డైలీ సీరియల్

ష్‌...-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందాక హాస్పిటల్‌లో రిమోట్ కారుతో పేల్చడానికి ట్రై చేసిన వృద్ధుడు. బుల్లెట్స్ అతని శరీరాన్ని ఛిద్రం చేశాయి. పెట్టుడు గడ్డం బయటపడింది.
క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది.
కులకర్ణి షాకయ్యాడు.
చనిపోయిన వ్యక్తి వయస్సు ముప్ఫై, నలభై మధ్య వుంటుంది. శరీరంలో ఆరు బుల్లెట్స్ దిగబడ్డాయి. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి కాల్చినట్లుగా తెలుస్తుంది.
క్రైం సీనులో రివాల్వర్ లేదు. చుట్టుప్రక్కల వాళ్ళకు రివాల్వర్ పేలే శబ్దం వినిపించలేదు. అంటే రివాల్వర్‌కు సైలెన్సర్ అమర్చారు. ఇది అంతా ఓ మిస్టరీలా అనిపిస్తోంది.
ఎంత తెలివైన పోలీస్ ఆఫీసర్ కూడా ఒక విషయాన్ని విస్మరించాడు.. అపరిచితుడి శరీరంలోని బుల్లెట్, ప్రద్యుమ్న భుజంలో దిగబడ్డ బుల్లెట్ ఒకటేనన్న విషయాన్ని..
ప్రియంవద ఇంటికి వచ్చింది. హాస్పిటల్‌లో జరిగిన సంఘటనతో భయపడిపోయింది. దానికితోడు తలనొప్పి.. కిరణ్మయి వెంట వస్తానన్నా వద్దని వినకుండా.. ఒక గంటలో వస్తానని ఇంటికి వచ్చింది.
సరాసరి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసి బెడ్‌మీద రిలాక్స్ అయింది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు దిగ్గున లేచి.. టీపాయ్‌మీద వున్న తన హేండ్‌బ్యాగ్ తీసుకుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్ తీయబోతుండగా.. బెడ్‌రూమ్ తలుపుమీద ఎవరో తట్టిన శబ్దం. హ్యాండ్ బ్యాగ్‌ను బెడ్‌మీద వేసి దాని మీద బెడ్‌షీట్ కప్పి తలుపు తీసింది.
పైడితల్లి కాఫీ కప్పుతో నిలబడి వుంది. పైడితల్లి కాఫీ కప్పు అక్కడ పెట్టి ఆ గది వంక పరిశీలనగా చూసింది. ఆమె దృష్టి బెడ్‌షీట్‌మీద పడింది.
ప్రియంవద పైడితల్లి వంక చూస్తూ ఇక వెళ్ళు అంది.
పైడితల్లి కామ్‌గా వెళ్లిపోయింది.
ప్రియంవద తలుపేసి బెడ్‌షీట్ పక్కన పెట్టి హ్యాండ్ బ్యాగ్‌లోనుంచి ఒక వస్తువు తీసింది. అది రివాల్వర్. దాన్ని పరుపు కింద దాచింది.
వెంటనే కిరణ్మయి ఫోన్ చేసి ‘‘నువ్వు అర్జంట్‌గా ఇంటికి రావాలి. నాకు భయంగా వుంది. నన్ను చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. నా బెడ్‌రూమ్‌లో ఒక రివాల్వర్ కూడా దొరికింది. ప్లీజ్ వెంటనే వచ్చేయ్. అదిగో నా గది బయట ఎవరో తచ్చాడుతున్నారు.. ప్లీజ్’’ అంటూ మొబైల్ ఆఫ్ చేసింది.
ఆ క్షణం ఆమె కనుగుడ్లు గుండ్రంగా తిరిగాయి. ఆమె పెదవులపై నవ్వుని చూసుంటే.. వాళ్ళ వళ్ళు గగుర్పొడిచేది. ఆ క్షణం ఆమె ఒక సైకోలా కనిపిస్తోంది.
