డైలీ సీరియల్

ష్... 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృత్తి నిర్వహణలో అతని కమిట్‌మెంట్‌కు సజీవ సాక్ష్యం అతడు కోల్పోయిన భార్య.
మూడేళ్ళ క్రితం జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో అయిదుగురు ఉగ్రవాదులను అరెస్టుచేసి, ఇరవై నాలుగు గంటల్లో వార్నింగ్‌కు గురయ్యాడు కులకర్ణి.
సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత షాపింగ్‌కు వెళ్లిన అతని భార్య కిడ్నాప్‌కు గురైంది.
***
కిడ్నాప్‌చేసిన వాళ్ళు ఉగ్రవాదుల సంస్థకు చెందిన కరడుగట్టిన నేరస్థులు. అయిదుగురు ఉగ్రవాదులను వదిలిపెడితే ప్రాణాలతో భార్యను విడిచిపెడతామని కండిషన్ పెట్టారు. ఆ రోజు జరిగిన సంఘటన కులకర్ణికి బాగా గుర్తు.
***
కులకర్ణి ఇంటికి వచ్చాడు. రాగానే ఎదురు వచ్చే భార్య ఎదురురాలేదు. బెడ్‌రూమ్‌కు వెళ్ళాడు. టేబుల్‌పై భార్య ఫొటోచూసాడు.
పెళ్ళై పదేళ్ళయినా ఎవర్‌ఫ్రెష్‌గా ఉండే భార్య.. తను రాగానే ఎదురొచ్చి గట్టిగా హత్తుకునే తన భార్య.. ఆవేళ కనిపించకపోయేసరికి..
అతనిలోని పోలీస్ ఆఫీసర్ పడగ్గది బయట ఉండి, ఆమెలోని భర్త ఆమెను అనే్వషించాడు.
ఒక్కక్షణం ఆర్తిగా టేబుల్ మీదున్న భార్య ఫొటోను తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వెంటనే ఆ స్పర్శ సరిపోదన్నట్లు పోలీస్ షర్ట్ విప్పేసాడు.
అతని అనాచ్ఛాద గుండెమీద ఆమె ఫొటో ఫ్రేమ్ ప్రింట్ అయింది. భార్య నులివెచ్చని స్పర్శ అతని కరుకు కాఠిన్యాన్ని.. సుతిమెత్తని, శృతిమెత్తని ఆలింగనమైంది. అతని కళ్లు ఆమె జ్ఞాపకాన్ని ఫోటో తీస్తున్నాయి.
ఆ క్షణమే ఆ గదిలోకి పాతకాలం నాటి రెడ్ కలర్ ల్యాండ్ ఫోన్ మోగింది.. ప్రమాదాన్ని సూచిస్తూ..
ఉలిక్కిపడ్డాడు.. క్షణకాలం భయపడ్డాడు. ఆపై లిప్తకాలం భయాందోళనకు గురయ్యాడు.
కేవలం భార్య కోసం పెట్టించిన ల్యాండ్ ఫోన్. తను తప్ప, తన మొబైల్ నుంచి తప్ప.. ఆ ల్యాండ్ ఫోన్‌కు మరెవరూ ఫోన్ చేయరు.
అలాంటిది...?
ఫోన్ రింగవుతూనే వుంది.
రిసీవర్ లిఫ్ట్ చేసి ‘ఏసిబి కులకర్ణి స్పీకింగ్’’
తెరలు తెరలుగా నవ్వు.. గులకరాళ్ళు వేసినట్లు.. వినిపించిన కర్ణకఠోరమైన నవ్వు.
‘షుక్రియా సాబ్.. ఏసిబి సాబ్. కేసీహై’’
మళ్ళీ నవ్వు...
‘‘ముజాయుద్దీన్’’
కంగారుని అణచుకుంటూ ఎగ్జయిటింగ్‌గా అన్నాడు కులకర్ణి.
‘‘గ్రేట్.. గ్రేట్ సాబ్.. మీ మెదడు కంప్యూటర్ కన్నా స్పీడుగా పనిచేస్తుంది. మీ మొమొరికీ హేట్సాఫ్.. ఈ ముజాయుద్దీన్ ఇంకా గుర్తున్నాడా సాబ్..’’ అంటూ నవ్వి.. జైల్లో ఉండవలసిన నేను ఇలా మీతో ఫోనులో మాట్లాడుతున్నానని ఆశ్చర్యంగా ఉందా.. ?
‘‘మీరు మా అయిదుగురు మనుషులను అరెస్టుచేశారు. చోడ్‌దేవ్ సాబ్.. వాళ్ళను పట్టుకుంటే మీకేమొస్తుంది.. రెండు ఇంక్రిమెంట్లు, మహా అయితే ఒక ప్రమోషన్, మీ పోలీసు చొక్కాపై ఓ ఎక్స్‌ట్రా స్టార్. వాళ్ళను విడిచిపెట్టారనుకోండి.. మీకే ప్రమోషన్ అవసరం లేదు. స్విస్ బ్యాంక్‌లో.. మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు కోరినంత డబ్బు వేసేస్తాం.. ఓకే’’ అంటూ మళ్ళీ ఆ నవ్వు వినిపించింది.
రిసీవర్ పట్టుకున్న కులకర్ణి చేయి బిగుసుకుంది.
‘‘రేయ్ డబ్బు కోసం వృత్తిని అమ్ముకునే క్యారెక్టరు కాదు.. దేశభక్తిని చనుబాలతో కలిపి తాగిన బాడీరా ఇది. పంచభూతాల సాక్షిగా నేను పట్టుకున్న అయిదు భూతాలను ఖబరస్థాన్‌లో పాతిపెట్టటానికి స్థలం సిద్ధం చేసుకో.. ఫోను పెట్టేయ్’’.

