డైలీ సీరియల్

కదనమా? కళ్యాణమా! ( రుక్మిణి -6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధూప ధీప నైవేద్యాలను దేవికి ఆరగింపు చేసింది. అక్కడున్నవారికందరికీ అమ్మ ప్రసాదాన్ని అందించింది. తాను అమ్మ ప్రసాదాన్ని తనకిచ్చిన వరంగా భావించి సేవించింది.
ఆరుబయటకు వచ్చింది.
అలా వచ్చి రాగానే ఎక్కడ్నుంచి వచ్చిందో కానీ దివ్యరథాన్ని తీసుకొని అఖిలలోకాధీశ్వరుడు అఖిలాండేశ్వరుడు వచ్చాడు. ఆ అరవిందాదళాయ తాక్షుని చూడగానే చిరునవ్వు రాగా గబగబా రథం దగ్గరకు అడుగులు వేసింది. కృష్ణుడు తన చేతిని ఆసరాగా ఇచ్చాడు. జారపోతే అందదేమో అన్నట్టుగా ఒక్క ఉదుటున కృష్ణుని చేయి అందుకుని రథంలోకి రుక్మిణి అడుగుపెట్టేసింది.
***
నగరంలో రుక్మి దేదీప్యమానమైన అలంకరణలతో పాటుగా సర్వసైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉండమని ఆజ్ఞలిచ్చాడు. అసలే వివాహమహోత్సావానికి పిలవని పేరంటంలాగా బలరామకృష్ణులు వచ్చారు. వారికి భీష్మక మహారాజు ఆహ్వానం పలికారు అన్న విషయం రుక్మి తెలుసుకొన్నాడు. తన మాట కాదని కృష్ణునికి తన చెల్లెల్ని ఇవ్వడానికి భీష్మకుడు ధైర్యం చేయడు కానీ అసలే కృష్ణుడు మాయల మారి. ఎపుడు ఎక్కడ ఏమి చేస్తాడో ఎవరికీ తెలియదు. కంసునితోపాటు పుట్టినప్పటి నుంచి ఎంతమందినో సంహరించివేశాడు అని కథలుకథలుగా ఆ మురారి కథలు చెప్తుంటారు జనం. అవి అన్నీ విని ఎందుకైనా మంచిదని రుక్మి తన స్నేహితులను కూడా సర్వసైన్యంతో తరలి రమ్మన్నాడు. వారంతా రుక్మికి బలం చేకూర్చటానికి అటులనే అన్నారు. అట్లాగే వచ్చారు కూడా . జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు వాసుదేవుడు అంతా గుమికూడారు. ఒకవేళ కృష్ణుడు రుక్మిణిని చేపట్టడానికి ముందుకు వస్తే ఏం చేయాలా అని వారంతా మనోవేదన పడుతున్నారు.
‘రుక్మీ! అసలు ఈ కృష్ణుడిని ఎవరు పిలిచారు? అయినా వాడిని పిలవకపోయినా ఏదో ఒక వంకతో వచ్చేస్తాడు అనుకో. వచ్చినా మీ తల్లిదండ్రులు ఆహ్వానం పలకడమేమిటి? ఇదిగో ఒక్క కృష్ణుడే ఇక్కడకు వచ్చాడని నీవనుకోకు. బలరాముడు అమిత సైన్యంతో వీని వెనుక బయలు దేరి వస్తున్నాడట. ఏ వ్యూహం లేకుండా ఆ మాయలవాడు రాడు. కనుక నీవు సర్వసైన్యాన్ని సన్నద్ధంగా ఉండమని చెప్పు. ఏ క్షణంలో యుద్ధ్భేరి మోగుతుందో ఆ క్షణమే యుద్ధం మొదలవుతుంది అని ఆజ్ఞ ఇచ్చి ఉండు’ అని జరాసంధుడు రుక్మికి చెప్పాడు.
‘నేను అన్నివిధాల అప్రమత్తంగానే ఉన్నాను. మీరు భయపడవలదు. ఛేది దేశ రాకుమారుడు, పైగా అందగాడైన శిశుపాలుడినే చంద్రబింబం వంటి ముఖారవిందం గల నా చెల్లి చేపడుతుంది. కానీ ఆ నల్లగా ఆవులు కాచే కాపరిని దగ్గరకు కూడా రానివ్వద్దు’లెమ్మని రుక్మి వారికి భరోసా కల్పించాడు. అందరూ ఎప్పుడెప్పుడు స్వయంవరం మంటపంలోకి వెళ్దామా అని ఎదురుచూస్తున్నారు. శిశుపాలుడు రుక్మిణి ననే్న పెళ్లిచేసుకొంటుంది అని తెలిశాక ఇక స్వయంవర మంటపం ఎందుకు పెళ్లి పందిట్లోకి వెళ్లితే సరిపోతుంది కదా అని సూచనలు చేస్తున్నాడు.
అంతలో ఉన్నట్టుండి శ్రీకృష్ణుని పాంచజన్య మోగింది. అందరూ ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. ఎక్కడెక్కడ నుంచి ఈ పాంచజన్య శబ్దం వినవస్తోంది. ఈ శబ్దారావం ఆ కృష్ణుడిది ఇందులో అనుమానమేమీ లేదు పదండి అందరూ ఒక్కసారిగా కదులుదామనుకొన్నారు. కాని వారంతా ఆ శబ్దారావానికి చేష్టలుడిగి నిలబడి పోయారు.
***
చేతినిండా గాజులు ధరించి అరచేతిలో గోరింటాకును పండించుకుని అతి సున్నితంగా ఉన్న చేయ లోకాలన్నింటికీ అభయం ఇవ్వగల శక్తి సంపన్నుని చేయి అందుకున్నది. నెమలి ఫించం ధరించి న కృష్ణుడు అలవోకగా రుక్మిణి ని తన పక్కన పెట్టుకొని భూమ్యాకాశాలు దద్ధరిల్లేటట్లుగా పాంచజన్యం పూరించాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804