డైలీ సీరియల్

ష్‌...-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నానం చేసి వచ్చి చూసేసరికి బెడ్‌మీద డ్రెస్ బదులు శారీ ఉంది.’’
ఆమె గాఢంగా నిట్టూర్చి. తిరిగి కొనసాగించింది.
‘‘తలుపులన్నీ వేసి ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యం?.. మరొక షాక్ ఏమిటంటే.. నా ఒంటిపై టవల్ మాత్రమే ఉంది.. ఇపుడు నైటీ ఉంది.. అంటే.. ఎవరో నాకు నైటీ మార్చారు... నన్ను.. నన్ను.. ప్రద్యుమ్న తప్ప.. ఎవ్వరూ నన్నలా చూడటం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే సిగ్గుగా ఉంది, భయంగా ఉంది. మరోవైపు ప్రద్యుమ్నపై హత్యాప్రయత్నం జరిగింది. ఇవి ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావటంలేదు.. ఒంటరిగా ఉంటాను.. అపుడపుడు నామీద నాకే అనుమానంగా ఉంది’’.
ఒక్క క్షణం కిరణ్మయి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇదంతా క్రైం థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తోంది.. ప్రియంవద వైపు చూసింది.
ఆమె ముఖంలో భయం, కన్‌ఫ్యూజన్ రెండూ కనిపిస్తున్నాయి.
‘‘మీరేమీ భయపడకండి మేడమ్, ప్రతీ సమస్యకు ఓ సొల్యూషన్ ఉంటుంది. ముందు మనం హాస్పిటల్‌కు వెళదాం..’’ అని లేచి ఒక్క క్షణం ప్రియంవదను చూసి ‘‘ఒక్కటి గుర్తుంచుకోండి మేడమ్.. సారన్నా, మీరన్నా.. నాకు అభిమానం...
మీకు ఉడతాసాయం చేయటానికి ఈ కిరణ్మయి మీ వెంట ఉంటుంది’’అని చెప్పింది.
ఇద్దరూ హాస్పిటల్‌కు బయలుదేరారు.
కిరణ్మయి, ప్రియంవద బయటికి వెళ్ళాక, వాళ్ళిద్దరూ గేటు దాటారనే విషయం కన్‌ఫర్మ్ చేసుకున్నాక పైడితల్లి ప్రియంవద గదిలోకి వెళ్లి, బాత్‌రూమ్‌లోకి వెళ్లి, బాత్‌టబ్ అడుగునవున్న చిన్న ఇనుప తీగను.. చేతికి బ్లౌజు తొడుక్కుని.. దాన్ని జాగ్రత్తగా బయటికి తీసింది. తర్వాత తనచేతిలోని సెల్‌ఫోన్ నెంబర్లలో ఓ నెంబర్ నొక్కి మాట్లాడింది.
‘‘టార్గెట్ జస్ట్ మిస్ అయింది. ఈ శర్మిష్టి బుల్లెట్ ఎప్పుడూ వేస్ట్ అవ్వదు’’ అని ఫోన్ కట్ చేసింది. పైడితల్లి ఉరఫ్ శర్మిష్టి సిబిఐ ఆఫీసర్..
***
హాస్పిటల్..
డాక్టరు గదిలోకి ప్రవేశించాడు. ప్రద్యుమ్న పడుకుని ఉన్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. డాక్టరు కనుచూపు చివరలనుంచి గమనిస్తున్నాడు. నర్సు అప్పుడే బయటికి వెళ్లింది. డోర్ లాక్ చేశాడు లోపలి వైపునుంచి..
ఒక్కో అడుగు వేస్తూ ప్రద్యుమ్న వైపు రాసాగాడు. అతని చేతిలో పాయిజన్ ఇంజెక్షన్ ఏ క్షణంలోనైనా ప్రద్యుమ్న శరీరంలోకి దిగటానికి రెడీగావుంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గింది.. ప్రద్యుమ్నను సమీపించాడు.
***
ప్రియంవద, కిరణ్మయి హాస్పిటల్‌లోకి అడుగుపెట్టారు. కిరణ్మయి కళ్ళు కులకర్ణిని వెతుకున్నాయి.
తనకన్నా ముందే వస్తానన్న ఏసిబి ఇంకా రాకపోవటాన్ని ఆమెకు ఆశ్చర్యంతో పాటు అనుమానాన్ని కలిగిస్తోంది. ఆమె సిక్త్‌సెన్స్ ఏదో ప్రమాదం జరగబోతోందని హెచ్చరిస్తోంది.
