డైలీ సీరియల్

రుక్మిణి - 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన మనసులో కూడా అందచందాలు మంచితనమూ కలగలసిన రూపం ఉంది కనుక అగ్నిద్యోతనుడు చెప్పిన వన్నీ విని కృష్ణుడు మరేం ఫర్వాలేదు. నేను తప్పక అక్కడికి వస్తాను. కానీ ఏ యుద్ధం లేకుండా తీసుకొని రావలంటే ఎలా వీలవుతుంది. అభయం కోరినవారిని నేను ఎన్నడూ కాదనలేను. నా అండ కోరిన వారికి తప్పక నాసాయం వారికి అందుతుంది. అందులోనే తనచేతినే నాకిస్తానని అంటుంటే ఆ ఒప్పుల కుప్పను నేనుకాదనగలను అంటూ కాస్త ఆలోచించి తరువాత ఇలా చెప్పాడు. వారి కులాచారం ప్రకారం పరమేశ్వరిని కొలువడానికి కోవెలకువస్తుందని అన్నారు కదా. అపుడే నేను నా రథాన్ని తీసుకొని వచ్చి ఉంటాను. అపుడు గనక నాతో వస్తానంటే నేను తప్పక తీసుకొని వెళ్తాను. నామాటగా చెప్పండి రుక్మిణీ ఇక దేవకీదేవి కోడలుగాను, యశోదాదేవికి ముద్దుల కోడలుగా ను మారిపోయిందని చెప్పండి అని అగ్నిద్యోతనుడు సంతోషించేవిధంగా కృష్ణుడు చెప్పాడు.
అక్కడినుంచి హుటాహుటిన బయలుదేరి ఆఘమేఘాల మీద వచ్చి ఈ విషయాన్ని ఆత్రంగా ఎదురుచూస్తున్న రుక్మిణీదేవికి చేరవేశాడు అగ్ని ద్యోతనుడు.
రుక్మిణి పట్టరాని సంతోషం వేసింది. ఎప్పుడెప్పుడా ఆ క్షణాలు వస్తాయా అని ఎదురుచూస్తోంది.
రుక్మి ఎంతో మహాసంబరంగా తన మాటను కాదనడానికి ఎవరికీ శక్తి లేదని అనుకొన్నాడు. వెంటనే తన ఆలోచనను చెప్పాడు. శిశుపాలునికిచ్చి వివాహం చేస్తే అటు రాజ్యమూ ఇటు అమ్మాయి ఇద్దరూ సంతోషంగా ఉంటారని భీష్మకునితో రుక్మి చెప్పాడు.
అనుకున్న గండం రానేవచ్చిందనుకొన్నాడు భీష్మకుడు. ఇక చేసేది ఏమీ లేదు. కాదుకూడదని ఎదురుతిరిగితే రుక్మి తల్లిదండ్రులన్న గౌరవాన్ని కూడా మిగల్చడు. మహారాజు మనసున బాధపడుతూనే శిశుపాలున కిచ్చి తన కొమార్తెను వివాహం చేయడానికి దైవజ్ఞుల చేత మూహూర్తాలు పెట్టించాడు.శుభమూహూర్తం దగ్గర అవుతుంటే మహారాజ భవనం అంతా మిరుమిట్లు గొలిపేట్లుగా దివ్వలతో, పూలతో అలంకరించారు. అంతఃపురంలోని కన్యకామణి శిశుపాలునితోవివాహం అంటే ఏమి అంటుదో నని రుక్మి అటువైపుకు వెళ్లడం లేదు. సోదరులంతా కళలేని ముఖాలతో తమ చెల్లెల్ని చూస్తున్నారు. ఆమె ముఖంలో లేశమైనా బాధలేకపోవడం చూసి ఏమై ఉంటుందా. ఇన్నాళ్లు కృష్ణుని చేపట్టాలనుకొంది కదా. మరి ఈనాడు రుక్మి చేస్తున్న అఘాయిత్యాన్ని ఎలా సహిస్తోందా అని లోలోపల వేదన చెందారు. భీష్మక మహారాజు మహారాణి కన్నీరు కారుతుండగా తమ కూతురిని పెళ్లికూతురుగా అలంకరించారు.
శుభమూహ్తూరం వచ్చింది.
తల్లి పరమేశ్వరినీ కాపాడాలని దణ్ణం పెట్టుకుని రుక్మిణీదేవిని కులాచారం ప్రకారం గుడికి వెళ్లి రమ్మని సర్వాలంకారం చేసి ముతె్తైదువులను తోడిచ్చి పంపారు.
అదే మంచి సమయమని రుక్మిణి శుభమూహూర్తమని అనుకొంది. నాలుగువైపులా తన నాథుని కోసం వెతుకుతూ పరమేశ్వరి చెంతకు వెళ్లింది. ***

డా. రాయసం లక్ష్మి