డైలీ సీరియల్

ష్‌...-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్థ్యంక్యూ డాక్టర్’’ అని కిరణ్మయి వైపు చూసి ‘‘మనం వెళ్దాం పదండి’’ అన్నాడు.
సులోచన అక్కడే ఉండిపోయింది.
కిరణ్మయి, కులకర్ణి బయటికి వెళుతున్నపుడు డ్యూటీ డాక్టర్ ప్రద్యుమ్న గదిలోకి వెళుతున్నాడు.
అతని చేతిలో ‘పాయిజన్’ ఇంజెక్షన్ వుంది...
* * *
ఏసిబి కులకర్ణి, కిరణ్మయి.. ప్రియంవద గదిలోకి అడుగుపెట్టారు.
పనిమనిషి, మరో ఇద్దరు పనివాళ్ళు చేతులు కట్టుకుని ఉన్నారు.
‘‘ఏమైంది’’ పనిమనిషిని చూస్తూ అడిగాడు కులకర్ణి.
‘‘పొద్దునే వచ్చి అమ్మగారి గది శుభ్రంచేద్దామని వచ్చేసరికి నేలమీద పడిపోయి ఉన్నారు.. భయంవేసి కిరణ్మయి మేడమ్‌కి ఫోన్ చేశానని’’ చెప్పింది పనిమనిషి.
ఏసిబి కులకర్ణి ఆమె వైపు పరిశీలనగా చూసి, సర్వెంట్స్ వైపు తిరిగి.. ‘‘మీరెప్పుడు వచ్చారు?’’ అని అడిగాడు.
వారిలో ఒకడు ‘‘ఇందాకే వచ్చాం సార్’’ అని చెప్పాడు.
కిరణ్మయి ఫ్రిజ్‌లోని చల్లని వాటర్ తీసుకు వచ్చి ప్రియంవద మీద చల్లింది.
బరువుగా కళ్ళు తెరిచింది ప్రియంవద. ఎదురుగా ఏసిబిని, కిరణ్మయిని, పనివారిని చూసి ఉదయం జరిగినదంతా కలెక్ట్ చేసుకుంది.
‘‘ఏమైంది ప్రియంవదగారు? వాట్ హేపెండ్? ఆర్ యూ ఆల్‌రైట్ అని కులకర్ణి అడిగాడు.
ప్రియంవద చేతులతో కణతలు నొక్కుకుంటూ భయం భయంగా బెడ్‌మీదికి చూసింది. తర్వాత కంగారుగా తనవైపు చూసుకుంది. షాకైంది. బెడ్‌మీద డ్రెస్ వుంది. అంతకన్నా మరోషాక్.. తను నైటీలో ఉంది.. ఏం చెప్పాలో అర్థం కాలేదు? ఏమని చెప్పాలి?
బెడ్‌మీద డ్రెస్ బదులు శారీ ఉందని చెప్పాలా? చెపితే ఇపుడు కనిపిస్తున్న డ్రెస్ సంగతేంటి? అంతకన్నా మరో ఎంబరాసింగ్ ఏమిటంటే తన ఒంటిమీద నైటీ ఉండడం. ఒక మగాడితో ఆ విషయం ఎలా చెప్పటం? అంతకన్నా భయం, సిగ్గు కలిగించే విషయం.. తన ఒంటిమీదకు నైటీ రావటం.. తన శరీరంపైన టవల్‌ను తీసి... ఆ తర్వాత ఆమెకు ఆలోచించటానికి.. ఆమెకు భయం వేసింది, అంతకన్నా సిగ్గేసింది.
ఏసిబి కులకర్ణికి కొంత అర్థమైంది.. మరికొంత అర్థం కావాల్సి వుంది.
