డైలీ సీరియల్

సుదర్శనం .. మోక్ష కారకం! ( గజేంద్రమోక్షం - 6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారితోపాటు తాపసులు, సిద్ధులు, సాధ్యులు, వైకుంఠంలో నారాయణ దర్శనం కోరి వచ్చిన నారదాదులు, తాపసగణాలు దేవ గణాలు ఇదేమిటి ఇట్లా లక్ష్మీనారాయణులు వెళ్లిపోతున్నారు. ఏ భక్తుని ఆర్తి విన్నారో ఏమో అనుకొంటూ లక్ష్మీనారాయణుల వెంట నడిచారు.
***
నిలువుగా మోర ఎత్తి ‘‘నన్ను కాపాడ వేగ రావా స్వామీ’’అంటూ ఎలుగెత్తి అరుస్తూన్న గజేంద్రుడున్న మడుగు దగ్గరకు వెళ్లారు. శ్రీమన్నారాయణుడు తన చేయ చాపగానే శంఖు నారాయణుని చేతికి అలంకారం అయంది. వెంటనే పాంచజన్యాన్ని పూరించాడు. వెనువెంటనే తన చేతిలో ఆయుధంగా కుదురుకున్న చక్రాన్ని అతివేగంగా మొసలి కంఠాన్ని తెగ నరకమని విసిరేశాడు. చక్రం అల్లకల్లోలంగా ఉన్న మడుగులోని గజేంద్రుని కాలును పట్టుకొని ఉన్న మొసలి కంఠాన్ని తెగనరికివేసింది. మడుగు అంతా ఎర్ర కలువలు విచ్చుకున్నట్లుగా నీళ్లన్నీ ఎర్రగామారాయి.
అద్భుతం జరిగిపోయింది. తన కాలును పట్టి పీడిస్తున్న పట్టు వదలిపోయింది. స్వేచ్ఛగా హాయిగా కాలు కదపగలుగుతున్నాను అనుకొని కాలును గజేంద్రుడు ముందుకు వెనకకు కదలించాడు. స్వేచ్ఛగా ఉంది హాయిగా ఉంది. నన్ను ఆ భగవంతుడు రక్షించాడు అనుకొంటూ గట్టు పైకి వచ్చేసింది.
అక్కడే తమ నాథుడు పడుతున్న అవస్థను చూసున్న ఆడ ఏనుగులన్నీ ఆనంద భాష్పాలు కారుస్తూ గజేంద్రుని దగ్గరగా వచ్చాయి. ఎంతో ప్రేమతో ఒకరిని ఒకరు స్పృశించుకున్నారు. గజేంద్రుడు కూడా తన తొండంతో వాటినన్ననింటినీ స్పృశించి తన ఆనందాన్ని వాటికి ఎరుక పర్చాడు. కష్ట కాలం తప్పిపోయింది. ఇక అంతా మంచి కాలమే అని కనులతోనేవాటికి తెలియపర్చాడు.
***
మహావిష్ణువు చక్రం ఎపుడైతే కంఠాన్ని తాకిందో అప్పటివరకు అలుముకుని ఉన్న అజ్ఞానం నాశనమైంది. దేవలముని ఇచ్చిన శాపం నుంచి విముక్తి లభించింది. ఆ మొసలి రూపాన్ని వదిలివేసి తన అసలైన నిజరూపాన్ని పొందిన హూహూ గంధర్వుడు తన ఎదురుగా కనిపించిన లక్ష్మీదేవి సహిత శ్రీమన్నారాయణుని చూసి ఓ భగవంతుడా! దేవాదిదేవా! భక్త వరదా! ఇదిగో నా నమస్కారం. నన్నీ విషవలయం నుంచి తప్పించావు స్వామీ ఇక ఎన్నడూ తప్పులు చేయకుండా నీవే నన్ను కాపాడుము అంటూ మరొక నమస్కారం చేసి గంధర్వలోకానికి వెళ్లిపోయాడు.
***
తనను కాపాడటానికి వైకుంఠం నుంచి వచ్చిన మహావిష్ణువును చూసి ఆనందంతో తన ఎదుట ఉన్న పూపొదరిళ్లను నుంచి తన తొండంతో పూలను తెంపి ఆ నారాయణుని పాదపద్మాలకు అర్పించడానికి ముందుకు వచ్చిన గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు తన చేతిలో స్పృశించాడు. దేవతలకే దేవుడైన ఆ నారాయణుని కర స్పర్శ చేత ఏనుగులో ఉన్నఅజ్ఞానం నశించింది. పూర్వజన్మ స్మృతి కలిగింది. తన కేవిధంగా ఈ ఏనుగు రూపం వచ్చిందో కనబడింది. ‘‘వాసుదేవా! నారాయణా! వైకుంఠనాథా! లక్ష్మీవల్లభా! ఘనచరిత్ర కలవాడా! భక్తులను కాపాడడానికి ఏ అవతారాన్ని ఐనా సునాయాసంగా దాల్చేవాడా! నన్ను నన్ను కాపాడడానికే నీవే దిగి వచ్చావా స్వామీ అంటూ పూర్వ రూపాన్ని సంతరించకున్న ఇంద్రద్యుమ్న మహారాజు పదేపదే నమస్కారాలు చేశాడు. అప్పటి వరకు ఏనుగుల రూపంలోనే ఉన్న ఇంద్రద్యుమ్న పరివారం అంతా కూడా పూర్వ రూపాలను సంతరించుకున్నారు. విష్ణు స్పర్శతో జ్ఞానోపదేశం పొందిన ఇంద్రద్యుమ్నుడు తనను కాపాడిన శ్రీ మహావిష్ణువును పదేపదే నమస్కరించి తిరిగి ధ్యానపరుడయ్యాడు.
అందరికీ సంతోషాన్నిచ్చిన నారాయణుడు తన చేతిలోని లక్ష్మీదేవి చీర చెంగును వదిలి, ఓ ప్రియురాలా! నీ చీర చెంగు వదలకుండా నేను వేగంగా ఎటు వెళ్లిపోతున్నానేమో అనుకొంటూ నీవు వేగంగా వచ్చేశావా.. నేను నా భక్తులు వెతలను పడుతూ ఉంటే వారి వేదనను విని కూర్చోలేను. అందుకే వారి బాధలు పోగొట్ట వారిని స్వస్థులను చేయడానికి లిప్తకాలమైనా వృథా కానివ్వకుండా వారిచెంత నిలుస్తాను సుమా అన్నాడు.
స్వామీ మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. కనుక నే మీ అడుగులో అడుగునై నీ ఛాయలాగా వచ్చేశాను. మిమ్ములను మెప్పించిన మీ భక్తులను నేను వారిని ఆశీర్వదిస్తాను. అచిరకాలం సుఖ సంతోషాలతో జీవింపమని దీవిస్తాను. ఇలా వీరిద్దరూ మీ భక్తులై పలువురకూ ఆదర్శమూర్తులై ఉంటారు అంది లక్ష్మీదేవి.
ఈ కథను విన్నవారికి కూడా సకల శుభాలుకలుగుతాయని తాపస గణం దీవించారు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804