డైలీ సీరియల్

శత్రుత్వానికి కాఠణం పూర్వకర్మే! (గజేంద్రమోక్షం - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా వనచరియైన ఏనుగు, జలచరి యైన మొసలి ఇద్దరూ పట్టు వదలకుండా పరాక్రమం చూపించే తీరు చూసి ఇంద్రుని ఐరావతం ఆశ్చర్యపడింది. స్థాన బలం అంటే ఇదే కదా. నీటిలోని మొసలి బలానికి స్థాన బలం చేకూరింది. దానివల్లనే ఏనుగును ఇంతగా బాధపెడుతోంది. నిన్నటి దాకా అడవికి మహారాజు లాగా దివ్యవైభవాన్ని పొంది, పండ్లను, కాయలను, ఆకులను, పూవులను కోసుకొంటూ తింటూ వాటిని వెదజల్లుకొంటూ హాయిగా తిరిగిన ఏనుగు ఈనాడు తన స్థానం కాని స్థానంలో శత్రువుకు పట్టుబడిపోయింది.
అంతా మనదే అనుకున్నా, నాకే బలమని, పౌరుషమని విర్రవీగినా ఒకరోజు భగవంతుడు నీవి నీవి అనుకొన్నవేవీ నీవి కావనే నిజాన్ని ఎరుకు పరుస్తాడు కదా. ఇంతకీ వీరిద్దరి మధ్య తగవుకు ఉన్న కారణమేమై ఉంటుందో కదా. సహజంగా అయితే ఒక్కరోజు రెండురోజుల్లో ఎవరో ఒకరు పట్టు వదలి ఉండేవాళ్లు. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వేయేండ్ల కాలమూ జరిగిపోతున్నట్టుగా ఉంది. కానీ వీరిద్దరూ మటుకు తమతమ పట్టును వీడడం లేదు. దీనివెనుక బలమైన కారణమేమో ఉండి ఉంటుంది అనుకొంది.
అడవిలోని జంతువులన్నీ విచిత్రంగా చూస్తున్నాయి. కరి, మకరుల పోరు దినదినప్రవర్థమానం అవుతూనే ఉంది కానీ ఆగడం లేదు. ఇటు చూస్తే ఏనుగు అటు మొసలి రెండూ ఎంతగా పట్టుదలతో పోరాడుతున్నాయో ఇంత పోరాడాల్సిన అవసరం వీటికేమి వచ్చిందో.. ఇందులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలియడం లేదు.అనీ జంతువులన్నీ దిగాలుగా, భయంగా, ఆశ్చర్యంగా గజేంద్రుడిని, మొసలి ని చూస్తున్నాయి
***
ధర్మసూక్ష్మం చాలా గొప్పది కదా. వీరిద్దరి పోరు ఈ జన్మకు సంబంధించింది కానట్టుగా అనిపిస్తోంది. ఒక మొసలికి ఇంత పట్టు ఉంటుందా ఎక్కడైనా? ఏనుగు కూడా ఇంత పట్టుదలగా మొసలితో పోరాడుతోంది అంటే వీటి వెనుక జన్మజన్మల పోరు ఏదైనా ఉండి ఉంటుంది. లేక ఏదైనా శాపవృత్తాంతం ఉందేమో ఏ మహానుభావుని సంకల్పం వల్ల ఇలా జరుగుతోందేమో అని అక్కడున్న తాపస గణం అనుకొన్నారు.
***
గజేంద్రునిలో జవసత్వాలు తగ్గిపోయాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎందుకీ మొసలి ఇంతగా తనను బాధిస్తుందో ఏనుగుకు అవగాహనకు రాలేదు. నేను ఏ జన్మలో చేసుకొన్న కర్మయేమో నన్ను ఇంతగా బాధపెడుతోంది అనుకొన్నాడు. ఏ జన్మలో చేసుకొన్న పాపమో నన్ను దహించివేస్తోంది. ఇక నేను ఇలాగే ఉండిపోతానా.. ఇక నాకు మరణం తప్పదా అనుకొన్నాడు.
***
నేను ఏనుగుకు బుద్ధి చెప్దామనుకొన్నాను. కానీ ఈ గజరాజుకు ఎంత బలమున్నదో అని ఇంత పొగరు ఉందని అనుకోలేదు. నా తడకా చూపించితీరాలి అనుకొందో అయినా నాకెందుకీమొండితనం నేనెందుకు ఈ గజరాజును ఇంతగా పట్టుకొన్నానో.. నాకెందుకీ పట్టు వచ్చిందో తెలియడం లేదు అనుకొంటూ మరింత గట్టిగా పట్టుకొంది మొసలి గజాన్ని.
***
పూర్తిగా జవసత్వాలు ఉడిగిపోయాయి. నీరసించిపోయాడు. నిల్చుని ఉండడానికి కూడా చేతకావడం లేదు. శరీరంలోని అన్ని అవయవాలు, నరాలు పట్టుదప్పిపోతున్నాయి. కళ్లు నేలకు వాలిపోతున్నాయి. కాళ్లు చచ్చుబడిపోతున్నాయి. శరీరం అంతా వడిలిపోయింది. ఇక నేను ఈ మొసలి తో పోరాడలేను. ఏ దేవుడైనా నన్ను రక్షించకపోతాడా అని ఎదురుచూస్తున్నాను అనుకొంది.
మరికొంతసేపటికి నా కర్మ తీరడానికి, నేను చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేసి నన్ను కాపాడడానికి ఏ భగవంతుడైనా నేను పిలిస్తే వస్తాడా? అసలు భగవంతుడనేవాడు ఉంటే ఇలా జరిగేదా? నేను ఏమి చేసానని ఇంత పెద్ద శిక్ష వేసాడు దేవుడు? అయినా నా చేసిన పాపానికి కొద్ది శిక్ష వేస్తాడేమో కానీ ఇంత నా? నా ప్రాణాలు పోయేవరకు నన్ను శిక్షిస్తూనే ఉంటాడా దేవుడు? నన్ను కాపాడేవారే లేరా? అనుకొన్నాడు గజరాజు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804