‘‘ఓకె.. ప్రియంవదగారు.. బహుశా మీరు నిన్నటినుండి ఏమీ తినకపోవడంవల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. కాస్త రెస్ట్ తీసుకోండి. ప్రద్యుమ్నగారు ఓకె.. మనం వెళ్లి చూడవచ్చు. నేను హాస్పిటల్‌కు వెళతాను. మీరు, కిరణ్మయి కలిసి కాసేపాగి వచ్చేయండి’’ అని కిరణ్మయి వైపు చూసి ‘‘ప్లీజ్ టేక్ కేర్ హర్’’అని ప్రియంవదను చూపి బయటకు నడిచాడు.
ముగ్గురు సర్వెంట్స్‌ని బయటికి రమ్మన్నాడు కులకర్ణి.
ఆ ముగ్గురు సర్వెంట్స్‌లో ఒకావిడవైపు చూసి ‘నీ పేరేమిటి’ అని అడిగాడు.
ఆవిడ భయంతో చేతులు కట్టుకుని ‘పైడితల్లి’ అని చెప్పింది.
‘‘మీ ముగ్గురు ఎనే్నళ్లనుంచి పనిచేస్తున్నారు?’’
‘‘దాదాపుగా ఐదేళ్ళుగా’’ చెప్పారు ముగ్గురు.
కులకర్ణి బయటకి నడిచాడు. పైడితల్లి కులకర్ణి వైపే చూస్తూండిపోయింది.
ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది. ఆ గదిలో ఇద్దరే కిరణ్మయి, ప్రియంవద. మూడవ వ్యక్తి వున్నట్లుగా.. ప్రియంవదకు చిన్న అనుమానం.
ఆ అనుమానం నిజం చేస్తున్నట్టుగానో, యాదృచ్ఛికమో.. ఓ నీడ.. తన గది కిటికిలో నుండి నీడ కనిపిస్తోంది.
ప్రియంవద ఒక్క ఉదుటన లేచి.. తలుపు తీసి... వరండాలో ఎవరైనా ఉన్నారేమోనని చూసింది. ఎవరూ లేరు.. ‘షిట్’ మళ్లీ ఇది తన భ్రమేనా.. వెనక్కు వచ్చేసి బెడ్‌రూమ్ తలుపు వేసింది..
కిరణ్మయి అంతా గమనిస్తూనే ఉంది..
మేడమ్ ఏదో టెన్షన్‌లో వున్నట్టు అర్థం అవుతుంది.. కానీ, అడగటానికి చిన్న సంకోచం..
ఆమె ఫీలింగ్స్‌ను షేర్ చేసుకుందామని, ఆమె దగ్గరగా కూచుంది.
ప్రియంవద.. కిరణ్మయి వైపు చూసింది. ఆ చూపులో బేలతనం ఉంది.
కిరణ్మయి చూపులో.. ‘మీ కభ్యంతరం లేకపోతే చెప్పండి మేడమ్..’ అన్న కన్‌సర్న్ ఫీలింగ్ ఉంది.
‘‘చెప్పండి మేడమ్.. ఎనీ ప్రాబ్లమ్.. మీకేమైనా సాయపడగలనా’’ అని అడిగింది కిరణ్మయి.
చెప్పటం మొదలుపెట్టింది ప్రియంవద.
‘‘కిరణ్మరుూ.. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావటంలేదు. పదిహేను రోజులనుంచి నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ల్యాండ్‌ఫోన్‌కు, నా మొబైల్‌కు ఏవేవో ఫోన్‌కాల్స్... ఆ కాల్స్ రిసీవ్ చేసుకునేలోగా కట్ చేస్తున్నారు.. గది తలుపులు అన్నీ వేసుకుని పడుకున్నా.. తెల్లవారేప్పటికి తలుపులు తెరిచి ఉండటమూ జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం మెయిన్ హాల్ డోర్ లాక్ చేసి, నా బెడ్ రూమ్ లాక్ చేసుకుని డ్రెస్సా, శారీనా.. ఏది వేసుకుందామని.. డ్రెస్ సెలక్ట్ చేసి బెడ్‌పై పెట్టి స్నానానికి వెళ్లాను.
ఇంకావుంది

ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482