డైలీ సీరియల్

కరి మకరుల పోరు ప్రారంభం( గజేంద్రమోక్షం - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మొసలి రారాజుకు ఏనుగుల మదం కనిపించింది. బాహు బలం ఉన్నంత బలహీనులను ఇంతగా అణచివేయాలా అనుకొన్నాడు. సుఖసంతోషాలు పొందడానికి ఇతరులను ఇంతగా బాధ పెట్టాలా అనుకొన్నాడు. ఆమొసలికి ఏనుగుల గుంపుపై ఎంతో కోపం కలిగింది. ఆ ఏనుగుల గుంపు మడుగు వదలివెళ్లిపోతున్నా అందులోని మహారాజు గా ఉన్న కరిరాజు మాత్రం మడుగు వదలకుండా తన జవరాండ్రపైకి నీటిని చల్లడం, కలువలను చల్లడం చూశాడు. ఆ కరిణులను వెళ్లకుండా పట్టి ఆపుతూ మరింత వీర విహారం చేద్దాం అంటున్నట్లు మొసలి అనుకొన్నాడు. విపరీతమైన కోపం వచ్చింది మొసలికి.
ఈ అతిబలవంతులైన కరికరిణులకు బుద్ధి చెప్పాలనుకొన్నాడు. వాటికి తమ ప్రాణంపైన ఎంత తీపి ఉన్నదో మిగతా ప్రాణులకు కూడా అంతే తీపి ఉంటుందన్న సంగతి ఏనుగలకు తెలిసి వచ్చేటట్టు చేద్దామనుకొన్నాడు.
ఎక్కడ లేని కోపాన్ని తెచ్చుకున్న మొసలి గట్టిగా పూతార్కం చేశాడు. తోకను జాడించాడు. వెంటనే ఒక్క ఉదుటున పైకి లేచి దబ్బున నీళ్లలోకి దూకాడు. మడుగులో ఉన్న జలచరాలు ఇక కరికరుణులు వెళ్లిపోతున్నాయి ఇక హాయిగా ఉండవచ్చు అని అనుకోబోతున్న సమయంలో ఉన్నట్టుండి నీటిలో పెద్ద శబ్దం వచ్చింది. ఇదేమిటా అని ఆ జలచరాలు అన్నీ శబ్దం వైపుకు తిరిగాయి.
మొసలి మళ్లీ పెద్ద శబ్దం వచ్చేలా నీటిలో నుంచి పైకి ఎగిరి తిరిగి నీటిలో దూకింది. ఆ శబ్దానికి పైకి వెళ్లబోతున్న కరి తిరిగి చూసింది. అదే అదునుగా మొసలి కరి కాలును గట్టిగా తన చేతులను చాచి మరీ పట్టుకుంది. కరి అనుకోకుండానే తన కాలును విదిలించి కొట్టింది. ఆ దెబ్బకు మొసలి మడుగు వెనుక భాగంలోకి వెళ్లి పడిపోయింది. ఏదో ఉపద్రవం వస్తున్నట్టు ఉంది అనుకొంటూ కరి గబగబా పైకి వెళ్లపోతూ కూడా తననే పట్టుకొనే శక్తి ఈ జలచరాల్లో ఎవరికి ఉంటుంది అనుకొంటూ తిరిగి చూసింది.
అదిగో అపుడే పడిపోయిన మొసలి నీటి అడుగు నుంచి వచ్చి తన పదునైన కోరలతో కాలును గట్టిగా గుచ్చి పట్టుకొంది. ఆ దెబ్బకు ఏనుగు అతలాకుతలం అయింది. అయినా తన తొండాన్ని విసురుగా నీళ్లలోకి పంపి తన కాలును పట్టుకొన్న జలచరాన్ని ఈడ్చికొట్టింది. ఆ దెబ్బకు కరికాలును వదిలేసి మొసలి నీటి అడుగుకు వెళ్లింది.
తిరిగే అంతే విసురుగా పైకి ఎగబాకి ఏనుగు కాలును తిరిగి తన నోరు అంతా తెరిచి పట్టుకొంది.
ఇలా మొసలి పట్టుకోవడం, మొసలి పట్టునుంచి తప్పించుకుని మొసలిని దెబ్బతీయడం ఏనుగు చేస్తుంటే ఏనుగు దెబ్బలకు మరింత కోపాన్ని తెచ్చుకుని మొసలి తన పట్టునుంచి తప్పించుకోవడం నీ తరం కాదన్నట్టుగా మొసలి ఏనుగు కాలును పట్టుకోవడం చేయడం జరుగుతోంది.
చాలాసేపు అయినా తమ నాథుడు పైకి రావడం లేదేమిటి అనుకొంటూ ముందుకు వెళ్లిన కరిణులన్నీ తిరిగి వెనక్కు వచ్చాయి. మడుగులో జరిగే యుద్ధాన్ని చూశాయి. ఇది ఏమిటి ఏ జలచరం తమ నాథుడిని హింసిస్తోంది అని అవి నీటిలోకి తొంగి చూశాయి. వాటికి మొసలి తమ నాథుని కాలును పట్టుకోవడం కనిపించింది. కరి వీటివేటినీ చూడకుండా ఆ మొసలి పట్టును తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నించడం చూసి వాటి నవనాడులు తెగిపోయినంతగా బాధపడుతూ అక్కడే కూలబడిపోయాయి.
తమకు తెలిసిన భగవంతునికి మొరపెట్టుకొన్నాయి. వీరాధి వీరుడైన తమ గజమహారాజు వెంటనే ఆ మొసలి బారి నుంచి తప్పించుకోవాలని వేయి నోళ్లను భగవంతుడిని అర్థిస్తున్నాయి. వాటి కనుల నుంచి కన్నీరు కారసాగింది. అయ్యో ఇంత సేపటి నుంచి మొసలి పట్టు వదలడం లేదే .. ఏమి జరగబోతోంది? అని ఆ ఏనుగులన్నీ వేదన చెందుతూ తమ తొండాలను పైకి లేపి మొరబెట్టుకున్నాయి. అందులో కొన్ని ఏనుగులు తమ తొండాలను ఆసరాగా ఇస్తూ వాటిని పట్టుకుని ఆ మగుగులోని బురదను తప్పించుకుని రమ్మనిపిలుస్తున్నాయి.
రోజులు గడుస్తున్నాయి. కాని మొసలి ఏనుగు పట్టు వదలడం లేదు. ఏనుగు తన దంతాలతో మొసలిని బాధపెడుతుంటే మొసలి తన కరుకు పళ్లతో ఏనుగును బాధపెడుతోంది. ఇద్దరికిద్దరూ ఒకరిని మించిన బలం ఒకరికి ఉంది అని ఇద్దరూ పెనుగులాడుతున్నారు. కాని ఇద్దరిలో ఎవరు వారి పట్టును వదలడం లేదు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804