డైలీ సీరియల్

తమ్ముని చేతలు... అన్నయ్య బోధలు ( రుక్మిణి -9)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతడు కాస్త అహంకారి ఇపుడు వీని అహంకారం అంతా దిగిపోయింది. నా అన్నను బతకనిమ్ము అని వేడుకుంది. కన్నీళ్లతో బతిమాలుతున్న కొత్త పెళ్లికూతురు ముఖాన్ని చూసి కృష్ణుడు రుక్మిని వదిలేవేశాడు. తను భంగపోయినవిధాన్ని తలుచుకుని రుక్మి ఎంతో ఖిన్నుడై వెనుతిరిగాడు. బలరాముడు రుక్మిణీ కన్నీటిని చూశాడు. తన మరదలు ఈనాడే తన తమ్ముని చేపట్టింది. ఆమె తమ్ముడు తోబుట్టువు, నా తమ్ముని చేతిలో ఓడిపోయాడు అందుకే రుక్మిణికి బాధ కలుగుతోందని అనుకొన్నాడు. రుక్మిణి దగ్గరకు వెళ్లి ‘‘అమ్మా! నీవేమీ చింతించకు. నీవు చేపట్టింది మామూలు మనిషి కాదు. జగన్నాథుడు. అందరినీ పాలించువాడు. ఎవరికి ఏ శిక్షలు వేయాలో తెలిసినవాడు.
అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినవాడు. జీవులు చేసుకొన్న పురాకృత కర్మలను అనుసరించి వారికి శిక్షలు వేసే ధర్మాత్ముడు నా తమ్ముడు. పోను పోను నీకే తెలుస్తుందిలే. నీవు కొత్తపెళ్లికూతురివి. నీ సోదరునకు వచ్చిన భయమేమీ లేదు. రుక్మి తల్లిదండ్రుల చెంతకు వెళ్లి సుఖిస్తాడు లే.. నీ కొద్దిరోజుల్లో నీ పైన నా తమ్ముడిపైన కోపాన్ని వీడనాడుతాడు. నీవు దుఃఖించకు తల్లీ’’ అని రుక్మిణీకి ఓదార్చాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు.
చూడు మననగరానికి వెళ్లిన తరువాత నీ పెళ్లికి నీ తల్లిదండ్రులతోపాటుగా రుక్మి కూడా వస్తాడు. నిన్ను మీ ఆయన్ను దీవిస్తాడు. నీవు ఆ కన్నీరును తుడుచుకుని అంతా ఆ భగవంతునిదే భారం అని హృదయాన్ని ధృడం చేసుకో తల్లీ అని మరలా మరలా చెప్పాడు. రుక్మిణీ కూడా కన్నీరు తుడుచుకుని రాబోయే మంచిరోజులను తలుచుకుని కృష్ణుని పక్కకు చేరింది.
అందరూ కలసి నగరాన్ని చేరుకొన్నారు.
చుట్ట పక్కాలందరికీ బలరాముడు తన తమ్ముని వివాహమహోత్సవం జరుగుతుందని చూడడానికి దీవించడానికి రమ్మని ఆహ్వాన గీతికలను పంపాడు. అనేక దేశాలనుంచి రాజులు, చక్రవర్తులు వచ్చారు. చుట్టాలు బంధుజనులు కోకొల్లలుగా వచ్చారు. ఆకాశమార్గాన దేవతలుకూడా వచ్చారు. కృష్ణుడు రుక్మిణినీ వివాహం చేసుకొంటున్నాడు. ఆ మహాలక్ష్మీ తిరిగి మహావిష్ణువును చేపట్టేశుభమూహూర్తం విచ్చేసింది. ఈ యశోవిభుడిని రుక్మిణితో కలసి చూద్దాం అని మునిగణమంతా విచ్చేశారు. సిద్ధులు,సాధ్యులు, సజ్జనులు అంతా కలసి రుక్మిణీ వివాహానికి తరలి వచ్చారు. భూదేవి అరుగుగా మారింది. ఆకాశం పందిరిగా మారింది. అప్సరసలూ వచ్చి నాట్యమాడారు. గంధర్వులు వచ్చి సంగీతనృత్యాలను ప్రదర్శింపచేశారు. నగరం అంతా దేదీప్యమానంగా అలంకరించబడింది. ప్రతి ఇంట్లోవారు తమ ఆడపిల్లకు వివాహమన్నట్టుగా సంతోషంతో పెళ్లి పనులు చేస్తున్నారు. కర్పూర కుంకుమతో ముగ్గులు తీర్చి నగరాన్ని అందంగా అలంకరింపచేశారు. రకరకాలైన రంగురంగు పువ్వులతో తోరణాలన్నీ అలంకరించారు. ఆ శుభమూహూర్త వచ్చింది. దైవజ్ఞుల చేత మూహూర్తం స్థిరం చేసిన బలరాముడు ఆ శుభమూహూర్తం వచ్చిందని ఎంతో సంతోషంతో కృష్ణుని పక్కన నిల్చున్నాడు. విదర్భ నుంచి భీష్మక దంపతులు విచ్చేశారు. అందరూ కలసి రుక్మిణీ కృష్ణుల వివాహాన్ని అంగరంగ వైభోగంగా పెళ్లిచేసారు. ఆ కళ్లాణాన్ని కనులారా వీక్షిద్దామని వచ్చినవారికందరికీ బలరాముడు కానుకలిచ్చాడు. వచ్చిన వారంతా రుక్మిణీకృష్ణులను కలకాలం చిరంజీవులై పార్వతీ పరమేశ్వరుల్లా సీతారాములుగా జీవించండి అని ముత్యాల అంక్షతలు వేసి దీవించారు. ఇంద్రాది దేవతలంతా రుక్మిణీ కృష్ణులపై పుష్పవృష్టి కురిపించారు.
ముకుందుడే మా అమ్మాయిని చేపట్టాడని భీష్మకుడు మహదానందం చెందాడు. అతనితోపాటుగా కేకయ , కురు, సృంజయ , యదు, కుంతి దేశాల రాజులు సంతోషించారు. భూలోక వాసులంతా మహోత్సవాలు జరుపుకున్నారు. దేవతలంతా మంచిరోజులు వచ్చాయని సంతోషించారు.
శుభం
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804