డైలీ సీరియల్

ష్‌...-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ ఒక్కరోజును క్యాంటీన్‌లో తినకూడదూ, భయపడుతూనే అంది’’.
అంతే నోటిని మైక్‌లా మార్చాడు.
‘‘ఏం మాట్లాడుతున్నావ్? క్యాంటీన్ పదిహేను రూపాయలు.. 100 గ్రా. బియ్యం.. 100 గ్రా. కూరగాయలు.. 50 గ్రా. పెరుగు.. ఎంత అవుతుంది? నీకసలు పొదుపుపట్ల అవగాహన లేకుండా పోతోంది’’ అంటూ మొదలెట్టి అరగంటసేపు మాట్లాడాడు.. రెండు ఫోన్స్‌కి ఫ్రీ కాబట్టి..
ఇక్కడ సులోచన భర్త సునంద్ రావు గురించి కొంత చెప్పుకోవాలి.
పొదుపునకు పరాకాష్ట అతను..
***
నిశ్శబ్దం ఎంత భయంకరంగా వుంటుందో ఆ క్షణం తెలిసి వచ్చింది కులకర్ణికి.
తలుపు ముందు నిలబడి డోర్ బెల్ ప్రెస్ చేశాడు. ఇంటికి తిరిగి వచ్చేటపుడు ఉండే గొప్ప ఫీల్.. డోర్ బెల్ శబ్దం.. చెవికి చేరకముందే.. తలుపు తెరచి తన తలపుల్లోకివచ్చే తన బెటారాఫ్.. అతనికి క్షణాలు కూడా మెల్లిగా నడుస్తున్నట్లు అనిపించాయి.
ఇంకా రాదే.. తలుపు తీయదే.. తనని చుట్టేసి మలయమారుతాన్ని చల్లగా గాలితో కలిపి, చుట్టేయదే...
ఒక్క క్షణం అతని మనసు కీడును శంకించింది.
తన ప్రాణానికి ఏమీ కాలేదు కదా! భయంతో.. అతను మరింత గట్టిగా డోర్ బెల్ ప్రెస్ చేశాడు.
అప్పుడు.. అప్పుడు గుర్తొచ్చింది.. అప్పుడప్పుడూ అతని కంటే ఆకాశంలో కన్నీటి మేఘం కనురెప్పల మధ్య కుంభవృష్టిని కురిపించింది. తన మది గది తెరచి తన తలపు కిటికీ తీసి శూన్యమైన తన జీవితాన్ని చూసుకున్నాడు.
లోపలికి అడుగుపెట్టాడు. తననే చూస్తూ.. తన భార్య.. చిరునవ్వుతో.. చిరుచెమటను కొంగుతో తుడుచుకుంటూ, భర్తకు ఎదురు వచ్చిన భార్య. ఒక్కో అడుగు వేస్తూ, ఒక్కో జ్ఞాపకాన్ని పిలుస్తూ, ఒక్కో కన్నీటి నేస్తానికి వీడ్కోలు చెబుతూ...
కిచెన్‌లోకి తొంగి చూసాడు. వంట చేస్తున్న తన భార్యను వెనుకనుంచి తను చుట్టేసినపుడు.. ముద్దుగాముందుకు తిరిగి తన తలపై చేయివేసి జుట్టు చెరిపేస్తూ..
‘‘ఎంత అందమైన జట్టు’’ అంటూ తలను తన గుండెకు చేర్చి తపనను తన స్పర్శకు అంకితం చేస్తూ...’’
తల విదిల్చి పడగ్గదిలోకి నడిచాడు.
తమ అంతరంగిక సామ్రాజ్యం.. తనను ఇష్టంతో అరెస్టుచేసే కౌగిలి.. పెదవుల వారెంట్.. యావజ్జీవ ఆలింగనమే శిక్ష... అందమైన ఇష్టమైన శిక్ష..
ఇప్పుడేమైందీ శిక్ష?
ఆ ఇంట్లో ప్రతి అంగుళం భార్య జ్ఞాపకమే.. ఆ జ్ఞాపకం నుంచి తను పారిపోగలడా?
రాటుదేలిన ఆ పోలీసు శరీరంలో గాయపడ్డ హృదయ శకలాలు మరింత గాయపరుస్తున్నాయి.
