డైలీ సీరియల్

కొమ్మ కోరిక తీరేనా? ( రుక్మిణి - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకు ఆప్తులైనవారు ఎవరున్నారు. ఎవరు రుక్మికి హితవు చెప్తారా అని క్షణమొక యుగంగా గడుపుతోంది.
అంతలో ఆమె చెలికత్తెల్లో ఒక చపలాక్షి వచ్చి ‘అమ్మా! రుక్మికి హితబోధ చేయడమూ ఆయన ఒప్పుకుని మిమ్ములను కృష్ణయ్యకిచ్చి వివాహం చేయడం అనేది చాలా కష్టమైంది.’ అని ఏదో చెప్పబోతుండగానే రుక్మిణి
‘ఆ .. ఆ నేను అదే అనుకొంటున్నాను. కానీ తల్లిదండ్రీ అంగీకారం, తోబుట్టువుల అంగీకారం లేనిదే నా పెళ్లి ఎలా జరుగుతుంది. ఆ కృష్ణుని దగ్గరకు ఎవరు వెళ్తారు’అని తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చింది.
అంతలో చామంతి అనే చెలికత్తె వచ్చి ‘అమ్మా! ఇంతకంటే మీరే ఎవరినైనా కృష్ణుని దగ్గరకు పంపించి ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా చెప్పి మీరే నన్ను చేకొని పొమ్ము అని చెప్పి పంపారనుకోండి. అటు మీ వివాహం అయిపోతుంది కదా ఆ తరువాత రుక్మి యువరాజుగారు ఏమి చేస్తారు... ఎలాగూ మీ తల్లిదండ్రులకూ కృష్ణయ్యకు మిమ్ము కట్టబెట్టాలనే తలంపు ఉండనే ఉంది కదా’అంది.
ఇదేదో మంచి పని లాగున్నది అనుకొన్నది రుక్మిణి. కానీ కృష్ణుడు దగ్గరకు వెళ్లివచ్చే వారు ఎవరా అని భ్రుకుటి ముడిచి మరీ ఆలోచనలో పడింది.
అపుడే అగ్ని ద్యోతనుడు అనే విప్రుడు రుక్మీణిదేవిని ఆశీర్వదించడానికి వచ్చాడు.
‘‘మనోవాంఛాఫలసిద్ధిరస్తు! తల్లీ అఖండ ఐశ్వర్యాలతో చల్లగా వేయేండ్లు దీర్ఘ సుమంగళిగా జీవింతువుగాక!’’ అని ఆశీర్వచనాలు చేసాడు. అంతే ‘‘ స్వామీ నమస్కారాలు. మీరు సమయానికి వచ్చారు. ఇక నాకు వచ్చిన సమస్యను దూరం చేయాల్సిన బాధ్యత మీదే సుమా’ అంది రుక్మిణి.
‘తల్లీ నీకు సమస్య ఏమిటి? దానిని నేను తీర్చడమేమిటి యువరాణి’ అన్నాడు ఆ విప్రుడు. ‘మీరు అల్పసంతోషులు. ధర్మమార్గ నిపుణులు. మీరు గాయత్రీ జప నిరతులు. ఇక మీకు ఎదురేమున్నది స్వామీ. ఈరోజు నేను మహాదుఃఖానికి చేరువ అవుతానా అన్నట్టు ఉంది నా పరిస్థితి. రాబోయే రోజులను తల్చుకుంటే ఏమి జరుగుతుందో అని నా మనస్సు అదిరిపాటుకు గురవుతున్నది. కనుక మీరు ఆ ద్వారకాపురికి వెళ్లి అక్కడున్న ఆ గోపాలబాలకునికి నా మాటగా ఒకమాట చెప్పిరావలసి ఉన్నది. ఇది చాలా రహస్యం. రుక్మికి తెలిస్తే అంతా అబాసుపాలుఅవుతుంది. ఒక్క రుక్మికే కాదు ఎవరికి తెలిసినా నాకే కాదు నావంశానికే చెడు పేరు వచ్చేస్తుంది. అందుకే మీరు శ్రమ అనిపించినా కూడా ఆ ద్వారకాపురికి వెళ్లి యశోదానందనునికి నన్ను చేపట్టుమని చెప్పిరండి. ఆయన కోసం నేను చేయని వ్రతాలులేవు. ఉండని ఉపవాసాలు లేవు. క్షణక్షణమూ ఆ పరమేశ్వరినీ వరాన్నివ్వమని ప్రతిరోజూ కోరుకుంటూ ఉన్నాను. నా తలరాతను మార్చే ఆ మధుసూదునుడిని నా చెంతకు వచ్చి నన్ను రక్షించి గొని పొమ్ముని చెప్పిరండి ’అని పలువిధాలుగా అగ్నిద్యోతనుడికి రుక్మిణి తనబాధనంతా చెప్పింది.
ముందు అగ్నిద్యోతనుడు చేయవలసిన కార్యాన్ని తలుచుకొని తొట్రుపడ్డాడు. కానీ వెళ్లేది ఆ పరంధాముడైన కృష్ణుని దగ్గరకు. ధర్మపక్షపాతి అని పేరు తెచ్చుకున్న ఆ వసుదేవసుతుడు, మురారి, కుచేలుడిని సంపన్నుడిగా మార్చినవాడు నన్ను కాపాడలేడా ఏమిటి అన్నింటినీ ఆ కృష్ణయ్యనే ఉన్నాడనుకొని మనస్సు దిటవు చేసుకొని ‘‘అమ్మా! ఇక నీవు చింత వదలి ఆ నందనందుని గూర్చి ఆనందనందనోద్యానంలో విహరిస్తున్నట్లుగా ఉండు ము. నీ పని నాపని రెండూ నేను చక్కబెట్టుకొని వస్తాను. ఇదిగో ఇపుడే ఆ ద్వారకాపురికి బయలుదేరుతున్నాను’అన్నాడు. అన్నవెంటనే సెలవుతీసుకోవడం ఆయన అంతఃపురాన్ని దాటటమూ జరిగిపోయాయి.
రుక్మిణి మనస్సు ఆనంద పరవశంతో ఊగిపోతుంది. ఇక నాకేమీ వేదన అక్కర్లేదు. ఆ యదువంశవిభుడే నన్ను అనుగ్రహిస్తాడు. తన చేతిని అందుకుంటాడు. ఇంతకీ ఆయనన్ను చేరే విధానమెలాగో అని తలపోస్తూ కూర్చుంది. చెలికత్తెలంతా తమ రాణి ఆనందంతో ఊహాలోకాల్లో విహరించడం చూసి ఆమెకు సపర్యలు చేయడానికి ఉత్సాహపడ్డారు. అగ్నిద్యోతనుడు ద్వారకావాసి దగ్గరకు చేరాడు. ఆ నల్లనయ్య అగ్నిద్యోతనునికి స్వాగత మర్యాదలు చేశాడు. మంచి ఆసనం ఇచ్చి కూర్చున చేశాడు. విదర్భ కుశలాన్ని అడిగి తెలుసుకొన్నాడు. భీష్మకుని ఆరోగ్య విశేషాలను కూడా అడగడిగి మరీ తెలుసుకొన్నాడు. ఇంతకూ వచ్చిన విశేషమేమిటో చెప్పుమని కృష్ణుడే అడిగాడు. వచ్చిన విషయాన్ని దాపరికం లేకుండా విప్రుడు వివరించాడు.

- ఇంకా ఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804