ఇవి ఏవీ తెలియని కిరణ్మయి మృత్యుకుహరంలోకి ప్రవేశిస్తున్నట్లుగా బయలుదేరింది.
కిరణ్మయి.. ప్రియంవద హస్పిటల్‌కు రావటంతో, ప్రియంవద మేడమ్ కాసేపు మాట్లాడాక ఇంటికి బయలుదేరింది సులోచన.
భయపడుతూనే ఇంట్లోకి అడుగుపెట్టింది.
‘‘ప్రజాసేవా కార్యక్రమాలు పూర్తయ్యాయా మేడమ్‌గారికి..’’ అడిగాడు భర్త సునందారావు పేపరు తిరగేస్తూ.
అతను కూచున్న సోఫాలో పేపర్లు చిందర వందరగా పడి వున్నాయి.
ఆ పేపర్లు కూడా పక్కింటి వాళ్ళవి.
వాళ్ళు ఉదయం చదివి పక్కన పడేసాక, సాయంత్రం ఆఫీసునుంచి రాగానే తెచ్చుకొని చదువుకుంటాడు.
సులోచన ఎన్నోసార్లు చెప్పి చూసింది ‘‘పేపరు తెప్పించుకోవచ్చు కదా.. నెలకెంతవుతుందీ.. మహా అయితే వంద రూపాయలు.. ఇలా ప్రతిరోజూ పక్కింటి వాళ్ళను అడగకపోతే’’అని.
‘‘అయితే మాత్రం వందరూపాయలంటే మాటలా.. ఆ వంద రూపాయలు పాలవాడి ఖర్చుకు సరిపోతుంది. వాళ్ళు మాత్రం పేపరును తింటారా? చదివి పక్కనపడేసేదే కదా.. అందుకని చదువుతున్నాను. వీటిని జాగ్రత్తగా తీసిపెట్టి అమ్మితే ఒకరోజు కూరలు కొనుక్కోవచ్చు’’ అన్నాడు పేపరు మడతపెడుతూ.
భర్త మాటలకు అలవాటుపడటం ఈమధ్యనే నేర్చుకుంటుంది సులోచన.
‘‘అన్నట్లు ఈ సంవత్సరం పిల్లల బుక్స్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పు. బుక్‌షాపులో అమ్మేసి నెక్స్ట్ క్లాసు బుక్స్ కొనచ్చు’’ అన్నాడు తాపీగా.
ఆ మాటకు సులోచన తూలిపడబోయి తలుపు పట్టుకుని నిలబడింది.
హ్యాండ్ బ్యాగ్ టేబుల్‌పై పెట్టి హాలు సర్దసాగింది సులోచన.
‘‘అవన్నీ తర్వాత ముందు వంట చేయ్ ఆకలేస్తుంది’’
‘‘ఈ రోజు భోం చెయ్యలేదా’’ అడిగింది- క్యాంటీన్‌లో లంచ్ చేయమని చెప్పిన విషయం గుర్తొచ్చి.
‘‘చేసాను.. గ్రాండ్ కాకతీయ నుంచి బిర్యాని, తాజ్ కృష్ణ నుంచి పీతల పులుసు, గ్రీన్‌పార్క్‌నుంచి మటన్ రోస్ట్ తెప్పించుకున్నాను’’ కచ్చగా చెప్పాడు సునందారావు.
మొగుడి వెటకారం అర్థం అయింది.
ఇడ్లీకి సాంబారు ఫ్రీ అని కప్పులకొద్దీ సాంబారు తాగే మొగుడు ఫైవ్‌స్టార్ నుంచి లంచ్ ఎందుకు తెప్పించుకుంటాడు. మొగుడి వంక చూసి తన కర్తవ్యం అర్థమైనట్లు కిచెన్‌లోకి వెళ్లింది.
వెంటనే వెనకనుంచి సునందారావు భార్య వెనుక నడుస్తూ.. ‘‘ఏంటీ ఈ మొగుడు వెధవ స్టార్ హోటల్‌లో తినడమేంటి?

ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482