***
జె.ఆర్. హాస్పిటల్..
కిరణ్మయి ఆటో దిగి హాస్పిటల్‌కు వచ్చింది. వస్తూనే.. సులోచననడిగింది.. ‘‘సర్‌కు ఎలా ఉంది? మేడమ్ వెళ్లిపోయారా?’’
సులోచన చెప్పింది.. ‘‘మేడమ్ ప్రెషప్ అయి వస్తారని చెప్పారు. ఇంతవరకు రాలేదు. మా ఆయన ఫోన్ చేసి చిత్రలహరి వినిపించాడు..’’
వెంటనే కిరణ్మయి నవ్వి ‘‘బహుశా ఇరవై ఏళ్ళ క్రితం వాళ్ళింట్లో.. మీరు కోరిన పాటలు వినిపించేవారేమో’’.
సులోచన చిన్నగా నవ్వి ‘‘అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం తన పేరు సునందారావు కావటమే. నీకో విషయం తెలుసా.. మా పస్ట్‌నైట్ రోజు పెట్టిన యాపిల్స్ అన్నీ తీసేసి ఫ్రిజ్‌లో పెట్టి.. మరసటి రోజుతెలిసిన షాప్‌లో అమ్మేసాడని ఒక టాక్. ఆయనది పొదుపో.. పిసినారితనమో అర్థం కాదు. పువ్వులు తెమ్మంటే అందులో చవక ఏవో అవి తెచ్చేవాడు. మరో చిత్రమైన విషయమేమిటంటే.. కిరణ్మరుూ.. బంతిపూలు తెచ్చిన నా తల్లో తురిమిమేవాడు..’’ కాసింత నిర్లిప్తంగా చెప్పింది.
కిరణ్మయి ఓదార్పుగా సులోచన భుజంపై చేయివేసి ‘‘మీ ఆయనకు డబ్బంటే విపరీతమైన యావ ఉంది’’
ఆ యావ ‘దానిమీద’వుంటే బాగుండేదని స్వగతంగా అనుకుంది సులోచన.
‘‘ఎవరో ఆఫ్‌నాలెడ్జి సెక్సాలజిస్ట్ రొమాన్స్‌లో క్యాలరీలు ఖర్చు అవుతాయంటే.. ‘దానికి’ దూరంగా ఉన్నానని చెప్పాడు. ఆ క్షణం దిండుకు తల బాదుకోవాలనిపించింది. ఇలాంటి విచిత్రాలకు కేరాఫ్ సునందరావ్’’చెప్పింది సులోచన.
హాస్పిటల్ ముందు పోలీస్ కారాగింది. ఏసిబి కులకర్ణి లోపలికి వచ్చాడు. వస్తూనే కిరణ్మయి వైపు చూసి పలకరింపుగా నవ్వాడు.
‘‘మేడమ్ రాలేదా’’ అడిగాడు.
‘‘లేదు సార్.. ఈపాటికి వచ్చేస్తూ ఉండాలి’’.
అప్పుడే కిరణ్మయి చేతిలో మొబైల్ రింగైంది.
‘‘ఓకె’’ బటన్ నొక్కి ‘హలో’ అని వెంటనే ‘అలాగా’.. సరే.. నేను వచ్చేస్తున్నానని మొబైల్ ఆఫ్ చేసి.. కులకర్ణి వైపు తిరిగి ‘‘సార్.. ప్రియంవద మేడమ్ బెడ్‌రూమ్‌లో స్పృహ తప్పిపడిపోయారట.. వాళ్ళింట్లో పనిమనిషి ఫోన్ చేసి చెప్పింది..’’ అంటూ చెప్పింది కిరణ్మయి.
కులకర్ణి వెంటనే ‘‘పదండి, నేను వస్తాను’’ అని అప్పుడే అక్కడికి వచ్చిన డ్యూటీ డాక్టర్‌ను చూసి ప్రద్యుమ్న పొజిషన్ ఎలా ఉందని అడిగారు. ‘‘అవుటాఫ్ డేంజర్ సార్.. వన్ అవర్ తర్వాత మీరెళ్ళి చూడవచ్చు..’’ అన్నాడు.

ఇంకావుంది

ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482