డైలీ సీరియల్

ష్...5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ థాంక్యూ సార్’’ అని ఆగి చిన్న ఇన్‌ఫర్‌మేషన్ సార్.. విత్‌అవుట్ యువర్ పర్మిషన్ అవుటాఫ్ ది వే.. ఈ కేసులో చిన్న ఇనె్వస్టిగేషన్ చేసాను..’’ అంటూ ఆగాడు.
కులకర్ణి ఏంటన్నట్లు చూసి ‘‘చట్టాన్ని కాపాడే పనిలో మనం అవుటాఫ్ ది వే వెళ్లినా ఫర్వాలేదు. ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మనం బుల్లెట్‌ను ఖర్చు చేసినా ఫర్వాలేదు’’ అన్నాడు.
‘‘వన్స్‌అగైన్ థాంక్యూ సార్’’ అంటూ కొనసాగించాడు.
‘‘హత్య జరిగిన ప్రదేశంలో ఒక స్ట్రేంజర్ ఉన్నట్లు తెలిసింది’’ అని ఒక్క క్షణం గాఢంగా నిశ్వసించి ఆ స్ట్రేంజర్ ఒక మహిళ.
ఒక క్షణం అక్కడ పిన్‌డ్రాప్ సైలెంట్. ఇద్దరు సిఐలు సైతం నివ్వెరపోయారు. ఈ విషయం వాళ్ల నోటీసులోకి రాలేదు.
కులకర్ణి.. పృధ్వీ వైపు మెచ్చుకోలుగా చూసి ‘కీపిటప్..’ ‘‘ఆ మహిళా స్ట్రేజర్ ఎవరో తెలుసుకోండి’’ అన్నాడు.
****
జె.ఆర్. హాస్పిటల్‌లో ప్రియంవద ఒకటికి పదిసార్లు అడుగుతోంది డాక్టర్స్‌ను, ప్రద్యుమ్న పరిస్థితి ఎలా ఉందని?
‘‘హి ఈజ్ అవుటాఫ్ డేంజర్’’అని డాక్టర్లు చెపుతున్నా దిగులు, టెన్షన్ తగ్గటంలేదు.
ఆ రాత్రి హాస్పిటల్ స్ట్ఫా వెళ్లిపోయాక కిరణ్మయి చెప్పింది ‘‘మేడమ్ మీరు ఇంటికి వెళ్లండి.. నేను ఉంటాను సార్ దగ్గర’’.
ప్రియంవద స్ట్ఫాను ఇంటికి వెళ్ళమని చెప్పి, ఉదయం నుంచి తనకు ఓదార్పునిస్తూ.. తోడుగా ఉన్నందుకు థాంక్స్ చెప్పింది.
కిరణ్మయి ఏదో చెప్పబోయేంతలో కిరణ్మయి మొబైల్ రింగయింది.
కిరణ్మయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది.
‘‘ఏమిటి మరదలు పిల్ల? ఎక్కడ? ఎవరితో కులుకుతున్నావు? మరో అరగంటలో ఇంటికి రాకపోతే మీ అక్కను చూడలేవు’’.
‘‘వద్దు బావా.. అక్కను ఏం చేయవద్దు. నేను వస్తాను’’ అంటూ అక్కడినుంచి వేగంగా కదిలింది కిరణ్మయి.
కిరణ్మయి ఇంట్లోకి అడుగుపెట్టేసరికి.. అంతా నిశ్శబ్దంగా వుంది. ఒక్క క్షణం భయంవేసింది. ఆ నిశ్శబ్ద శ్మశాన నిశ్శబ్దాన్ని గుర్తుచేస్తోంది.
అక్క గదిలోకి భయపడుతూ తొంగి చూసింది. లోపల మంచంమీద మోకాళ్లమీద తలపెట్టి ఏడుస్తూంది అక్క.
నాన్న చనిపోయినపుడు అమ్మను ఓదార్చిన అక్క.. అమ్మ చనిపోయినపుడు తానే అమ్మయిన అక్క.. తనకు అన్నీ తనే అయిన అక్క.. మెల్లగా వెళ్లి అక్క భుజంపై చేయి వేసింది. మెల్లగా తల పైకెత్తింది అక్క.
అశోకవనంలో సీత ఎలా వుందో తనకు తెలియదు.. రామాయణంలో చదివిందంతే..
రావణుడు చెరపట్టినా సీతమ్మ చేతిని కూడా అంటని రావణబ్రహ్మ.. రాయిలా మారిన అహల్య, బండరాయిలా తన ముందున్న అక్క.. ఏ విధి ప్రసాదించిన శాపం.. ఏ జన్మలోనిది ఈ పాపం.
అక్కా బావెక్కడ? అని అడుగబోయేంతలో వెనుక ఏదో అలికిడి అయింది. తన భుజంపై చేయి పడింది.
ఉలిక్కిపడి వెనక్కి చూసింది.
సిగరెట్ వాసన, గుట్కా వాసన కలిసి తన ముక్కు పుటాలను తాకింది. కడుపులో దేవినట్లయింది.
‘‘హీ..హీ..హీ..’’ అదోలాంటి నవ్వు, వళ్ళంతా కంపరం కల్గించే నవ్వు.
‘‘ముద్దుల మరదలా.. ఇప్పటివరకు ఎవడితో తిరిగి వస్తున్నావో తెలుసుకోవచ్చా’’.
‘‘ఆ ఒక్క మాట ఆమె అభిజాడ్యపు పొరలను ఛిద్రం చేసింది.
‘‘బావా’’ కాసింత ఉక్రోషంగా అంది కిరణ్మయి.
వెంటనే అతను భయం నటిస్తూ.. ‘‘అమ్మో నాకు భయమేస్తోంది.. ప్లీజ్ కొట్టద్దు, కొట్టద్దు’’ అంటూ భార్య దగ్గరికి వెళ్లి.. ఆమె జుత్తు పట్టి లాగి గోడకేసి కొట్టాడు.
చిన్న కేక ఆమె నోట్లోంచి వచ్చింది.
నుదురు రక్తంతో తడిసిపోయింది.
కంగారుగా కిరణ్మయి అక్క దగ్గరకి వెళ్లబోయింది. వెంటనే అతడు చేయి అడ్డంపెడుతూ ‘ష్..’’ అంటూ చూపుడు వేలును నోటికి అడ్డం పెట్టుకుని ‘‘వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా’’ అంటూ భార్య జుట్టు పట్టుకుని గది బయటికి లాక్కెళుతున్నాడు.
కిరణ్మయికి ఏడుపు తన్నుకొస్తోంది.
గభాలున వెళ్లి బావ కాళ్ళమీద పడి ఏడుపుగొంతుతో ‘‘తప్పైంది బావా.. ఇంకెప్పుడూ అలా మాట్లాడను.. అక్కనేం చేయవద్దు’’ అంటూ ప్రాధేయపడింది.
‘‘అయ్యయ్యో.. కుమారి కిరణ్మయిగారు.. మీరు ఆఫ్ట్రరాల్ ఈ వెధవకాళ్ళమీద పడటమా.. నేనెవరిని కోన్‌కిస్కా గొట్టాన్ని.. మీ అక్క అనే దేవతను చెరపట్టిన రాక్షసుడిని.. దుర్మార్గుడిని.. దుష్టుడిని.. నీచ్ కమీన్‌ని.. ఇంకా ఏవో పేర్లు ఉండాలబ్బా.. రేపు చూసి చెపుతానే.. అప్పటిదాకా చిన్న బ్రేక్’’ అంటూ భార్య పక్కనే కూచుని...
‘‘అయ్యో.. నీకెన్ని కష్టాలొచ్చాయే.. పెళ్ళామా.. నీ మొగుడు కొట్టి హింసిస్తున్నాడా? వాడిని అందమైన అమ్మాయిలు ఎత్తుకుపోను’’ అంటూ పక్కనే వున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో వున్న అయోడిన్‌ను ఆమె నుదుటిమీద ఒలికించేశాడు..
ఆమె పెద్దగా కేక వేసింది.
వెంటనే అతను ‘‘అయ్యయ్యో.. నా కళ్ళు పేలిపోను, నా నోరు పడిపోను’’ అంటూ గోడకు చతికిలపడి కళ్ళుమూసుకున్నాడు.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి