డైలీ సీరియల్

ష్‌-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ క్షణం అతనికి తెలియదు.. అతని చావు.. అతి దగ్గరలోనే ఉందనీ.. భార్యను హింసించిన అతని శరీరానికి త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని..
కిరణ్మయి డాబామీదికి వెళ్లి బయట ప్రపంచాన్ని చూస్తూ వెక్కుతుంది..
కేవలం సినిమాల్లో చూసిన విలన్‌ను తన ఇంట్లో చూస్తోంది.. ఆ క్షణం అలాగే మేడమీది నుంచి అలాగే కిందికి దూకాలనిపించింది.
అలా రోడ్డుమీదుగా చూస్తూ ఒక్కక్షణం ఉలిక్కిపడింది.
ఎదురుగా రోడ్డుకవతలివైపు ఆటో ఎక్కుతూ ప్రియంవద మేడమ్..
***
జె.ఆర్. హాస్పిటల్...
ఉదయం ఎనిమిది గంటలు అవుతుండగా సులోచన వచ్చింది. నేరుగా ప్రియంవద వద్దకు వెళ్లి ‘‘మేడమ్.. మీరు ఇంటికి వెళ్లి ప్రెష్ అవ్వండి. నేను సార్ దగ్గర ఉంటాను’’ అంది.
ప్రియంవద సరే అంటూ హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని బయలుదేరింది...
****
ప్రియంవద ఇంట్లోకి అడుగుపెట్టింది. ఒక్కక్షణం ఆమెలో తెలియని భయం ప్రవేశించింది. రోజూ చూసే ఇల్లే. ఇది తన ఇల్లే.. అయినా భయం తనను చుట్టుముటేస్తోంది.. భయం ఎంత భయంకరంగా ఉంటుందో.. భయం ద్వారానే చెపుతుంది..
నిస్సత్తువగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైన వున్న తన బెడ్‌రూమ్ వైపు వెళుతోంది. ఒక్కోమెట్టు ఎక్కుతుంటే.. ఒక్కో సంఘటన ఆమె కళ్ళముందు కదలాడుతోంది. భయం కలలా కనిపిస్తోంది.. కల భ్రమలా అనిపిస్తుంది.
ఏమీ తెలియని అయోమయ పరిస్థితి. ఆ క్షణం ఆమెకు ఫ్రాయిడ్ సైకాలజీ గుర్తుకురాలేదు. తన బెడ్‌రూమ్‌లోకి నడిచింది. ఇంత పెద్ద ఇంట్లో.. ఇన్ని గదులు.. ఇంత వైశాల్యం.. ఆమె చిన్న మనసులో భయమనే విత్తనాన్ని నాటినట్టుంది.
ఒక్కొక్కటి.. అన్నీ రీ కలెక్ట్ చేసుకోసాగింది. తనకు ఫోన్ రావటం.. తనను ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించటం.. తను స్పృహ కోల్పోవటం.. భర్తకు జరిగిన ప్రమాదం. ఒక్కొక్కటీ గుర్తుకురాసాగాయి.
ఒంట్లో చిన్న ప్రకంపనం.. వేనవేల ప్రకంపనాలయ్యాయి. నుదుటిమీద గట్టిగా చేతితో రుద్దుకుంది. అసలేం జరుగుతుంది. తన జీవితంలో ఏదో మిస్సయింది. అదేమిటి..
యస్.. తన జీవితంలో మిస్సయింది.. త..నే.. ఆ ఊహే ఆమెకు భయంకరంగా ఉంది. తన జీవితంలో తను లేదా..
ఆమెకు దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది. ఓ వ్యక్తి తనను తాను మిస్సయ్యాడు.. అంటే తన జీవితంలో ‘తను’లేనన్న విషయాన్ని విస్మరించాడు..
‘షిట్’.. ఏంటి తన ఆలోచనలు ఇలా వెళుతున్నాయి. రక్తం, సిరలు, ధమనుల, ఫేషియల్స్ మన శరీరంలో వున్న ప్రతీ అవయవం భౌతికంగా ఉనికిలో వున్నపుడే కదా.. ఈ భయాలు... ఈ ఆలోచన ప్రియంవదలో అయోమయాన్ని, అర్థంకాని కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేసింది.
భర్త ప్రమాదానికి గురికావటం కాకతాళీయమా.. లేక...
ముందు తను ఫ్రెష్ అవ్వాలి. వార్డ్‌రోబ్ దగ్గరకెళ్లింది. లోపల రెండు వరుసలో చీరలు.. డ్రెస్సులు ఉన్నాయి. తను వెంటనే ఫ్రెషప్ అయి హాస్పిటల్‌కు వెళ్లాలి.
శారీని చూడగానే భర్త మాటలు గుర్తుకు వచ్చాయి.
‘‘ప్రియా.. శారీలో నువ్వు చాలా అందంగా ఉంటావు. కాదు.. కాదు.. నీకు శారీనే అందంగా ఉంటుంది.. శారీని నువ్వు కట్టుకోవడంవల్లే శారీకి అందమొస్తుంది..’’
‘‘చిత్రకారుడు కుంచెతో, బ్రష్‌తో ఒంపులు తిప్పి రంగులు వేసినట్టు.. నడుము కప్పేస్తూ... నా ముందు నడుమును, నాకు చూపిస్తూ.. పొట్టను కప్పేస్తూ.. ఆ లేత పొట్ట అందాలు చూపిస్తూ.. ఎనె్నన్ని సొబగులు.. చీర కట్టులో.. పడగ్గదిలో.. నీ చీర నా చేతుల్లో.. నా చేతులు నీ మీద నడక మొదలెట్టినపుడు.. దీనంగా నిన్ను విడిచిన నీ చీర చూపులు ఎంత ముద్దు వస్తాయో.. అచ్చం నీలా..’’
ఆ చీరను అలాగే గుండెలకు హత్తుకుని భర్త జ్ఞాపకాలు గుండెల్లో పెట్టుకుని తిరిగి వార్డ్‌రోబ్‌లో పెట్టి.. డ్రెస్ తీసి బెడ్‌మీద పెట్టింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి ప్రెషప్ అయి.. సరిగ్గా పది నిముషాల తర్వాత.. ఒంటికి టవల్ చుట్టుకుని.. డ్రెస్ తీసుకోవడానికి వచ్చి షాకైంది.
ఒక్క క్షణం తనను ఎవరో వెనక్కు నెట్టినట్లు.. ఆమె వీపు గోడను తాకింది. భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
చిన్న కేక ఆమె స్వరపేటికనుండి బయటకు వచ్చింది. బెడ్‌మీద డ్రెస్ లేదు.. డ్రెస్ ప్లేస్‌లో శారీ ఉంది.
ఒక్క క్షణం ఒళ్లు గగుర్పొడిచింది. ఆ శారీవంక చూస్తూ భయంతో ఒణికిపోయింది.
ఈ గదిలో ఇంకెవరో?
ఆలోచించటానికే భయంవేసింది. భయంతో గొంతు తడారిపోయింది.
‘‘హాల్లో ఎవరో పరుగెత్తిన చప్పుడు.. క్రమక్రమంగా ప్రియంవద స్పృహ కోల్పోతోంది..
***
హాస్పిటల్‌లో వున్న సులోచనకు భర్త దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ బటన్ నొక్కి చెప్పండి అంది.
‘‘ఏం చెప్పాలి.. అన్నం వండకుండానే పొద్దునే్న వెళ్ళావు. ఆఫీసుకు ఎలా వెళ్ళాలి?’’ కోపంగా వినిపించింది భర్త గొంతు.
‘‘మా బాస్‌కు బాగాలేదని మీకు చెప్పాను కదా’’ మెల్లిగా అన్నది సులోచన.
‘‘ఇది ఆఫీసు టైమ్ కాదు, ఓటీ కిందికి వస్తుంది. అయినా ఇపుడు.. నా లంచ్ బాక్స్ సంగతి ఏమిటి?’’

ఇంకావుంది

ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482