డైలీ సీరియల్

విలువల లోగిలి-78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకిలాంటివన్నీ మనం ప్రోత్సహించటం? మనల్ని, మన సాంప్రదాయాలను సమూలంగా నాశనం చేస్తున్న ఇలాంటివాటిని మనం ఎందుకు వదిలెయ్యలేకపోతున్నాం?
మేధావులందరికీ ఈ విషయాలు తెలియవా? తెలిసే ఎందుకు వౌనం వహిస్తున్నారు?
అసలు యువతననాలి. వాళ్ళు ఎంతో తెలివైనవారు. మేధా సంపత్తు అంతా వాళ్ళమెదడులోనే నిక్షిప్తమై ఉంది. దాన్ని ఎడిసన్‌లా, న్యూటన్‌లా, రైట్ సోదరులులా క్రొత్తవిషయాలను కనిపెట్టడానికి, తోటివారికి సేవచేయటానికి, తమని తాము ఉన్నత స్థితిలో నిలబెట్టుకోవటానికి, దేశాన్ని రక్షించటానికి, మానవత్వం చూపించటానికి ఉపయోగించాలి కానీ ఇలా అమ్మాయిల వెంట ఉన్మాదుల్లా పరుగెట్టడానికి కాదని ఎలా చెప్పాలి?
అసలు ఇలాంటి మంచి సందేశాన్ని అందిస్తూ తనే ఎందుకు ఒక సినిమా తీయకూడదు?
అదీ ఒక రకంగా సంఘసేవే కదా!
వెంటనే మనసులో టైటిల్ కూడా వచ్చింది ‘నువ్వే మారాలి’ అని. ఇక ఆమె ఆలస్యం చేయలేదు.
వెంటనే చందూని సంప్రదించింది.
ఆమెలో ఆవేశంకన్నా సమాజాన్ని బాగుచేయాలన్న ఆతృత, తపన కనిపించడంతో సూర్య చంద్ర ఓకె చెప్పేశాడు.
ఇక కథ, మాటలు, పాటలు, చిత్రీకరణ ఒకటేమిటి అన్ని విషయాలలో విశ్వ కల్పించుకుంది. ఇది తను చేసే గొప్ప ప్రయోగం. విజయంతో తనకు లాభం రానక్కరలేదు. యువతలో మార్పు తీసుకువచ్చి మంచి మార్గంలో నడిపించగలిగితే చాలు.
మంచి మనసుతో ప్రయత్నం ప్రారంభిస్తే పనులన్నీ వాటికవే జరిగిపోతాయి అన్నట్లు ఆమె సంకల్పానికి తనలాంటి దృక్పథం వున్న వాళ్ళంతా తోడయ్యారు. అందరూ కలిసి సినిమాను ఒక చక్కటి శిల్పంగా మలిచారు. మన సంస్కృతి, సాంప్రదాయాలుకు అద్దం పడుతూ విలువలకు విలువ ఇచ్చిన మనిషన్నవాడు ఎలా బ్రతకాలో కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నంలో విజయం సాధించారు.
ఒక మంచి ముహూర్తాన సినిమాని విడుదల చేశారు. మొదటి గంటలోనే రెస్పాన్స్ విశ్వకు చేరిపోయింది. తన శ్రమకు తగ్గ ఫలితం లభించిందని. యువత విశ్వకు నీరాజనం పట్టారు.
తమకు బంగారు బాట వేసిన ఘనత ఆమెదేనన్నారు.
అది చాలు అని ఆనందపడుతున్న సమయంలో ‘ఆస్కారు’కి తమ చిత్రం పరిశీలనలో ఉందన్న కబురు వచ్చింది. ఇప్పటికే లెక్కలేనన్ని అవార్డులు వచ్చాయి. ఇపుడు దానికి ‘ఆస్కార్’ తోడవుతోంది. తనకు అది ముఖ్యం కాదు.
‘మంచి సినిమా తీసావు. నేను మారాను’అని యువత తమ ఫోనుల ద్వారా, ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా, బ్లాగులు, ట్విట్టర్లు ద్వారా తమ స్పందనను తెలియజేశారు. అదే తనకు కావాల్సింది. అది జరిగితే చాలు ‘ఆస్కార్’ అందుకున్నంత ఆనందాన్నిస్తుంది.
‘ఇస్తుంది ఏమిటి ఆల్‌రెడీ నీకా సంతోషం దక్కేసింది’ అంది అంతరంగం కూడా హుషారుగా.
అది కూడా యువతేగా. అందుకే తన ఆనందాన్ని అలా వ్యక్తం చేస్తోంది.
ఆమె ఆశించకపోయినా అన్ని అర్హతలున్న చిత్రంగా నిలబడి ఆస్కార్ కిరీటాన్ని దక్కించుకుంది.
ఆస్కార్ అవార్డు విజేతగా విశ్వ కీర్తి ఆకాశాన్ని అంటింది. అన్ని పత్రికలు ఆమెనూ, ఆమె వెనుక వున్న సంఘ సేవను శ్లాఘించాయి ఎవరెస్టు శిఖరంతో పోలుస్తూ.
***
‘‘అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నావురా విశ్వా!’’ అన్నాడు చందూ, ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ.
‘‘నా ఎత్తు ఏంపెరగలేదు, 5.4 మాత్రమే’’ అంది తనమీదే తను జోక్ వేసుకుంటూ.
‘‘నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళవుగా’’
‘‘ఆ మాటతో చందూ సీరియస్‌గానే మాట్లాడుతున్నాడని అర్థమైంది. నీకు దూరంగా అనే ఆలోచనే ఆమె మనసుకు రాదు. ఆ శివపార్వతుల్లా మనమూ ఎప్పుడూ కలిసే ఉంటాం. కలలోకూడా అలాంటి ఆలోచన రానీయకు. ఒకే మాట - ఒకే బాట- అదే రాముని బాట. అదే మన నినాదం. ఇప్పటిదాకా అలానే ఉన్నాం. ఎప్పటికీ అలానే ఉంటాం. బంగారూ’’ అంది చందూని హృదయానికి హత్తుకుంటూ.
‘‘ఏమో! నువ్వెంత చెప్పినా అప్పుడప్పుడూ భయం వేస్తుంటుంది’’ అన్నాడు మళ్లీ.
‘‘ఎందుకంత భయం? మనల్ని ఎవరు విడదీస్తారు? చివరకు మృత్యువు కూడా ఆ పని చేయలేదు. మనల్ని జంటగానే తీసుకువెళ్తుంది’’.
‘‘నిజంగానేనా? నువ్వు లేని ప్రపంచాన్ని నేను ఊహించలేను. నేను మనలేను కూడా’’.
‘‘ఈ రోజు నీకేమయింది చందూ? ఇలా మాట్లాడుతున్నావ్?’’
‘‘ఏమో! నీకేమయినా అయితే నిన్ను విడిచి నేనుండలేను.. అంతే’’ చిన్నపిల్లవాడిలా చందూ.
‘‘లేనిది ఊహించుకొని భయపడటం మంచి లక్షణం కాదు. సావిత్రి భర్త ప్రాణాలుకోసం పోరాడింది. అదే జరిగితే నీకోసం యముడితో నా ప్రాణాలు కోసం పోరాడి నన్ను నేను నీకు కానుకగా సమర్పించుకుంటాను.. సరేనా?’’
ఆ మాటలకు చందూ పెదాలమీద చిరునవ్వు పూపు పూసింది. హాయిగా నవ్వేశాడు.
‘‘నీ నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా?’’అంది తన్మయత్వంతో, చందూనే చూస్తూ.
‘‘నువ్విలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’’అంది అతని తలను నిమురుతూ.
‘‘తమరి ఆజ్ఞను శిరసావహిస్తాను’’ అన్నాడు బుద్ధిమంతుడిలా.
‘‘మా చందూ మేలిమి బంగారం’’ అంది అతని నుదుటిని ముద్దుపెట్టుకుంటూ.
ఆ రాత్రి తొలి రాత్రని మురిపించింది ఆ ప్రేమ జంటకు.
***
‘‘చందూ! తొందరగా నిద్రలే! ఈ రోజే అత్తయ్య, మామయ్య తీర్థయాత్రలనుంచీ తిరిగి వస్తున్నారు’’.
‘‘కాసేపు నిద్రపోనీ విశ్వా!’’
‘‘అసలు ఎయిర్‌పోర్ట్‌కి నువ్వే వెళ్లి తీసుకురావాలి. తమ సుపుత్రుణ్ణి కష్టపెట్టకూడదని వాళ్ళు రావద్దన్నారు. అదే సందని తమరు ముసుగు కప్పేసారు. లేవాలి. ఆలి వెళ్లాడు వాళ్ళను తీసుకురావటానికి.. చాలా రోజుల తర్వాత వస్తున్నారు. వాళ్ళకు ఇలాగేనా స్వాగతం చెప్పేది?’’అంది ముద్దుగా కసురుతూ.

- ఇంకా ఉంది

యలమర్తి అనూరాధ