సులోచన ఎదురొచ్చి ప్రియంవదను పలకరించింది.
‘‘ఏసిబి సార్ రాలేదా’’ అని అడిగింది కిరణ్మయి సులోచనను.
‘‘రాలేదు’’అని చెప్పింది సులోచన.
కిరణ్మయి ఆలోచనలో పడింది.
***
డాక్టరుకు ప్రద్యుమ్నకు మధ్య కేవలం మూడడగుల దూరం ఉంది. ఎప్పుడో కొన్ని గంటల క్రితం చేయాల్సిన పని.
తనకు ఫోన్ రావటం, ఆ తర్వాత నర్సు వచ్చి డ్రెస్సింగ్ చేయటం.. ఇలా ఆలస్యమవుతోంది. అందరూ వెళ్ళేసరికి నర్సును మెడిసిన్ కోసం పంపేసరికి ఈ టైం అయింది.
ఇప్పుడే తనకి విపరీతమైన టెన్షన్‌గా వుంది. తన టార్గెట్ ఏమాత్రం మిస్ అయినా చీఫ్ తనను బతకనివ్వడు. అతని చేతిలో పాయిజన్ ఏ క్షణమైనా ప్రద్యుమ్న శరీరంలోని నరనరాల్లోకి రక్తనాళాల్లోకి చొచ్చుకుపోవటానికి డేంజర్ సిగ్నల్ ఆపరేషన్ థియేటర్ బయట రెడ్‌లైట్‌లా వెలుగుతోంది. ప్రతీ నేరానికి ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్‌కు ఎలిబి ఉంటుంది.
‘తీ.. టూ.. ఒన్.. పాయిజన్ ఇంజెక్షన్‌కు, ప్రద్యుమ్న శరీరానికి.. దూరం, దూరమవుతూ అతని శరీరాన్ని నీడిల్ టచ్ చేసింది డాక్టర్. బొటనవేలు పాయిజన్ ఇంజెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. డాక్టరు ముఖమంతా చెమటతోతడిసిపోయింది. ప్రద్యుమ్న కళ్ళు తెరిచాడు.
‘‘యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ కపర్ది.. సారీ డాక్టర్ కపర్ది’’.. ప్రద్యుమ్న బెడ్ వెనుక వున్న గ్రీన్ కర్టెన్ తొలగించి వచ్చాడు.. ఏసిబి కులకర్ణి..
పిన్‌డ్రాప్ సైలెన్స్...
‘‘నేరమంటే ఎల్‌కేజి స్కూల్‌లో చదివే లెసన్ కాదు మిస్టర్ కపర్ది. ఆల్ఫాబెట్ రాగానే సెంటెన్స్ చెప్పేయచ్చు. కానీ డాక్టరు ముసుగులో డెత్ సెంటెన్స్ చెప్పటం అంత ఈజీ కాదు. 2012లో ఈ హాస్పిటల్‌లో చేరి 2013లో ఒక నేరంలో పాలు పంచుకొని డబ్బుతో మేనేజ్ చేయటం ఈజీ కాదు’’ చెప్పాడు కులకర్ణి, డాక్టర్ వైపుచూస్తూ.
డాక్టరు కపర్ది ముఖంలో నెత్తురుచుక్క లేదు.
కళ్ళు తెరిచిన ప్రద్యుమ్న వైపు చూస్తూ.. తిరిగి ఏసిబి వైపు చూస్తూ ‘‘ఎస్.. మిస్టర్ ఏసిబి.. అందుకే నా డెత్ సెంటెన్స్‌ను నేనే ఈజీగా రాసుకుంటున్నాను.. బై.. బై.. గుడ్‌బై’’ అంటూ ప్రద్యుమ్న వైపు టార్గెట్ చేసిన ఇంజెక్షన్‌ను తన చేతికి గుచ్చుకున్నాడు.
క్షణాల్లో అతని నోట్లో నుంచి నురుగు. డబ్బుకోసం నేరస్థులతో చేతులు కలిపినందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు.
వితిన్ సెకెండ్స్‌లో ఆ గదిలోనున్న మరో తలుపు నుంచి మఫ్టీలో వున్న పోలీసులు మృతుడి శరీరాన్ని తీసుకెళ్లారు.
అక్కడి సీన్ ఇపుడు చాలా క్యాజువల్‌గా వుంది. ప్రద్యుమ్న నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. - ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482