రేమించిన అమ్మాయిని ఒప్పుకోరు. వాళ్ళకి కావలసింది నా సంతోషం కాదు- చుట్టూ సమాజం, బంధువులు ఏమనుకుంటారో, పరుపు ఏమవుతుంది అనే ఆలోచనలలోనే ఉంటారు. కాబట్టి నేను అంత స్వార్థంగా ఆలోచిస్తున్నా తప్పులేదనిపించింది. అందుకే నా ఆలోచనలు నిరంతరం ఇలాగే ఉండేవి. కానీ మీ నవల చదివాక నా ఆలోచనలలో మార్పు వచ్చింది.
అదేంటంటే!
నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మా, నాన్నని ఒప్పించాలని. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. ఏ అమ్మా, నాన్న అయినా వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవాలని కోరుకోరు కదా? మహా అయితే ఇదంతా జరగటానికి నాలుగేండ్లు పడుతుందేమో? ఈలోపు నేను ఉన్నత స్థితిలోకి ఎదిగే ఆస్కారం ఉంది. నన్ను నిజంగా ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి కూడా నా కోసం నాలాగే వేచి ఉంటుంది. లేదంటే ఆమె ప్రేమలో నిజాయితీ లేనట్లే. సో! నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. మా స్వార్థం కోసం తల్లిదండ్రులను బాధపెట్టకూడదనుకుంటున్నాను. నా నిర్ణయం కరెక్ట్‌గానే ఉందా మేడమ్?
నేనింకో పిచ్చి పని కూడా చేశాను. మీ నవల చదవకముందు నాకు తమ్ముడు వరుసయ్యే స్నేహితుడికి పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చెయ్యటానికి పూనుకున్నాను. ఇద్దరూ విద్యార్థులే. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. వీళ్ళు ప్రేమించుకుంటున్నారని ఇంట్లో వాళ్ళకి తెలియటంతో వాళ్ళకి తెలియకుండా నేనే దగ్గరుండి పెళ్లిచేద్దామని నిశ్చయించుకున్నా.
పంతులుగారిని కుదుర్చుకున్నాం. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తిచేసుకున్నాం. ఇంతలో మీ నవల చదవటం జరిగింది. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్లి అమ్మా నాన్న విలువను తెలియజేసి ఆ పెళ్లి ఆపించటానికి చాలానే కష్టపడ్డాను. చివరకు ఎలాగైతేనేం ఒప్పించాను.
మూడు రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేసి ‘నువ్వు చెప్పినట్లే చేస్తానన్నయ్యా! ముందు డిగ్రీ పూర్తిచేసి మంచి జాబ్ తెచ్చుకుంటాను. తర్వాత ఇద్దరి అక్కలకి పెళ్లి చేసి అపుడు ఇంట్లో వాళ్లకి మా ప్రేమ గురించి చెప్పి, వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానికి కారణం ప్రత్యక్షంగా నేనే అయినా పరోక్షంగా మీరే!
మీరు వ్రాసిన ఈ నవల వలన సమాజంలో మాలాంటివారి జీవితాలలో మార్పు రావటానికి బాగా ఉపయోగపడుతుంది మేడమ్. మీ సమాజ సేవకు అంజలి ఘటిస్తూ మీరు నూరేళ్ళు చల్లగా వర్థిల్లాలని.. జీవితాంతం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మేడమ్.. మీ అభిమాని.. సునీల్.
***
అంతా చదివాక ఉత్తరాన్ని మడుస్తూ ‘‘ఈ ఆశీస్సులన్నీ విశ్వకే చెందాలి.
ఇలాంటివి ఇప్పటికి వెయ్యి ఉత్తరాలుదాకా వచ్చాయి. ఇంతమందిలో స్పందన తెప్పించిన విశ్వకి ముందు కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటూ విశ్వకు ఫోన్ చేసింది.
‘‘హలో’’ అటునుంచీ విశ్వ గొంతు.
తను హలో అనేలోపే ‘చెప్పండి మేడమ్’ అంది.
‘‘నవలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించి చేసాను విశ్వా’’.
‘‘్భలేవారే మేడమ్. రాసింది మీరు. మార్పు వచ్చింది వారిలో. మధ్యలో నాకెందుకు కృతజ్ఞతలు? కష్టంమీది ఫలితమూ మీదే!’’
‘‘అలా ఎలా అవుతుంది? నువ్వు చెప్పకపోతే నేను రాసేదానే్నకాదు. అప్పుడు ఈ మార్పుకు ఛానే్స లేదు. ఎంతమంది మారామని చెబుతున్నారో లెక్కలేదు. ఇదే విషయాన్ని చెబుతూ వెయ్యికిపైనే ఉత్తరాలు వచ్చాయి. అంతా నీ మహత్మ్యమే’’.
‘‘అలా అనకండి. రాయటానికి చిన్న క్లూ ఇచ్చానంతే’’.
‘‘సరే ఉండనా. మరోసారి నీకు థాంక్స్’’ అంటూ ఫోను పెట్టేసిందావిడ.
***
ఆవిడ చెప్పింది విశ్వ ఒప్పుకోదు.
విశ్వ చెప్పింది ఆవిడ ఒప్పుకోదు.
అసలు జగన్నాధక సూత్రధారి పైవాడు. ఇలా అందరిచేత మాట్లాడిస్తూ చమత్కారం చేస్తుంటాడు పైనుంచీ.
అది గ్రహించక అంతా మనమే చేసామని మిడిసిపడుతూ ఉంటాం.
చేసేది, చేయించేది అంతా ఆయనే కదా!
పాత్రలో జీవిస్తూ ఉంటాం మనం. అంతే!
నీ పని అయిపోయింది వచ్చెయ్ అంటే సర్కస్‌లో రింగ్ మాస్టరు చెప్పినట్లు విని వాళ్ళలా వెళ్లిపోవాల్సిందే.
కాదని ఉంటామన్న కుదరదు. ఎక్కడో సావిత్రిలాంటివాళ్ళు ఉంటే తప్ప.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