డైలీ సీరియల్

ష్... 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైన సీలింగ్ ఫ్యాన్ మెల్లగా కదులుతోంది.. తన చుట్టూ తిరుగుతోంది.. దిగ్గున లేచింది.
ఏవో రెండు కళ్ళు తనను చూస్తున్న ఫీలింగ్. గభాలున లేచి నైటీ వేసుకుంది.
టేబుల్ సొరుగులో డాక్టర్ ప్రిస్క్రైప్ చేసిన స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని...
అలాగే మంచంపై పడుకుని నిద్రలోకి జారిపోయింది ప్రియంవద.
***
‘‘ప్రియంవద గ్రూప్ ఆఫ్ కంపెనీ’’
అతి తక్కువ సమయంలో కార్పొరేట్ స్థాయికి ఎదిగి పదమూడు బ్రాంచీలలో టాప్ పొజిషన్‌లో వున్న వ్యాపార సంస్థ.
ముప్ఫైఐదేళ్ళ ప్రద్యుమ్న చైర్మన్.. ఇరవై మంది స్ట్ఫా.. ఆఫీసులో వినిపించే పదం.. పంక్చ్యువాలిటీ.
అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం, చెవులు కొరుక్కోవడం.. ఆఫీసులో నిషిద్ధం.
***
టైమ్ మార్నింగ్ టెన్..
ఆఫీసులో హడావుడి మొదలైంది.
ఆ హడావుడి కిరణ్మయితో మొదలైంది.
ఇరవై రెండేళ్ల కిరణ్మయి పొడవుగా, అందంగా అల్లరిగా ఉంటుంది.
కంప్యూటర్ ముందు కూర్చుంటే, ఆమె తపస్సులో కూర్చున్నట్లు ఉంటుంది. గలగలా మాట్లాడుతూనే చకచకా పనులు చేసేస్తుంది.
కంప్యూటర్ ఆన్ చేసి డెస్క్‌టాప్ మీద వున్న ‘హలో ఐయామ్ ఫైన్’, ‘హౌ ఆర్ యూ’ అన్న ఇమేజ్ చూస్తుండిపోయింది.
ఆమె కంప్యూటర్ డిస్క్‌టాప్‌మీద రోజుకో ఇమేజ్ మారిపోతూ వుంటుంది.
ఒక్కోరోజు ‘‘చిరునవ్వుతో నువ్వు కనిపిస్తే చివరిక్షణం వరకు నీతోనే ఉంటాను’’ అన్న అందమైన వాక్యాలు కనిపిస్తాయి.
మరోరోజు ‘‘నువ్వు నన్ను ప్రేమిస్తే.. నేను నిన్ను శాసిస్తాను’’ అన్న వాక్యం కనిపిస్తుంది.
కిరణ్మయి వేళ్ళు కీబోర్డుమీద కదులుతున్నాయి.
సరిగ్గా అప్పుడే వెనుకనుంచి రెండు చేతులు ఆమె కళ్ళను మూసాయి.
‘‘హా! రుత్విక్.. నువ్వా!’’
‘‘ముంబాయినుంచి ఎప్పుడు వచ్చావు’’ అంది.
వెంటనే ఆమె కళ్ళను మూసిన సులోచన అనే అమ్మాయి ముందుకు వచ్చి ‘‘నన్ను పట్టుకొని రుత్విక్ అంటావేంటి’’ అంది చిరుకోపంగా.
వెంటనే కిరణ్మయి ‘‘ఈ ఆఫీసులో నా కళ్ళు మూసే ఆడ లేడి కేడి నువ్వు కాక ఎవరుంటారు?’’ అంది నవ్వుతూ.
వెంటనే సులోచన పక్కన వున్న కుర్చీని కిరణ్మయి దగ్గరగా జరుపుకుని ‘‘కిరణ్మయి, నువ్విలా ఎప్పుడూ హాపీగా ఎలా ఉండగలవు?’’
కిరణ్మయి చిన్నగా నవ్వి ‘‘రోజూ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ‘గంగారాం స్వీట్ షాపు’లో హాఫ్‌కేజీ కొనుక్కెళతాను. అది ఒక రోజు సరిపోతుంది.
ప్రతిరోజు బావ తాగొస్తాడని, పక్క గదిలో వున్న అక్కను వదిలి, తన గదికి, తన పక్కన పడుకోవడానికి ట్రై చేస్తాడని, తను ఎదురుతిరిగిన రోజున ప్రతీసారీ అక్క చెంప చెళ్ళుమంటుందని చెప్పలేదు. ఏదో ఒక రోజు తన బావను తనే చంపేస్తాననీ చెప్పలేదు.
ఆ పెదవులపై చిరునవ్వు కదలాడిన ప్రతీక్షణం.. విషాదం ఆమెను వెనె్నంటే వుంటుంది.
సులోచన ఏదో మాట్లాడబోయేంతలో టేబుల్ మీద వున్న ఫోన్ మోగింది.
రిసీవర్ లిప్ట్ చేసి ‘‘హలో ప్రియంవద గ్రూప్ ఆఫ్ కంపెనీ’’ అంది కిరణ్మయి.
అప్రయత్నంగా రిసీవర్ ఆమె చేతి నుంచి జారిపోయింది.
సులోచన కంగారుగా.. ‘‘కిరణ్మయి.. ఏమైంది’’ అంటూ అడిగింది.
వణుకుతున్న పెదవులతో చెప్పింది-
‘‘ప్రద్యుమ్న సార్‌ను ఎవరో అజ్ఞాత వ్యక్తి షూట్ చేశాడట. పోలీసులు సార్‌ను జె.ఆర్. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు’’అంటూ హ్యాండ్‌బ్యాగ్ చేతిలోకి తీసుకుంది.
నగరంలో పెద్దది జె.ఆర్. హాస్పిటల్.
హడావుడిగా కిరణ్మయి, కంపెనీ స్ట్ఫా హాస్పిటల్‌కు వెళ్ళారు.
హాస్పిటల్‌లో డాక్టర్లు, నర్సులు ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా వున్నారు. రోగాలతో చేరేవాళ్ళు దిగులుగా లోపలికి వస్తుంటే, రోగాలు తగ్గాక సంతోషంగా.. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా బయటికి వెళ్ళేవాళ్ళతో సందడిగా వుంది.
కొంతమందికి హాస్పిటల్ మరణ శాసనమైతే, మరికొంతమందికి అది ఒక దేవాలయం. ప్రతి డాక్టరు దైవంతో సమానం. మరో జన్మకు శ్రీకారం, మరో సృష్టికి ప్రారంభం అక్కడే.
***
అక్కడ ప్రియంవద కళ్ళు తెరిచిన వెంటనే చుట్టూ నిర్మానుష్యంగా వుంది. కాసేపటికి ల్యాండ్‌ఫోన్ మోగింది. మళ్లీ మొబైల్ మోగింది. అలా చాలాసార్లు ఒకదాని వెనుక ఒకటి ఫోన్‌కాల్స్ వస్తూనే వున్నాయి. ఎంతసేపైనా ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయంగా వుంది.
చివరిసారిగా ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రియంవదకు కిరణ్మయి గొంతు వినబడింది. వెంటనే బయల్దేరి హాస్పిటల్‌కు రమ్మంది.
ప్రియంవద రెడీ అయి గబగబా కిందికి వచ్చి కారు స్టార్ట్ చేసింది.
ఆమె కారు మలుపు తిరగ్గానే, ఆమె కారు వెనుక వేరే కారు ఫాలో అవుతోంది.
హాస్పిటల్ కారిడార్‌లో ఎదురుచూస్తున్న కిరణ్మయి ఎదురెళ్ళి ప్రియంవదను ఐసియు దగ్గరికి తీసుకెళ్లింది.
***
నేరం ఒళ్ళు విరుచుకున్నప్పుడు, చట్టం కొరడా ఝళిపిస్తుంది.
సమయం రాత్రి పది గంటలు...
కమీషనర్ ఆఫీసు..
ఏసిబి కులకర్ణి సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు. అతని ముందు ఇద్దరు పి.ఏలు, నలుగు ఎస్సైలు నిలబడి ఉన్నారు.
ఎనిమిది ట్రాన్స్‌ఫర్లు, డజనుకుపైగా మెమోలు అతనికి గిఫ్ట్‌గా వచ్చినా చలించని డ్యూటీ మైండెడ్.. ఐ.పి.ఎస్. ఆఫీసర్.
ఐపిఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అని కాకుండా ఇండియన్ పబ్లిక్ సర్వీస్ అని భావించే స్ట్రిక్టు ఆఫీసర్.

ఇంకావుంది

-ములుగు లక్ష్మి