అవతలి వైపునుంచి విషపూరితమైన నవ్వు.
‘‘కులకర్ణి సాబ్.. మీరు చెప్పిన మాటలు.. ఏ సినిమా రైటర్‌కో అమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. లేకపోతే మీరు కోల్పోయేది.. మేము ఇచ్చే డబ్బు కాదు. మీ గుండెల కానించుకునే.. మీ.. ము..ద్దు..ల భార్య’’
ఒక్క క్షణం కులకర్ణి ఒళ్ళు జలదరించింది. అతని డేగ కళ్ళు ఆ గదిని నిశితంగా పరిశీలించాయి. తన గదిలో జరుగుతున్న ప్రతీ సంఘటన అతనికెలా తెలిసింది?
అతనిలోని పోలీస్ ఆ క్షణమే.. క్షణాల్లో ఇనె్వస్టిగేషన్ మొదలెట్టాడు. అతని పోలీసు చూపును.. ఆ గదిలోన రహస్యంగా అమర్చిన కెమెరా దాటిపోలేదు.
ఎదురుగావున్న టెడ్డీబేర్ ఎడమవైపు కన్ను భాగంలో వున్న స్పై కెమెరా అతని దృష్టిలో పడింది.
‘‘ముజాయుద్దీన్ నా భార్యను వదిలిపెట్టు. ఇది రిక్వెస్ట్ కాదు.. వార్నింగ్. మిసెస్ కులకర్ణి ఒంటిపై చేయి పడితే.. ముజాయుద్దీన్ సరాసరి స్మశానానికే వెళ్లిపోతాడు.. ఖబడ్దార్’’ ఫోన్ పెట్టేశాడు.
***
చాలా టెన్షన్‌గా వున్నాడు కులకర్ణి.
ముజాయుద్దీన్ గురించి అతనికి బాగా తెలుసు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముజాయుద్దీన్ తనకు ఫోన్ చేశాడంటే కేపబిలిటీ తెలుస్తుంది. తన భార్యను ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటాడు.
వెంటనే అతడున్న జైలుకు ఫోన్ చేశాడు. జైలర్‌ను కాంటాక్ట్ చేశాడు. ముజాయుద్దీన్ సెల్‌లో ఉన్నాడని తెలిసింది.
అంతా మిస్టరీగా అనిపిస్తోంది. పోలీసులను అలెర్ట్ చేశాడు.
సరిగ్గా మూడు గంటల తర్వాత ....
ఇంకావుంది

-ములుగు లక్ష్మి