డైలీ సీరియల్

ష్... 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడింటి ముందు శవపేటిక కనిపించింది. ఉద్వేగంతో శివపేటిక పక్కన మోకాళ్ళమీద కూర్చున్నాడు కులకర్ణి.
‘‘చిరునవ్వుతో ఎదురొచ్చి నన్ను హత్తుకున్న ప్రాణమా, నన్ను విడిచి క్షణమైనా ఉండలేని, నా ఉచ్ఛ్వాస నిశ్వాసమై నా కౌగిలలో తప్ప మరెక్కడా ఉండలేని నువ్వు మృత్యువు దగ్గరికి ఎలా వెళ్ళావు? రక్తసిక్తమైన భార్య శరీరాన్ని గుండెలకు హత్తుకుని.. ముప్ఫై ఏళ్ళు దూరంగా వున్న కన్నీళ్ళను వర్షిస్తున్నాడు.
అతనిలోని పోలీస్ ఆఫీసర్ పక్కకు తొలిగాడు. ఆమె శరీరం మీద వున్న గాయం గుర్తులు.. అతని గుండెను తొలిచేస్తున్నాయి. ఇంకా తనవైపే ఆ కళ్ళు చూస్తున్నట్లు అనిపించాయి.
***
అతని భార్య అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటికివచ్చిన అతనికి తెలిసిన షాకింగ్ న్యూస్ అయిదుగురు ఉగ్రవాదులు పారిపోయారని.
***
కులకర్ణి ఆ రోజే తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. కానీ ఒకే ఒక వ్యక్తి వల్ల తిరిగి అతను డ్యూటీలో జాయిన్ అయ్యాడు.
ఆ వ్యక్తి ప్రద్యుమ్న..
***
ఒక్క క్షణం..
భార్య జ్ఞాపకాలు గుర్తుకురాగానే గుండెనెవరో.. గుండె తలుపునెవరో.. తన తలపులన్నీ వలపుగా చేసి వరమాలను జ్ఞాపకంగా చేసి.. చుట్టేసిన, పట్టి కుదిపేసిన భావమేదో, భావోద్వేగ కెరటమై తన సముద్ర తనువును తటిల్లతూ ముద్దాడిన ఫీలింగ్ కలిగింది.
తన ఎదురుగా నిలబడి తనవైపే చూస్తున్న గుర్తుకొచ్చే జ్ఞాపకపుశరం తన కనురెప్పల మధ్యకు సంధించినట్లు అనిపించింది. తల విదిల్చాడు కులకర్ణి. వర్తమానంలోకి వచ్చాడు.
‘పోలీస్’ అనే మూడక్షరాల పదం, త్యాగం అనే రెండక్షరాల పదం ముందు కొవ్వొత్తిలా కరిగిపోతుందని ఎవరికి తెలుసు? ఎందరికి తెలుసు?
అవసరమైతే ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ప్రాణాలు ఫణంగా పెట్టి, ఖాకీవాడి గురించి కామెంట్స్ చేసే కాకుల లోకంలో.. ఖద్దరు రాజకీయ నాయకుల కుళ్ళు వ్యవస్థలో అస్తవ్యస్త వ్యవస్థలో బదులిచ్చే వారెవరు?..
ఏ.సి.బి కులకర్ణి తన ఎదురుగా వున్న సిఐ వైపు చూసి ‘‘హత్యాప్రయత్నం జరిగిన ప్రాంతంలో సాక్షులను విచారించారా?’’ సూటిగా అడిగాడు.
సిఐ స్ట్ఫిగా నిలబడి ‘‘సాక్షులెవరూ లేరు సార్. హత్య జరిగిన ప్రాంతంలో టీ బడ్డీవాడు, ఎదురుగావున్న రెండు మూడు షాపుల్లోనివారు తమకేది తెలియదని చెప్పారు’’.
‘‘డామిడ్ కళ్ళముందు నేరం జరిగినా, ఘోరం జరుగుతున్నా పట్టించుకోని జనం మధ్య బ్రతుకుతున్నాం. ప్రతీదానికీ పోలీస్ డిపార్టుమెంట్‌ను టార్గెట్ చేస్తారు. కానీ మన ప్రాబ్లమ్స్ ఎవరికీ అర్థం కావు.. అంటూ చిరాగ్గా.. సిఐని చూసి ‘‘క్రైం సీనులో ఎవరెవరు ఉన్నారు.. ఐడెంటిఫై చేయండి’’.
ఈలోగా మరో సిఐ ముందుకు వచ్చి ‘‘బహుశా ప్రొఫెషనల్ కిల్లరే ప్రద్యుమ్నగారిమీద వాంటెడ్లీ హత్యాప్రయత్నం చేసి ఉంటాడు.. క్రైంసీనులో నాలుగు బుల్లెట్స్ దొరికాయి’’ చెప్పాడు.
‘‘ఆ నాలుగు బుల్లెట్స్ ఒకే రివాల్వర్ నుంచి వచ్చినవా’’
ఒక్క క్షణం నీళ్లు నమిలాడు ఆ సి.ఐ.
వెంటనే ఏసిబి కులకర్ణి సీరియస్‌గా ‘‘కేసు ఇనె్వస్ట్‌గేట్ చేయడమంటే పత్రికలో పజిల్ నింపినంత ఈజీగా కాదు. నాలుగు బుల్లెట్స్‌లో ఒకటి కుడి భుజంలో ఉండిపోయింది. ఆ నాలుగు బుల్లెట్స్ ఒకే రివాల్వర్ నుండి వచ్చాయి. హంతకుడు ప్రొఫెషనల్ కిల్లర్ అయితే ‘ప్రద్యుమ్న’ ఎడమ గుండెకు గురిపెట్టి షూట్ చేస్తాడు.’’.
‘‘ప్రొఫెషనల్ కిల్లర్ అనేవాడు మిస్‌ఫైర్ చేయడు. బుల్లెట్‌లు టార్గెట్ రీచ్ అవకుండా గాలిలోకి చొచ్చుకుపోవు.. సో.. అతను ప్రొఫెషనల్ కిల్లర్ అయినా అయి ఉండకపోవాలి లేదా కావాలని మిస్‌ఫైర్ చేసి చంపే ఉద్దేశం కాక భయపెట్టే ఉద్దేశ్యంతో కుడివైపు కాల్చి ఉండాలి’’
‘‘రాత్రివేళ రివాల్వర్ పేలిన శబ్దం వినిపించలేదంటే అక్కడున్నవారిలో భయంతో అబద్ధం చెప్పి ఉండాలి లేదా రివాల్వర్‌కు సైలెన్సర్ అమర్చి ఉండాలి.. గాట్ ఇట్... ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్సైలు అలాగే చూస్తుండిపోయారు’’.
‘‘పోలీసులకు అవసరమైన క్రైం అనాలసిస్.. అందుకే డిపార్ట్‌మెంట్‌లో అంత గౌరవం.. అభిమానం’’.
ఈలోగా ఓ ఎస్‌ఐ ముందుకు వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు. అపుడే ఫ్రెష్‌గా ట్రైనింగ్ పూర్తిచేసుకొని వచ్చిన కేండిడేట్ అతను. పోలీస్ ఆఫీసర్‌గా ఏదో సాధించాలనుకునే యంగ్ ఆఫీసర్.
కులకర్ణి.. అతనివైపు చూసి.. ‘‘చెప్పండి మిస్ట్ పృధ్వీ’’ అన్నాడు.
వెంటనే పృధ్వీ అనబడే.. ఆ పోలీస్ ఆఫీసర్ స్ట్ఫిగా నిలబడి సెల్యూట్ చేసి నెత్తిమీద హ్యాట్ తీసి కిందికి వంగి.. కులకర్ణి పాదాలు తాకుతూ. ‘‘ప్లీజ్.. బ్లెస్‌మి సార్’’ అన్నాడు.
ఒక్క క్షణం.. ఆ హఠాత్పరిణామానికి నివ్వెరపోయి.. మరుక్షణంలోనే తేరుకుని.. పృధ్వీని దగ్గరకు లాక్కుని ‘గాడ్ బ్లెస్ మైబోయ్’’.. ఇన్స్‌పెక్టర్ అనేవాడు బుల్లెట్‌లా ఉండాలి. ‘పోలీస్ డిపార్ట్‌మెంట్’ అనే రివాల్వర్ ఏం చేసినా బుల్లెట్.. పోలీస్ టార్గెట్ క్రిమినల్. డోంట్ ఫర్‌గెట్. రిమెంబర్.. యు ఆర్ ఏ బుల్లెట్’’ అన్నాడు.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి